రోజుకు 100 సిగరెట్లు తాగిన హీరో.. సడెన్ గా సంచలన నిర్ణయం వెనుక కారణం ఏంటి..? ఎవరా హీరో..?

First Published | Nov 4, 2024, 10:32 PM IST

ఇండియన్ ఫిల్మమ్ ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరో ఒక్కోసారి రోజుకు 100 సిగరేట్లు కాల్చేవారట. అటువంటి స్టార్ హీరో సడెన్ గా ఒరోజు సంచల నిర్ణయం తీసుకున్నారట. ఇంతకీ ఎవరా హీరో..? ఏంటా నిర్ణయం..? 

smoking cigarette

స్మోకింగ్.. సామాన్యులు సెబ్రిటీలు అన్న తేడా లేకుండా అలవాటై ఉంటుంది. కాకపోతే తాగే సిగరేట్ లో కాస్త్ తేడా ఉంటుందేమో అంతే కాని పొగ త్రాగడం మాత్రం కామన్. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా గట్టిగా స్మోక్ చేసే స్టార్స్ చాలామంది ఉన్నారు. హీరోలలో చైన్ స్మోకర్స్ ఉన్నారు. కాసేపైనా సిగరెట్ వెలిగించకుండా ఉండలేనివారు ఎంతో మంది. అయితే ఇండస్ట్రీకి చెందిన ఓ పాన్ ఇండియా స్టార్ హీరో ఒకరు సిగరెట్ల విషయంలో రికార్డ్ సృష్టించారట. 

Also Read:  సమంతతో కలిసి నాగార్జునను మోసం చేసిన నాగచైతన్య

ఆయన ఒక్కోటైమ్ లో రోజుకు వంద సిగరేట్లు కూడా తాగిన రోజులు ఉన్నాయట. అటువంటి హీరో.. సడెన్ గా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారట. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా..? ఆ స్టార్ హీరో ఎవరో కాదు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్. కింగ్ ఖాన్ షారుఖ్‌ కు కూడా మొన్నటివరకు ఈ చెడ్డ అలవాటు ఉండేది. ఒక్కోసారి 100 సిగరెట్లుకు పైగా కాల్చేవాడట.  

Also Read: విజయ్ దేవరకొండకు గాయాలు, షూటింగ్ స్పాటో ప్రమాదం


smoking

అయితే షారుఖ్ ఖాన్ ఈ అలవాటు కారణంగా కొన్ని వివాదాల్లో కూడా ఇరుక్కున్నారు. కొన్నిసార్లు పబ్లిక్ ప్లేస్‌లో సిగరెట్ తాగి  వివాదాస్పాదం అయ్యాడు.  షాకింగ్ విషయం ఏంటంటే.. షారుఖ్ ఖాన్  పూర్తిగా మారిపోయాడు. పొగతాగడం మానేశాడు.

రీసెంట్ గా తన బర్త్ డే సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. నేను స్మోకింగ్ మానేశాను..పూర్తిగా మానేశాను. ఈ విషయాన్ని నేను గర్వంగా చెపుతున్నాను అని అన్నారు. 

Also Read:  రజినీకాంత్ ముందు మోహన్ బాబు పరువు తీసిన చిరంజీవి,

ఈ విషయంలో షారుఖ్ అభిమానులు దిల్ ఖుష్ అవుతున్నారు. ఇంతకీ ఆయన ఈ నిర్ణయం తీసుకోడానికి రెండు కారణాలు ఉన్నాయి. వయస్సుతో పాటు అనారోగ్యం షారుఖ్ మనసులో భయాన్ని పుట్టించినట్టుంది. ప్రస్తుతం 59 ఏళ్ళ బాద్షా.. త్వరలో 60 లోకి ఎంటర్ అవ్వబోతున్నాడు. దానికితోడు అతనికి కాస్త బ్రీథింగ్ ప్రాబ్లమ్ కూడా ఉందట. అది స్మోకింగ్ వల్ల ఎక్కువయ్యే ప్రమాదం ఉండటం కూడా ఈ నిర్ణయానికి కారణం. 

Also Read:  ప్రభాస్ కు రెండు మేజర్ సర్జరీలు జరిగాయా.. రామ్ చరణ్ చెప్పిన రహస్యం ఏంటంటే..?

ఆ సమస్యనుంచి షారుఖ్ ఇంకా బయటపడలేదట. త్వరలో ఆ ప్రాబ్లమ్ కూడా అధికమిస్తానంటున్నాడు బాలీవుడ్ బాద్ షా. ఈ వయస్సులో కూడా సూపర్ యాక్టీవ్ గా ఉన్నాడు షారుఖ్. సిక్స్ పాక్ బాడీతో అదరగొడుతున్నాడు. సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాడుకాబట్టి అతనికి ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఈ క్రమంలోనే ట్టి స్మోకింగ్ కు దూరంగా ఉండాలని షారుఖ్ మంచి నిర్ణయం తీసుకున్నాడు. 
 

అంతే కాదు స్మోకింగ్ అలవాటు ఉన్న ప్రతీ ఒక్కరు  ఈ చెడ్డ అలవాటును వదిలేయాలంటూ షారుఖ్ ఖాన్ మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్  గా మారింది. మరి చాలా విషయాల్లో తమ అభిమాన నటుడిని ఫాలో అయ్యే అభిమానులు ఈ విషయంలో ఏం చేస్తారో చూడాలి. షారుఖ్ ను ఆదర్శంగా తీసుకుని ఎంత మంది స్మోకింగ్ మానేస్తారో కూడా చూడాలి. 

Latest Videos

click me!