వద్దు సార్ నేనే వచ్చేస్తాను, ఇంటికి దగ్గరలోనే ఉన్నాను ఈరోజు మానవత్వం లేని ఒక మనిషిని చూశాను ఇంటికి వచ్చాక అదంతా చెప్తాను అని ఫోన్ పెట్టేస్తుంది వసు. మరోవైపు సౌజన్య రావు, వసుతో గొడవపడిన వ్యక్తికి ఫోన్ చేసి డీలింగ్ కుదరలేదు మీరు చెప్పిన పని చేయలేనందుకు సారీ అంటాడు. దొంగలు పడిన ఆరు నెలలకి కుక్కలు మొరిగినట్లు ఇప్పుడు చెప్తున్నావా? అన్ని విషయాలు నాకు ముందే తెలిసాయి.