ఏమి పర్వాలేదు నిదానంగా వెలిగించు అంటారు పంతులుగారు. అప్పుడు దీపాన్ని వెలిగిస్తుంది దివ్య. అప్పుడే తులసి వాళ్ళు వస్తారు. తల్లిని పట్టుకొని ఏడుస్తుంది దివ్య. ఏం జరిగింది అంటూ కంగారు పడతారు తులసి, నందు. ఏం జరిగింది ఎవరైనా ఏమైనా అన్నారా అంటూ కంగారుగా అడుగుతాడు నందు. ఏమి చెప్పకపోతే ఎలా, మీ నాన్న చూడు ఎంత కంగారు పడుతున్నాడో అంటాడు పరంధామయ్య. ఏమీ లేదు పూజకు సంబంధించిన పనులు ఏవి చేయలేకపోతున్నాను నేను కోడలుగా పనికిరానా, అంటూ కన్నీరు పెట్టుకుంటుంది దివ్య.