Sept 19 Release Movies: ఈ వారం థియేటర్లో విడుదలయ్యే సినిమాలివే, వారికిది పండగ టైమ్‌, సత్తా చాటేదెవరు?

Published : Sep 14, 2025, 09:04 PM IST

Sept 19 Release Movies: సెప్టెంబర్‌ 19న పెద్ద సినిమాలు లేవు. దీంతో ఇది చిన్న సినిమాలకు మంచి టైమ్ గా చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే వారికిది పండగ చేసుకునే టైమ్‌గా చెప్పొచ్చు. మరి ఈ వారం థియేటర్లో విడుదలయ్యే సినిమాలేంటో చూద్దాం.  

PREV
16
ఈ వారం థియేటర్లో విడుదలయ్యే సినిమాలివే

టాలీవుడ్‌లో ఈ వారం పెద్ద సినిమాలు గ్యాప్‌ ఇచ్చాయి. బిగ్‌ బడ్జెట్‌ మూవీస్‌ లేకపోవడంతో చిన్న చిత్రాలకు కలిసి వస్తోంది. ఈ వారం(సెప్టెంబర్‌ 19) విడుదలయ్యే సినిమాల్లో చాలా వరకు చిన్న సినిమాలే ఉన్నాయి. తమిళ హీరో విజయ్‌ ఆంటోనీ నటిస్తోన్న `భద్రకాళి` తప్ప, మిగిలిన అన్ని సినిమాలు తక్కువ బడ్జెట్ చిత్రాలు కావడం విశేషం. వాటిలో మంచు లక్ష్మి, మోహన్‌బాబు నటించిన `దక్ష`, అంకిత్‌కొయ్య నటించిన `బ్యూటీ`, అలాగే `ఇలాంటి సినిమా మీరెప్పుడు చూసుండరు`, `వీరచంద్రహాస` వంటి చిత్రాలు ఈ శుక్రవారం విడుదల కాబోతున్నాయి. ఆయా సినిమాల వివరాలు తెలుసుకుందాం. 

26
మోహన్‌ బాబు, మంచు లక్ష్మి కలిసి నటించిన తొలి మూవీ `దక్ష`

మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ అండ్ మంచు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై రూపొందిన మూవీ ‘దక్ష - ది డెడ్‌లీ కాన్స్పిరసీ’ (Daksha – The Deadly Conspiracy). ఈ సినిమాలో మంచు మోహన్ బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. తండ్రీ కూతుళ్లు కలిసి మొదటి సారిగా ఈ చిత్రంలో నటించడం విశేషం. సముద్రఖని మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వంశీ కృష్ణ మల్లా అందించారు. ఈ నెల 19న ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

36
పొలిటికల్ యాక్షన్‌ థ్రిల్లర్ గా `భద్రకాళి`

విజయ్‌ ఆంటోని తన ప్రతి సినిమాని తమిళంతోపాటు తెలుగులో విడుదల చేస్తున్నారు. సినిమా సినిమాకి తానేంటో నిరూపించుకుంటున్నారు. కంటెంట్ ఉన్న చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరవుతున్నాడు. అందులో భాగంగా ఇప్పుడు ఆయన `భద్రకాళి` అనే చిత్రంతో ఈశుక్రవారం ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. అరుణ్‌ ప్రభు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పకులు.  పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కాబోతుంది.

46
యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా `బ్యూటీ`

అంకిత్‌ కొయ్య చిన్న చిన్నగా లవ్‌ స్టోరీస్ చేస్తూ హీరోగా ఎదుగుతున్నాడు. తాజాగా ఆయన `బ్యూటీ` చిత్రంతో రాబోతున్నారు. ఇందులో నీలఖి హీరోయిన్‌గా నటించింది. జే ఎస్‌ ఎస్‌ వర్థన్‌ దర్శకుడు. కథ, స్క్రీన్‌ప్లేని ఆర్‌ వీ సుబ్రహ్మణ్యం అందించారు. జీ స్టూడియోస్‌, మారుతీ టీమ్‌ ప్రొడక్ట్స్, వానర సెల్యూలాయిడ్‌ పతాకంపై విజయ్‌ పాల్‌ రెడ్డి అడిదల, ఉమేష్‌ కుమార్‌ భన్సల్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ఈ శుక్రవారం ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తుంది. ఈ మూవీకి దర్శకుడు మారుతి సపోర్ట్ ఉండటం విశేషం.

56
క్రేజీగా `ఇలాంటి సినిమా మీరెప్పుడు చూసుండరు`

రాజాకృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న తాజా చిత్రం 'ఇలాంటి సినిమా మీరెప్పుడు చూసుండరు'. తెలుగులోనే కాదు ప్రపంచ సినిమా చరిత్రలోనే ఎవరు చేయని విధంగా ఒకే షాట్లో సినిమా మొత్తాన్ని తెరకెక్కించి అందరిని ఆశ్చర్యశకితులను చేశాడు ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో సూపర్ రాజా. ఈ మూవీలో సూపర్‌ రాజాతోపాటు వంశీ గోనె, చందన పాలంకి, రమ్య ప్రియ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సిద్ధార్థ్‌ శివదాసని, సభువర్గీస్‌ సంగీతం అందిస్తున్నారు. రాజా కృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై మూవీ నిర్మితమైంది. ఈ నెల 19న ఈ చిత్రం కూడా థియేటర్లో విడుల కాబోతుంది. అయితే ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుండటం విశేషం.

66
రవి బస్రూర్ రూపొందించిన ‘వీర చంద్రహాస’

`కేజీయఫ్`, `సలార్` లాంటి యాక్షన్ చిత్రాలకు సంగీతం అందించి మ్యూజిక్ డైరెక్టర్‌‌గా ఒక సంచలనం సృష్టించిన రవి బస్రూర్ దర్శకుడిగా మారి `వీర చంద్రహాస` చిత్రాన్ని తెరకెక్కించారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఇందులో కీలక పాత్ర పోషించగా, శిథిల్ శెట్టి, నాగశ్రీ జిఎస్, ప్రసన్న శెట్టిగార్ మందార్తి, ఉదయ్ కడబాల్, రవీంద్ర దేవాడిగ, నాగరాజ్ సర్వెగర్ ప్రధాన పాత్రలు పోషించారు.  హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో ఓంకార్ మూవీస్ బ్యానర్‌‌పై ఎన్ ఎస్ రాజ్‌కుమార్ నిర్మించారు. ఏప్రిల్ 18న కన్నడలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఈ మూవీ తెలుగు రిలీజ్‌ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  కంచి కామాక్షి కోల్‌కతా కాళీ క్రియేషన్స్ బ్యానర్‌‌పై ఎమ్‌వీ రాధాకృష్ణ తెలుగులో ఈ నెల 19న రిలీజ్‌ చేస్తున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories