OG Update: ఓజీ మూవీ ట్రైలర్‌ అప్‌ డేట్.. పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్ కి పండగ స్టార్ట్ అయ్యేది అప్పుడే

Published : Sep 14, 2025, 07:07 PM IST

OG Update: పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటిస్తున్న `ఓజీ` సినిమా ట్రైలర్‌ అప్‌ డేట్‌ వచ్చింది. ఈ మూవీ ట్రైలర్‌ని విడుదల చేసేందుకు టీమ్‌ సన్నాహాలు చేస్తుంది. టైమ్‌ని ఫిక్స్‌ చేశారట.  

PREV
14
ఫ్యాన్స్ కోరుకున్నట్టుగా `ఓజీ`లో పవన్‌ని చూపిస్తోన్న సుజీత్‌

పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్‌ ప్రస్తుతం `ఓజీ` చిత్రంతో సందడి చేసేందుకు వస్తున్నారు. ఈ మూవీపైనే అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. `భీమ్లా నాయక్‌` తర్వాత పవన్‌ నటించిన చిత్రాలు పెద్దగా ఆడకపోవడంతో అభిమానులు సక్సెస్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు. ఇటీవల వచ్చిన `హరి హర వీరమల్లు` కూడా నిరాశపరిచింది. అయితే అభిమానులు చాలా రోజులుగా `ఓజీ` కోసం వెయిట్‌ చేస్తున్నారు. ఈ మూవీపైనే భారీ అంచనాలు పెట్టుకున్నారు. తమ కోసం కావాల్సిన స్టఫ్‌ ఇందులో ఉందని భావిస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ని అభిమానులు ఎలాగైతే చూడాలనుకుంటున్నారో దర్శకుడు సుజీత్‌ ఇందులో ఆయన్ని అలా చూపిస్తున్నాడట.

24
`ఓజీ` ట్రైలర్‌ అప్‌ డేట్‌

ఇప్పటికే విడుదలైన `ఓజీ` గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. సినిమాపై అంచనాలను పెంచాయి. ఇందులో పవన్‌ లుక్‌, మ్యానరిజమ్‌, స్టయిల్‌, ఎలివేషన్‌ వాహ్‌ అనేలా ఉన్నాయి. అందుకే అభిమానులు ఎంతో ఆతృతగా ఉన్నారు. ఈ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఈ నెల 25న `ఓజీ` విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్‌ అప్‌ డేట్ వచ్చింది. ట్రైలర్‌ రిలీజ్‌కి టైమ్‌ ఫిక్స్ చేయబోతున్నారట. ప్రీ రిలీజ్‌ ఈవెంట్లో ఈ ట్రైలర్‌ ని రిలీజ్‌ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ నెల 19నగానీ, 20నగానీ ఈ ట్రైలర్‌ని విడుదల చేసే అవకాశం ఉంది. మొదట్లో ఈ ట్రైలర్‌ని ఈ నెల 15న ప్లాన్‌ చేశారు. కానీ వర్క్ కంప్లీట్ కాకపోవడంతో దాన్ని ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రోజే ప్లాన్‌ చేశారట.

34
`ఓజీ` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ డిటెయిల్స్, గెస్ట్ గా చిరంజీవి

ఇక `ఓజీ` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని ఆంధ్రాలో ప్లాన్‌ చేస్తున్నారట. దీనికి మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలుస్తోంది. పవన్‌ డిప్యూటీ సీఎం అయిన తర్వాత అన్నదమ్ములు ఒకే వేదికని పంచుకోవడం ఇదే మొదటిసారి. దీంతో ఫ్యాన్స్ కిది ఫీస్ట్ గా చెప్పొచ్చు. ఈ సందర్భం కోసం కూడా అభిమానులు ఎంతో ఆతృతగా ఉన్నారు. అయితే `ఓజీ` కంటెంట్‌ని పెద్దగా చూపించలేదు టీమ్‌. ప్రారంభంలో జస్ట్ గ్లింప్స్ ఇచ్చారు. రెండు పాటలు విడుదల చేశారు. ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్ లో ఇమ్రాన్‌ హష్మీ పాత్రని పరిచయం చేశారు. అందులో పవన్‌ లుక్‌ మాత్రమే చూపించారు ఆయన అసలైన యాక్షన్‌ని చూపించలేదు. అదే సమయంలో సినిమా ఎలా ఉండబోతుందనే దానికోసం ఫ్యాన్స్ వెయిట్‌ చేస్తున్నారు. ఆ సస్పెన్స్ కి ట్రైలర్‌తో ఫుల్‌ స్టాప్‌ పెట్టడానికి దర్శకుడు సుజీత్‌ రెడీ అవుతున్నారట. ఈ ట్రైలర్ సినిమాపై హైప్‌ని అమాంతం పెంచేలా ఉండబోతుందని సమాచారం. దీంతో పవన్ అభిమానులకు అసలైన పండగ ట్రైలర్ రిలీజ్‌ డే నుంచే ప్రారంభం కాబోతుందని చెప్పొచ్చు.

44
`ఓజీ`లో గ్యాంగ్‌స్టర్‌గా పవన్‌

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా రూపొందుతున్న `ఓజీ` మూవీలో ప్రియాంక మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇమ్రాన్‌ హష్మీ విలన్‌గా చేస్తున్నారు. అర్జున్‌ దాస్‌, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముంబయి గ్యాంగ్ స్టర్‌ ప్రధానంగా సినిమా సాగుతుందని తెలుస్తోంది. ఇందులో పవన్‌ ఓజాస్‌ గాంభీర అనే గ్యాంగ్‌ స్టర్‌గా కనిపిస్తాడట. ఆయన పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుందని, గతంలో ఎప్పుడూ చూడని విధంగా పవన్‌ రోల్‌ ఉంటుందని, ఫ్యాన్స్ కి ఫీస్ట్ లా ఉంటుందని సమాచారం. కథకి తగ్గట్టుగానే మ్యూజిక్‌ డైరెక్టర్ తమన్‌ పిచ్చెక్కించేలా బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నారని, సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లేలా ఆయన సంగీతం ఉంటుందని సమాచారం. ఇక సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్న `ఓజీ` మూవీని డీవీవీ ఎంటర్టైన్‌మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. రేపు సోమవారం(సెప్టెంబర్‌ 15న)న ఈ చిత్రంలోని `గన్స్ అండ్‌ రోజ్‌` పేరుతో సాగే పాటని విడుదల చేయబోతున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories