'కరుప్పు' టీజర్‌లో సూర్య యాక్షన్ సన్నివేశాలు పుష్కలంగా ఉన్నాయి. `కొబ్బరి కాయ కొట్టి కార్పూరం వెలిగిస్తే శాంతించే దేవుడు కాదు, మనసులో మొక్కుకొని మిరపకాయలు దంచితే రుద్రుడై దిగి వచ్చే దేవుడు` అంటూ టీజర్ స్టార్ట్ అయ్యింది.
ఇందులో సూర్య తన అసలు పేరు సరవణన్‌గా నటించారు. తనకు మరో పేరు ఉందని ఆయన చెప్పడం విశేషం. దీంతో ఆయన ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు దాదాపు ఖరారైంది. అంతేకాకుండా సూర్య ఐకానిక్ సన్నివేశాలను కూడా సినిమాలో రీక్రియేట్ చేశారు.
ముఖ్యంగా ఆయన 'గజిని' సినిమాలో పుచ్చకాయ తినే సన్నివేశాన్ని ఇందులో కూడా పెట్టారు. ఈ టీజర్ మొత్తం సూర్య సన్నివేశాలతోనే నిండిపోయింది. సూర్య మాస్ కమ్ బ్యాక్ అనేలా ఉంది.
అయితే హీరోయిన్ త్రిషను ఒక్కచోట కూడా చూపించలేదు. దీంతో ఆమె పాత్ర సర్‌ప్రైజ్‌గా ఉంటుందని భావిస్తున్నారు. సినిమా రిలీజ్‌పై క్లారిటీ ఇవ్వలేదు. ఫెస్టివల్ సీజన్‌లో ఉండబోతుందని తెలుస్తోంది.