ఆ తర్వాత దర్శకత్వంలో నటించే జాక్ పాట్ కొట్టేశాడు సునీల్. రాజమోళి దర్శకత్వంలో మర్యాద రామన్న చిత్రంలో సునీల్ హీరోగా నటించారు. అక్కడి నుంచి సునీల్ పూర్తి స్థాయి హీరోగా మారిపోయాడు. పూలరంగడు, మిస్టర్ పెళ్లి కొడుకు లాంటి చిత్రాల్లో హీరోగా నటించాడు. సిక్స్ ప్యాక్ కూడా ట్రై చేశాడు. కానీ ఆ తర్వాత సునీల్ కి సరైన సక్సెస్ దక్కలేదు.