కోట శ్రీనివాసరావుని తొక్కడానికి కొంతమంది నన్ను పావుగా వాడుకున్నారు.. ఇంటికెళ్లి మరీ వార్నింగ్

Published : Jul 23, 2025, 06:01 PM IST

కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి మధ్య ఒక సందర్భంలో వివాదం జరిగింది. ఆ వివాదంలో తనని కొంతమంది వాడుకున్నారు అని భరణి కామెంట్స్ చేశారు.అసలేం జరిగిందో ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15
కోట శ్రీనివాసరావు విలక్షణ నటన

కోట శ్రీనివాసరావు తెలుగు చిత్ర పరిశ్రమ గొప్ప నటులలో ఒకరు. విలనిజం, కామెడీ, సెంటిమెంట్ ఇలా అన్ని రకాల పాత్రల్లో కోట శ్రీనివాసరావు తనదైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. ఇటీవల కోట శ్రీనివాసరావు తుదిశ్వాస విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దీనితో కోట నటనా జీవితానికి సంబంధించిన అనేక అంశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

25
కోట, తనికెళ్ళ భరణి అనుబంధం

టాలీవుడ్ సీనియర్ నటుడు తనికెళ్ళ భరణి ఓ ఇంటర్వ్యూలో కోట శ్రీనివాస రావు గురించి సంచలన విషయాలు పంచుకున్నారు. ఒక దశలో కోట శ్రీనివాస రావుకి నేనే కాంపిటీషన్, అతడికంటే నేనే గొప్ప నటుడిని అని మీరు భావించిన సంగతి నిజమే కదా అని యాంకర్ ప్రశ్నించారు. తనికెళ్ళ భరణి సమాధానం ఇస్తూ..రంగస్థలంలో నాటకాలు వేసేటప్పుడు మేమిద్దరం కలిసి ఉన్నాం. కొంతకాలం ఆయన ఇంట్లోనే నేను ఉన్నాను. త్రికరణ శుద్ధిగా చెబుతున్నా.. కోట శ్రీనివాసరావు నాకంటే, ఇండస్ట్రీలో ఉన్న చాలా మందికంటే గొప్ప నటుడు.

35
కోటని తొక్కడానికి నన్ను పావుగా వాడుకున్నారు

కోట శ్రీనివాసరావుకి నేను ఎప్పుడూ కాంపిటీషన్ కాదు. కానీ కొంతమంది కోట శ్రీనివాసరావుని పక్కకి తప్పించడానికి నన్ను పావులాగా వాడుకున్న మాట వాస్తవం అని తనికెళ్ళ భరణి తెలిపారు. ఆ విషయంలో కోట శ్రీనివాసరావు బాధపడ్డారు. ఒక చిత్రంలో ఆయన్ని తప్పించి నన్ను తీసుకున్నారు. అది ఆయనకి తెలిసింది. నేను ఇంటికి వెళ్లేసరికి కోట మా ఇంట్లో కూర్చుని ఉన్నారు. ఇదేంటి ఈయన వచ్చారు అని ఆశ్చర్యపోయా. నేను వెళ్ళగానే.. ఏవయ్యా భరణి.. ఆ వేషం నువ్వు వేస్తున్నావట కదా, వెయ్యకు అని అన్నారు. నేను ఎందుకు సార్ అని అడిగా.

45
ఇద్దరి మధ్య వివాదం ఇదే

నన్ను తీసేసి ఆ వేషం నీకు ఇస్తున్నారు, కాబట్టి నువ్వు కూడా నటించకు అని అన్నారు. దీనితో భరణి.. వాళ్ళు పెద్దవాళ్ళు సార్, నాకు సమస్య అవుతుంది. వాళ్ళకి ఎదురు తిరిగితే నా కెరీర్ కి ప్రాబ్లెమ్ అని చెప్పా. ఏంటి నాకన్నా గొప్పా వాళ్ళు, అలాంటి వేషాలు నేను ఇప్పిస్తా నీకు అని అన్నారు. మీరు ఇప్పిస్తే తీసుకోవాల్సిన స్థితి నాకు లేదు అని భరణి సమాధానం ఇచ్చారట. ఆ సినిమాలో నేను నటించాల్సిందే తప్పదు అని భరణి కోటతో అన్నారు. అక్కడే ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. వాస్తవానికి ఆ పాత్రలో కోట నటించి వుంటేనే బావుండేది అని భరణి అన్నారు.

55
అందుకే కోటని తప్పించి నన్ను తీసుకున్నారు

అయితే ఆ చిత్రం పేరు మాత్రం బయటపెట్టలేదు. కానీ అది యమజాతకుడు చిత్రం అనే ప్రచారం మాత్రం ఉంది. ఆ చిత్రంలో కోటని వాళ్ళు ఎందుకు వద్దనుకున్నారో నాకు పూర్తిగా తెలియదు. కానీ వాళ్ళు చెప్పినదాని ప్రకారం ఆయనతో మేము వేగలేం సార్ అని చెప్పారు. భరణి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories