Guppedantha Manasu: దేవయానిలో బయటపడ్డ మరో కోణం.. నట విశ్వరూపాన్ని చూపిస్తున్న శైలేంద్ర!

Published : Apr 29, 2023, 10:15 AM IST

Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. కొడుకు మంచి కోసం ఎంతకైనా తెగించే ఒక తల్లి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 29 ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూద్దాం.  

PREV
18
Guppedantha Manasu: దేవయానిలో బయటపడ్డ మరో కోణం.. నట విశ్వరూపాన్ని చూపిస్తున్న శైలేంద్ర!

 ఎపిసోడ్ ప్రారంభంలో ఆయన నన్ను అర్థం చేసుకునే వరకు ఇలాగే కానివ్వండి చిన్న అత్తయ్య అంటూ జగతిని పట్టుకొని  ఏడ్చేస్తుంది ధరణి. ఆమెని ఓదారుస్తూ నీ కాపురాన్ని నువ్వే చక్కపెట్టుకో ఎవరి మీద ఆధారపడకు అని ధైర్యం చెప్పి వెళ్ళిపోతుంది జగతి. మరోవైపు టీ  తాగుతున్న శైలేంద్ర నాతో ఏదో మాట్లాడాలన్నావు ఏంటది అని తల్లిని అడుగుతాడు.
 

28

నాకు ఒక ఆశ ఉంది, మన కాలేజ్ తాతగారు కట్టించింది దాని ఎండి  పోస్ట్ అయితే నాన్నగారికి ఉండాలి లేదంటే నీకు ఉండాలి కానీ అందరూ కలిపి ఆ రిషి ని ఎండి చేశారు, వాడేమో దానిని మహా సామ్రాజ్యంగా విస్తరించి దానికి చక్రవర్తి అయ్యి కూర్చున్నాడు. ఆ సామ్రాజ్యానికి నువ్వే చక్రవర్తివి కావాలి అంటుంది దేవయాని. నేను వెళ్లి ఆ సీట్లో కూర్చోవడం ఏంటి, వాళ్లే వచ్చి నన్ను బ్రతిమాలి మరీ ఆ సీట్లో కూర్చోబెట్టేలాగా చేస్తాను అంటాడు శైలేంద్ర.
 

38

నేనే ఎక్కువగా ఆలోచిస్తున్నాను అంటే నాకంటే బాగా ఆలోచిస్తున్నావు నువ్వు అంటూ కొడుకుని మెచ్చుకుంటుంది దేవయాని. అంతలోనే రిషి రావటంతో వినేసాడేమో అని ఇద్దరూ కంగారు పడతారు. కానీ రిషి మామూలుగానే మాట్లాడుతాడు, ఫారెన్ సంగతులు ఏంటి అని అన్నయ్యని అడుగుతాడు. పెద్దగా విశేషాలు ఏమీ లేవు, అయినా నువ్వే చెప్పాలి మన కాలేజీ విశేషాలు అంటాడు శైలేంద్ర.
 

48

కాలేజీకి వచ్చి చూడు అన్నయ్య నువ్వు ఫారెన్ వెళ్ళకు ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందో చూసి చెప్పు. కాలేజీ డెవలప్మెంట్ కి ఏమైనా సజెషన్స్ ఇవ్వు అంటాడు రిషి. సరే అంటాడు శైలేంద్ర. సరే అయితే రేపు ఎర్లీగా లెగు, ఇద్దరం కలిసి కాలేజీకి వెళ్దాం అని చెప్పి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతాడు రిషి. మరోవైపు ముభాగంగా ఉన్న ధరణిని చూసి బాధపడతారు వసు, జగతి.

58

 శైలేంద్ర అంటే ధరణికి చాలా ఇష్టం కానీ అతను తిరిగి వచ్చిన ఆనందం ధరణి కళ్ళల్లో కనిపించడం లేదు, వాళ్ళిద్దరి మధ్యలో సఖ్యత లేనట్లుగా ఉంది  అంటుంది జగతి. ఇదంతా వింటున్న  శైలేంద్ర వీళ్ళు నన్ను గమనిస్తున్నట్లున్నారు నేను మరింత జాగ్రత్త పడాలి అనుకొని ధరణి దగ్గరికి వెళ్లి నేను నీతో కులాసాగా కబుర్లు చెబుదామని నీకోసం వెయిట్ చేస్తున్నాను కానీ నువ్వు ఎప్పుడూ వంటగదిలోనే ఉంటావు అంటూ ఓవరాక్షన్ చేస్తుంటాడు శైలేంద్ర.అతని ప్రవర్తనకి ఆశ్చర్య పోతుంది ధరణి.

68

 ఎక్కువగా రియాక్ట్ అవ్వకు వెనకాతల పిన్ని వాళ్ళు ఉన్నారు నేనేమీ నిన్ను కొట్టి తిట్టడం లేదు కదా మొహం ఎందుకు ఎప్పుడు అలా పెట్టుకుంటావు కాస్త నవ్వుని మెయింటైన్ చెయ్యు అంటూ కోపంగా చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు శైలేంద్ర. నేరుగా జగతి వాళ్ళ దగ్గరికి వెళ్లి ధరణి ఎందుకో త్వరగా కలవలేక పోతుంది, మీరైనా చెప్పండి పిన్ని తనని మారమని.తను అలా ఉంటే అత్తలకి  నచ్చుతుందేమో కానీ నాకు నచ్చదు కదా అంటాడు శైలేంద్ర.

78

 నువ్వు రోడ్డు మీద నన్ను ప్రశ్నించిన తీరు నాకు నచ్చింది కాస్త ధరణికి ఆ ధైర్యము, తెగింపు నేర్పించవచ్చు కదా అని వసు కి చెప్తాడు శైలేంద్ర. అలాంటి స్వభావాలు వాళ్ళకి వాళ్ళుగా మారితేనే వస్తాయి, ఒకరు చెప్తే రావు అంటుంది వసు. తనలో మార్పు కోసం ఎదురు చూస్తూ ఉంటాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శైలేంద్ర.మరోవైపు రిషి వసు చాటింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇద్దరికీ నిద్ర రాకపోవడంతో టెర్రస్ మీదికి వెళ్లి మాట్లాడుకోవాలి అనుకుంటారు.

88

 అంతలోనే అక్కడికి వచ్చిన జగతి ఏంటి చందమామతో కబుర్లు చెప్పుకోవటానికా అంటూ వసుని ఆట పట్టిస్తుంది. అంతలోనే దిండు చాప తీసుకొని బయటికి వచ్చిన ధరణిని చూసి అవాక్కవుతారు  జగతి, వసు. ధరణి దగ్గరికి వెళ్లబోతుంది వసు. తొందరపడొద్దు, ఇది మాట్లాడే సమయం కాదు, మనం గమనిస్తున్నామని తెలిస్తే ధరణి బాధపడుతుంది  అంటుంది జగతి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

click me!

Recommended Stories