బిగ్ బాస్ ఫేమ్ నైనికా క్యాస్టింగ్ కౌచ్ అనుభవం, తండ్రి చేసిన టార్చర్, అమ్మ కోసం తన కలను వెల్లడిస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తనకి తెలిసిన ఇండస్ట్రీ వ్యక్తి ఒకరు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడినట్లు నైనికా పేర్కొంది.
బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్‌గా పాల్గొని తన క్యూట్‌నెస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న నైనికా తాజాగా ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢీ షోతో నైనికా డ్యాన్సర్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఢీ షోలో తన డ్యాన్స్ మూమెంట్స్, గ్లామరస్ అప్పియరెన్స్ తో నైనికా ఫేమస్ అయింది. తాజాగా ఇంటర్వ్యూలో నైనికా కాస్టింగ్ కౌచ్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
25
క్యాస్టింగ్ కౌచ్ అనుభవం
నైనికా మాట్లాడుతూ, సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పరిస్థితులు విపరీతంగా పెరిగాయని తెలిపారు. “ఇండస్ట్రీ వల్గర్‌గా తయారైంది. ఓపెన్‌గా కమిట్మెంట్స్ అడుగుతున్నారు. ఒకసారి నాకు తెలిసిన వ్యక్తి బ్రాండ్ ప్రమోషన్స్ పేరుతో ఫోన్ చేశాడు. మొదట్లో ఆయన చెప్పిన పర్సనల్ రిక్వెర్‌మెంట్ అంటే ఏమిటో అర్థం కాలేదు. కానీ పదేపదే అదే మాట చెబుతుండటంతో విషయం స్పష్టమైంది. అంతేకాకుండా, మీ ఫోటోతో పాటు మీ రేటు బయటకు వెళ్తుంది, బాగా వైరల్ అవుతుంది అని వల్గర్ గా చెప్పాడు. అతడి కామెంట్స్ తో తనకి చాలా కోపం, అసహ్యం కలిగింది అని నైనికా పేర్కొంది.
35
అమ్మాయిల వల్లే పరిస్థితి క్రియేట్ అవుతోందా?
“కొంతమంది అమ్మాయిల వల్లే ఈ పరిస్థితి వస్తుంది. కమిట్మెంట్ ఇస్తేనే ఆఫర్స్ వస్తాయని క్రియేట్ చేశారు” అని ఆమె చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయిలలోనే ఈ అభిప్రాయం ఉంది. కమిట్మెంట్ కి రెడీ అయితే ఆఫర్స్ వస్తాయనే కొంతమంది అలాగే చేస్తున్నారు. ఒక వేళ నేను నటిని అయితే.. నా కూతుర్ని ఇండస్ట్రీకి రానివ్వను అని నైనికా తేల్చి చెప్పింది.
ఇక తన కుటుంబ పరిస్థితులపై నైనికా మాట్లాడుతూ, “మా నాన్న మా అమ్మను, నన్ను టార్చర్ చేశారు. ఆయన డొమెస్టిక్ వైలెన్స్ చేశారు. మా నాన్న మంచివారు కాదు. అందుకే నేను ఆయనను ఇంటి నుంచి వెళ్లిపోమని చెప్పా. మా అమ్మ నన్ను ఎంతో కష్టపడి పెంచింది. ఆమెలా నేను నా పిల్లలను పెంచలేను” అని భావోద్వేగంగా తెలిపారు.
55
అమ్మ కోసం కలల లక్ష్యం
“నా అమ్మ చాలా కష్టాలు పడ్డారు. అమ్మకు ఒక సొంత ఇల్లు కొనివ్వడం నా జీవితంలో ప్రధాన లక్ష్యం” అని నైనికా చెప్పుకొచ్చారు. అందుకే తాను ప్రస్తుతం కష్టపడుతున్నట్లు నైనికా పేర్కొంది.