తల్లికి ఇచ్చిన మాటని జీవితాంతం నిలబెట్టుకున్న సరోజాదేవి, పిలిచి మరీ అడిగిన రాజీవ్ గాంధీకి ఊహించని షాక్

Published : Jul 14, 2025, 02:32 PM IST

బంగారు బొమ్మగా అంటూ అభిమానుల ఆప్యాయంగా పిలుచుకునే సరోజాదేవి ఇక లేరు. ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఈ కథనంలో చూద్దాం.

PREV
15
సరోజా దేవి తన తల్లికి ఇచ్చిన మాట

తెలుగు తమిళ, కన్నడ భాషల్లో అగ్రనటిగా వెలుగొందారు సరోజాదేవి. ఆమె ఎన్టీఆర్, ఏఎన్నార్, జెమిని గణేశన్ లాంటి ప్రముఖ నటులతో జతకట్టి నటించారు. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో 200కు పైగా చిత్రాల్లో నటించారు. సినిమాల్లోకి అడుగుపెట్టే ముందు తన తల్లికి ఒక మాట ఇచ్చారట. గ్లామర్ పాత్రలు చేయనని, బికినీలు వంటివి ధరించనని మాట ఇచ్చి సినీరంగ ప్రవేశం చేశారు. ఆ మాటను జీవితాంతం నిలబెట్టుకున్నారు.  

25
1967లో వివాహం

1967లో శ్రీహర్షను వివాహం చేసుకున్నారు. తర్వాత భర్త అనుమతితో తిరిగి నటించడం మొదలుపెట్టారు. ఆమె నటించిన 100వ చిత్రం 'పెణ్ణ్ ఎండ్రాళ్ పెణ్' అనే తమిళ సినిమా. దక్షిణాది సినిమాల్లో నటించడం తన పూర్వజన్మ సుకృతం అని ఆ సమయంలో చెప్పారు.  

35
అభినయ సరస్వతి సరోజా దేవి 

ఆమె నటించిన ఒకే ఒక్క సినిమా సగంలోనే వదిలేశారు. ఆ సినిమా పేరు 'చటయాడి'. ఆ సినిమాలో జైశంకర్ తో కలిసి సరోజా దేవి నటిస్తోంది. ఆ సమయంలో, ఆమె ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నందున ఆ సినిమాలో నటించడం కొనసాగించలేకపోయింది. ఈ సినిమా సగంలోనే వదిలేశారు. సరోజా దేవికి అభినయ సరస్వతి అనే పేరు రావడానికి ప్రధాన కారణం 'అన్బే వా' సినిమాలోని 'లవ్ బర్డ్స్' పాట. తన కళ్ళని చిలుకలా కదుల్చుతూ చేసిన అందమైన నృత్యం ఇప్పటికీ అభిమానుల మనసుల్లో ఉంది.

45
రాజీవ్ గాంధీకే నో చెప్పి షాకిచ్చిన సరోజా దేవి 

ఆ కాలంలో సినిమా నటీమణులకు రాజకీయ నాయకుల నుంచి ఆహ్వానాలు వచ్చేవి. సరోజాదేవికి కూడా అలాంటి ఆహ్వానమే వచ్చింది. రాజీవ్ గాంధీ ఆమెను ఢిల్లీకి పిలిపించి మాట్లాడారు. ఎంపీ పదవి ఇస్తానని, కర్ణాటకలోని మాండ్య నియోజకవర్గం నుంచి పోటీ చేయమని కోరారు. కానీ సరోజాదేవి నిరాకరించారు. ఏకంగా రాజీవ్ గాంధీ చేసిన రిక్వెస్ట్ ని ఆమె తిరస్కరించడం సంచలనంగా మారింది. అయితే సరోజా దేవి రాజీవ్ గాంధీకి నో చెప్పడం వెనుక బలమైన కారణం ఉంది.

55
రాజకీయాల్లో నిజాయతీగా ఉండడం కష్టం 

తన తండ్రి తనకు నిజాయితీగా బతకమని నేర్పించారని, అందుకే రాజకీయాలు తనకు వద్దని చెప్పారు. రాజకీయాల్లో నిజాయితీగా ఉండటం కష్టమని, ఒకరికి మంచివారైతే మరొకరికి చెడ్డవారిగా మారతామని, అందరికీ మంచివారిగా ఉండాలనే తన కోరిక అని చెప్పి రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories