చీరకట్టు, కొప్పున మల్లెలతో మెరిసిన హీరోయిన్ వైష్ణవి.. బేబీ మెగా కల్ట్ సెలెబ్రేషన్స్ లో సందడి 

Published : Jul 30, 2023, 10:52 PM ISTUpdated : Jul 30, 2023, 11:00 PM IST

తాజాగా బేబీ చిత్ర యూనిట్ మెగా కల్ట్ సెలెబ్రేషన్స్ పేరుతో సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో వైష్ణవి తన గ్లామర్ లుక్స్ తో అందరిని ఆకర్షించింది. చీరకట్టులో మెరిసి ఆకట్టుకుంది. 

PREV
110
చీరకట్టు, కొప్పున మల్లెలతో మెరిసిన హీరోయిన్ వైష్ణవి.. బేబీ మెగా కల్ట్ సెలెబ్రేషన్స్ లో సందడి 

బేబీ చిత్ర జైత్ర యాత్ర కొనసాగుతోంది. చిన్న చిత్రం గా విడుదలైన బేబీ మూవీ అతిపెద్ద సంచలనం సృష్టించింది.  యువతని ఆకట్టుకుంటూ ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 

 

210

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ క్రిటిక్స్ నుంచి ప్రశంసలు, ప్రేక్షకుల పాజిటివ్ రెస్పాన్స్ తో ఇప్పటికీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.   

310

తాజాగా బేబీ చిత్ర యూనిట్ మెగా కల్ట్ సెలెబ్రేషన్స్ పేరుతో సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కావడం విశేషం.

 

410

ఈ ఈవెంట్ లో వైష్ణవి తన గ్లామర్ లుక్స్ తో అందరిని ఆకర్షించింది. చీరకట్టులో మెరిసి ఆకట్టుకుంది. కొప్పున మల్లెపూలతో అచ్చతెలుగు అమ్మాయిలా మెరిసింది. అంతే కాదు చిరంజీవి నుంచి ప్రశంసలు కూడా దక్కించుకుంది. 

510

వైష్ణవి పాత్రలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. కానీ ఈ అమ్మాయి ఎంతో సహజంగా నటించింది. సహజ నటి జయసుధ తర్వాత అంత నేచురల్ గా నటించే నటి నాకు కనిపించలేదు. వైష్ణవిలో ఆ లక్షణాలు ఉన్నాయి అంటూ చిరు ఆమెపై ప్రశంసలు కురిపించారు. 

610

వైష్ణవి మాట్లాడుతూ లైఫ్ లో మెగాస్టార్ చిరంజీవి గారిని చూస్తే చాలు అనుకున్నా. ఆయన మేము నటించిన సినిమా సక్సెస్ మీట్ కు రావడం కల నిజమైనట్లు ఉంది. ఆయన పాటకు ఒకసారి కవర్ సాంగ్ చేస్తే లక్షల వ్యూస్ వచ్చాయి. అలాంటి క్రేజ్ మెగాస్టార్ ది. 

710

ప్రతి ఒక్క ప్రేక్షకుడి గుండెల్లో ఉంటారు చిరంజీవి గారు. ఆయనకు మా టీమ్ తరపున హార్ట్ ఫుల్ గా థాంక్స్ చెబుతున్నా. మనం కష్టపడి సినిమా చేశాక ప్రేక్షకుల ఇచ్చే లవ్ చూస్తుంటే ఎంతో సంతృప్తిగా ఉంది. తెలుగు అమ్మాయిలు సందేహం లేకుండా ఇండస్ట్రీలోకి రండి. మీకు అవకాశాలు ఇచ్చేవాళ్లు ఉంటారు అని చెప్పింది.

810

హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ - బేబీ సినిమా హిట్ అవడానికి మూడు రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఛాలెంజింగ్, టాలెంటెడ్ టీమ్ ను ఒక దగ్గరకు తీసుకొచ్చి సినిమాకు పెట్టిన ప్రొడ్యూసర్ ఎస్కేఎన్. రెండోది మా డైరెక్టర్ సాయి రాజేష్. మూడోది సినిమా బాగుంటే ఎలాంటి రీజన్స్ చూడకుండా సక్సెస్ చేసే ప్రేక్షకుల ప్రేమ. 

910

బలగం, సామజవరగమన, బేబీ..ఇలాంటి చిన్న సినిమాలన్నీసూపర్ హిట్స్ చేశారు. సాయి రాజేష్ రేపటి రోజున కాబోయో స్టార్ డైరెక్టర్. అది బేబీ సినిమా నుంచే మొదలైంది. నిన్న బేబీ, ఇవాళ బ్రో, రేపు రాబోయో భోళా శంకర్ తో ఇంకో పెద్ద పండగ వస్తోంది అని ఆనంద్ దేవరకొండ అన్నారు. 

1010

తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వైష్ణవి ఇప్పుడు టాలీవుడ్ ఆమె పేరు మారుమోగుతోంది. షార్ట్ ఫిలిమ్స్, యూట్యూబ్ రీల్స్ తో పాపులర్ అయిన వైష్ణవి బేబీ మూవీ లో అవకాశం దక్కించుకుని నిరూపించుకుంది. 

click me!

Recommended Stories