ఎందుకు అలా అంటున్నావు అంటూ విక్రమ్ వారిస్తున్నా వినకుండా కూరని టేస్ట్ చేసి బిత్తరపోతుంది దివ్య. ఇంత చేదుగా ఉంటే అలా లొట్టలేసుకొని ఎలా తింటున్నావు, అయినా అన్ని అమ్మ చెప్పినట్లే చేశాను, అయినా ఎక్కడ తేడా వచ్చింది అంటుంది దివ్య. వంకాయల్ని ఉప్పు నీటిలో కడిగావా అని అడుగుతాడు విక్రమ్. లేదు అంటుంది దివ్య. అందుకే చేదు వచ్చింది అంటాడు విక్రమ్. హాస్పిటల్ కి వచ్చిన తులసి వాళ్ళు లాస్య ని వెతుకుతూ ఉంటారు. అంతలోనే ఒక సిస్టర్ పలకరించి లాస్య మేడం కూడా వచ్చారు ఎండి మేడం రూమ్ లో ఉన్నారు అని చెప్తుంది. మరోవైపు దివ్య, ప్రియ వద్దని చెప్తున్నా వినకుండా మామగారికి భోజనం తినిపించడానికి వెళ్తుంది.