Savitri: తప్పంతా సావిత్రిదే.. మహానటి మొండితనం గురించి, రమాప్రభ చెప్పిన సంచలన విషయాలు

Published : Aug 08, 2026, 07:00 AM IST

Savitri: మహానటి సావిత్రికి జరిగిన అన్యాయం విషయంల తప్పు ఎవరిది. జెమినీ గణేషన్ సావిత్రిని నిజంగా మోసం చేశాడా? అసలు వారి ఇద్దరి మధ్య ఎలాంటి అనుబంధం ఉండేది. అలనాటి లేడీ కమెడియన్, నటి రమాప్రభ వెల్లడించిన సంచలన విషయాలు.

PREV
14
సావిత్రిని జెమినీ గణేషన్ మోసం చేశాడా..?

మహానటి సావిత్రి మరియు ‘కాదల్ మన్నన్’ జెమినీ గణేషన్‌ల వ్యక్తిగత జీవితం, వారి అనుబంధంపై సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ ఎన్నో రకాల అభిప్రాయాలు, కథనాలు ప్రచారంలో ఉన్నాయి. సావిత్రిని జెమినీ గణేషన్ మోసం చేశాడని తెలుగు ప్రజలలో చాలామంది అభిప్రాయం. మహానటి తాగుడికి బానిసై.. నరకయాతన పడటానికి ఆయనే కారణమని అంటుంటారు.

46 ఏళ్లచిన్న వయసులోనే సావిత్రి మరణించడం అభిమానులకు ఇప్పటికీ తీరని బాధను మిగిల్చింది. అయితే సావిత్రికి జరిగిన అన్యాయంలో తప్పు ఎవరిది అనే విషయంలో రకరకాల వాదనలు వినిపిస్తుంటాయి. చాలామంది జెమినీ గణేషన్ ను విమర్శిస్తుంటే.. కొంత మంది మాత్రం జెమినీ మంచితనం గురించి మాట్లాడుతున్నారు.

ఆయన సావిత్రిని ఎంత ప్రేమించారన్న విషయంపై తమ వాదన వినిపిస్తున్నారు. ఈక్రమంలో ఈ సినిమా జంటకు అత్యంత సన్నిహిత సంబంధం కలిగిన సీనియర్ నటి రమాప్రభ ఒక ఇంటర్వ్యూలో సావిత్రమ్మ జీవితంలో జరిగిన పొరపాట్లు, జెమినీ గణేషన్ యొక్క మంచితనం, సావిత్రి పట్ల ఆయన ఆప్యాయత గురించి సంచలన విషయాలు వెల్లడించారు.

24
సావిత్రమ్మ చేసిన తప్పు ఏంటి?

రమాప్రభ విశ్లేషణ ప్రకారం, సావిత్రి స్వభావంలో అతిపెద్ద బలహీనత ఆమెకున్న విపరీతమైన మొండితనం. సావిత్రి గారు మనసులో ఏమాత్రం కల్మషం లేని మంచి మనిషి అయినప్పటికీ, ఆ అహం , మొండితనమే ఆమె జీవితాన్ని దెబ్బతీశాయని రమాప్రభ అన్నారు. మొండితనంతో తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఆమె ఇబ్బందులు పడింది. జెమినీ గణేషన్‌ను సాధించాలనే పట్టుదలతో, ఆయన్ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ఆమె స్వయంగా మద్యం అలవాటును పెంచుకున్నారని రమాప్రభ స్పష్టం చేశారు. సావిత్రమ్మకు ఎవ్వరూ మద్యం అలవాటు చేయలేదని, ఆమె తన సొంతంగా పట్టుదలకు పోయి ఆ రూట్ లో వెళ్లిందని రమాప్రభ అన్నారు.

34
జెమినీ గణేషన్ ఎలాంటివాడంటే?

రమాప్రభ జెమినీగణేషన్ పై పాజిటీవ్ కామెంట్స్ చేసింది. జెమినీ గణేషన్ తనను ఎంతో ప్రాణంగా ప్రేమించినప్పటికీ, కోపంలో ఆయనను పనిమనుషులతో ఇంట్లోంచి గెంటించడం, కుక్కలతో తరిమించడం వంటివి సావిత్రి చేసిందని రమాప్రభ అన్నారు. ఆ తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం సావిత్రి జీవితానికి ప్రశాంతత లేకుండా చేశాయన్నారు.

జెమినీ గణేషన్‌పై సమాజంలో ఉన్న నెగెటివ్ ముద్రను తుడిచివేస్తూ, ఆయన మంచితనం, సావిత్రి పట్ల ఆయనకున్న నిజమైన ప్రేమను రమాప్రభ వివరించారు. సావిత్రి జీవితంలో అంతటి గుర్తింపు, ఉన్నతమైన స్థానం రావడానికి జెమినీ గణేషన్ అందించిన ప్రోత్సాహం ఎంతో ఉందన్నారు. "జెమినీ మామ ప్రేమించినంతగా సావిత్రమ్మను ఈ ప్రపంచంలో ఎవ్వరూ ప్రేమించలేదు" అని రమా ప్రభ ఆవేదనతో గుర్తుచేసుకున్నారు.

44
అవమానాలను తట్టుకుని నిలిచిన ప్రేమ

సావిత్రమ్మ ఆయన్ను ఇంట్లోంచి వెళ్లగొట్టినా, జెమినీ గణేషన్ ఆమెపై ఉన్న ప్రేమను చంపుకోలేకపోయేవారు. రాత్రివేళల్లో దొంగతనంగా కాంపౌండ్ గోడ దూకి వచ్చి, కిటికీలోంచి సావిత్రమ్మను చూసి వెళ్లేవారని రమాప్రభ తెలిపారు. సావిత్రి ఎంత అపార్థం చేసుకున్నా జెమినీ గణేషన్ ఆమె మంచి గురించే ఆలోచించేవారని, ఆయన మనసు చాలా మంచిదని అన్నారు. అంతే కాదు సావిత్రి కోమాలో ఉంటే.. పగలు రాత్రి అన్న తేడా లేకుండా ఆమె చేయిపట్టుకుని అలా కూర్చుని బాధపడేవారట జెమినీగణేషన్. ఎందుకిలా చేశావ్ అమ్మాడీ అంటూ అడిగేవారట. జెమినీ మామ చాలా మంచివాడంటూ.. ఆయనపై నిందలు వేసేవారికి క్లారిటీ ఇచ్చారు రమాప్రభ.

Read more Photos on
click me!

Recommended Stories