థియేటర్లలో సందడి చేసిన షాహిద్ కపూర్, రష్మిక మందన్న, కృతి సనన్ నటించిన రొమాంటిక్ డ్రామా 'కాక్‌టెయిల్ 2' ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమ్ అవుతుందో తెలుసుకుందాం. అలాగే, ఈ సినిమా కథ, నటీనటుల వివరాలు కూడా చూద్దాం.
షాహిద్ కపూర్, రష్మిక, కృతి సనన్ నటించిన 'కాక్‌టెయిల్ 2' ఓటీటీలోకి వచ్చేస్తోంది. హోమీ అదజానియా దర్శకత్వం వహించిన ఈ సినిమా, జూన్ 19న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు, సరిగ్గా రెండు నెలల తర్వాత, ఆగస్టు 14, 2026 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇది 2012 నాటి 'కాక్‌టెయిల్'కు స్పిరిచ్యువల్ సీక్వెల్ అయినా, కథ, పాత్రలు పూర్తిగా కొత్తవి.
23
సినిమా కథ
ఈ సినిమా కథ సిసిలీలో జరుగుతుంది. పెళ్లి విషయంలో కుటుంబం నుంచి ఒత్తిడి రావడంతో, కునాల్, దియా జంట సిసిలీకి వెళ్తారు. అక్కడ కునాల్ నమ్మకాన్ని పరీక్షించడానికి, దియా తన స్నేహితురాలు ఎల్లీని అతనితో ఫ్లర్ట్ చేయమని అడుగుతుంది. కానీ, అనుకోకుండా ఎల్లీ.. కునాల్‌తో ప్రేమలో పడుతుంది. దీంతో ప్రేమ, నమ్మకం, స్నేహం మధ్య ఓ ఎమోషనల్ ట్రయాంగిల్ మొదలవుతుంది.
33
మిక్స్‌డ్ రివ్యూలు
షాహిద్ కపూర్, రష్మిక, కృతి సనన్ కలిసి నటించిన తొలి సినిమా ఇదే. ఈ చిత్రానికి మిక్స్‌డ్ రివ్యూలు వచ్చినా, 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇండియాలో రూ.104.55 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.166 కోట్లు వసూలు చేసింది. అయితే, రూ.110 కోట్ల బడ్జెట్‌ను మాత్రం పూర్తిగా రికవరీ చేయలేకపోయిందని సమాచారం.