దిక్కు తోచని స్థితిలో పవన్ కళ్యాణ్ గురువు, చిరంజీవి ఏం చేశారో తెలుసా.. టాలీవుడ్ చరిత్ర మారిపోయింది

Published : Jul 23, 2025, 07:27 PM IST

దిక్కుతోచని స్థితిలో ఉన్న తన జీవితాన్ని చిరంజీవి తీసుకున్న నిర్ణయం మార్చేసింది అని పవన్ కళ్యాణ్ గురువు సత్యానంద్ అన్నారు. ఆయన ఎందుకు అలా అన్నారో ఇప్పుడు చూద్దాం. 

PREV
15
వీరమల్లుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పవన్ 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ మానియా తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. బుధవారం నుంచి ప్రీమియర్ షోలతో హరిహర వీరమల్లు హంగామా థియేటర్స్ లో మొదలు కాబోతోంది. సినిమా ప్రమోషన్స్ కి ఎప్పుడూ పవన్ కళ్యాణ్ దూరంగా ఉంటారు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి మాత్రం హాజరై వెళ్లిపోతుంటారు. అలాంటిది పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.  

25
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ గురువు సత్యానంద్ 

పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి హరిహర వీరమల్లు చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిత్ర యూనిట్ తో పార్టీ ఎమ్మెల్యేలు కొందరు అతిథులుగా హాజరయ్యారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ నటనలో గురువైన సత్యానంద్ కూడా అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సత్యానంద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

35
నా జీవితానికి అదే టర్నింగ్ పాయింట్ : సత్యానంద్ 

సత్యానంద్ మాట్లాడుతూ.. '1992 వ సంవత్సరంలో నాకు చిరంజీవి గారి నుంచి ఫోన్ వచ్చింది. వీలైనంత త్వరగా చెన్నైకి రమ్మని చిరంజీవి గారు నన్ను పిలిచారు. నేను చెన్నైకి వెళ్ళగానే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ చేయి పట్టుకుని.. సత్యానంద్ గారు వీడు నా తమ్ముడు, మీ చేతుల్లో పెడుతున్నాను. మీరే ఇతడిని ఆర్టిస్ట్ గా తీర్చి దిద్దాలి, ఆ బాధ్యత మీదే అని చెప్పారు. అదే నా జీవితానికి పెద్ద టర్నింగ్ పాయింట్. అప్పటి వరకు నేను చిన్న చిన్న నాటకాలు వేసుకుంటూ బతుకుతున్నాను. నా జీవితం ఏంటో అనే దిక్కుతోచని స్థితిలో ఉన్నాను. 

45
చిరంజీవి నిర్ణయం వల్లే ..

ఆ టైంలో చిరంజీవి గారు నిర్ణయం తీసుకుని వజ్రం లాంటి పవన్ ని నా చేతిలో పెట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇప్పటికీ వందల మందికి నటనలో శిక్షణ ఇస్తూనే ఉన్నాను అని సత్యానంద్ తెలిపారు. తన మొదటి శిష్యుడు పవన్ కళ్యాణ్ అని తెలిపారు. 

55
సత్యానంద్ పాదాలకు నమస్కరించిన పవన్ 

 పవన్ కళ్యాణ్ తర్వాత సత్యానంద్ వద్ద మహేష్ బాబు, ప్రభాస్, శర్వానంద్, ఆది పినిశెట్టి, రవితేజ లాంటి వారు శిక్షణ తీసుకున్నారు. ప్రభాస్, మహేష్, పవన్ టాలీవుడ్ చరిత్రని మార్చేసిన స్టార్లుగా ఎదిగారు. ఇది ఆ రోజు చిరంజీవి తీసుకున్న నిర్ణయం వల్లే సాధ్యం అయింది అని సత్యానంద్ చేసిన వ్యాఖ్యల వల్ల అర్థం అవుతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ సత్యానంద్ ని సన్మానించి ఆయన పాదాలకు నమస్కరించారు. అదే విధంగా కీరవాణిని కూడా పవన్ సన్మానించారు. 

Read more Photos on
click me!

Recommended Stories