ఎంజీఆర్‌ను వేలంలో ఓడించిన సావిత్రి - కారణం తెలిస్తే షాక్ అవుతారు!

First Published | Oct 23, 2024, 6:42 PM IST

అలనాటి అందాల తార.. మహానటి  నటి సావిత్రి స్టార్ హీరో ఎంజీఆర్ ను  వేలంలో ఓడించారనిమీకు తెలుసా..? వీరిద్దరిమధ్య జరిగిన ఆసక్తికర పోటీ గురించి.  గెలిచిన ఆసక్తికరమైన కథను గురించి తెలుసుకుందాం..

సావిత్రి

నటి సావిత్రి సినిమాల్లో స్టార్ గా వెలుగు వెలిగినప్పుడు కోట్ల కొలది సంపాదించడమే కాకుండా, ఆ డబ్బుతో దానధర్మాలు కూడా చేసేవారు. ముఖ్యంగా యుద్ధ సమయంలో ఎన్నో సహాయాలు చేశారు. నిధుల సమీకరణ కోసం జెమిని గణేషన్ తో కలిసి సావిత్రి వేసిన నాటకం ద్వారా 12 లక్షల ఆదాయం వచ్చింది. ఆ డబ్బును తీసుకోవడానికి అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి స్వయంగా వచ్చారు. అప్పుడు ఆమె ధరించిన ఆభరణాలను కూడా దానం చేశారు.

Also Read: సమంత కొత్త బాయ్‌ ఫ్రెండ్ ఇతనేనా ?

నటి సావిత్రి

ఇదే విధంగా 1965 అక్టోబర్ చివరి వారంలో ఎ.ఎల్.శ్రీనివాసన్ నాయకత్వంలో శివాజీ గణేషన్, పద్మిని, జెమిని గణేషన్, సావిత్రి, జయలలిత, చంద్రబాబు వంటి తమిళ సినీ ప్రముఖులంతా యుద్ధంలో గాయపడిన వీరులకు ఓదార్పు చెప్పడానికి ఢిల్లీలో గుమిగూడారు. సైనికుల మధ్య కళా ప్రదర్శనలు కూడా జరిగాయి. శివాజీ - సావిత్రి కలిసి ప్రదర్శించిన సత్యవాన్ తెరుక్కూతు ముఖ్యమైనది.

Also Read: ప్రభాస్ ను ప్రేమించి.. 40 ఏళ్లు వచ్చినా పెళ్ళి చేసుకోని ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా..?


సావిత్రి సహాయం

పద్మిని, చంద్రబాబు, రాజసులోచన పాల్గొన్న బాంగ్రా నృత్యం, జయలలిత నాట్యం కూడా హైలైట్ గా ఉన్నాయి. ఆ తర్వాత అక్టోబర్ 27న జలంధర్ లోని సైనిక ఆసుపత్రికి వెళ్ళిన సావిత్రి, విల్లుపురంకు చెందిన యువకుడి చర్యతో కన్నీళ్లు పెట్టుకున్నారు. యుద్ధంలో నా చేతులు పోయాయి, అందుకే నా తలతో మిమ్మల్ని నమస్కరిస్తున్నాను అని ఆ యువకుడు చెప్పడంతో కన్నీళ్లు పెట్టుకున్న సావిత్రి, అతన్ని కౌగిలించుకుని, నువ్వు నా తమ్ముడవు అని చెప్పి తన మెడలోని బంగారు గొలుసును ఆ యువకుడి మెడలో వేశారు.

Also Read: రజనీకాంత్ వర్సెస్ కమల్ హాసన్ !

వేలంలో ఎంజీఆర్ ని ఓడించిన సావిత్రి

ఇలా ఆ కాలంలో జరిగిన ప్రతి యుద్ధంలోనూ సావిత్రి పాత్ర కొనసాగింది. ఒకసారి బంగ్లాదేశ్ నిధి కోసం హైదరాబాద్ లో ఒక జింక పిల్లను వేలం వేశారు. అందులో సావిత్రి గెలిచారు. ఎంజీఆర్ ని ఓడించి, 32 వేలకు ఆ జింక పిల్లను వేలం పాటలో సావిత్రి దక్కించుకున్నారు. ఆ వేలం డబ్బు బంగ్లాదేశ్ శరణార్థులకు అందింది. ఇలా ఎన్నో దానధర్మాలు చేసినా, ఆమె చివరి రోజుల్లో ఆమెను కాపాడలేదు.

Latest Videos

click me!