
తొలితరం హీరోయిన్లలో లేడీ సూపర్ స్టార్‌గా రాణించిన హీరోయిన్ బి సరోజా దేవి. అభినయ సరస్వతిగా కీర్తించబడ్డ సరోజా దేవి హఠాన్మరణం చిత్ర పరిశ్రమకి, భారతీయ సినిమాకి తీరని లోటని చెప్పొచ్చు.
దాదాపు ఐదు దశాబ్దాలపాటు తిరుగులేని నటిగా రాణించి, ఆడియెన్స్ ని అలరించారు. అందం విషయంలో ఎంతో మంది హీరోయిన్లకి ఆదర్శంగా నిలిచారు.
అప్పట్లో ఒక హీరోయిన్‌ని ఎంపిక చేయాలంటే సరోజా దేవిలా ఉంటుందా? అని అడిగేవారట మేకర్స్. అందానికి సరోజా దేవిని కొలమానంగా చూడటం విశేషం.
సరోజా దేవి జీవితంలో అంతులేని కీర్తితోపాటు పలు విషాదాలున్నాయి. అదే సమయంలో పలు రూమర్లు కూడా ఉన్నాయి. ఆమె సీఎంతో ఎఫైర్ నడిపించిందనే రూమర్ అప్పట్లో సంచలనంగా మారింది.
ఆ సీఎం ఎవరో కాదు ఎంజీఆర్. ఎంజీ రామచంద్రన్ సీఎం కాకముందు తమిళంలో తిరుగులేని స్టార్‌గా రాణించారు. తెలుగులో ఎన్టీఆర్ ఎలాగో తమిళంలో ఎంజీఆర్ అలా.
సినిమాని, రాజకీయాలను శాసించిన వ్యక్తి ఎంజీఆర్. అయితే ప్రారంభంలో ఎక్కువగా ఆయనతోనే సినిమాలు చేసింది సరోజా దేవి.
వీరిద్దరి కాంబినేషన్‌లో ఏకంగా 26 సినిమాలు వచ్చాయి. ఎంజీఆర్ ఒకే హీరోయిన్‌తో వరుసగా సినిమాలు చేయడమనే ట్రెండ్ ఉండేది. ఆ ట్రెండ్ పుట్టింది సరోజాదేవీతోనే కావడం విశేషం.
1958 నుంచి 1967 వరకు కంటిన్యూగా ఎంజీఆర్‌తో సినిమాలు చేసింది. కేవలం 9, పదేళ్లలోనే 26 సినిమాలు చేయడం మరో విశేషం.
ఓ వైపు ఎన్టీఆర్, ఏఎన్నార్, శివాజీ గణేషన్‌లతోనూ కంటిన్యూగా చేస్తూనే, ఎంజీఆర్‌తో మరో హీరోయిన్‌కి ఛాన్స్ లేకుండా ఆయనకు జోడీగా చేసింది సరోజా దేవి.
వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ప్రతి సినిమా మంచి విజయం సాధించడం విశేషం. దీంతో అత్యంత సక్సెస్‌ఫుల్ పెయిర్‌గా పేరుతెచ్చుకుంది. అభిమానుల మన్ననలు పొందింది.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఎఫైర్ రూమర్స్ కూడా వచ్చాయి. వీరిద్దరు కలిసి నటించిన చిత్రాల్లో ఎక్కువగా ప్రేమ కథలే ఉన్నాయి. వాటిలో ప్రేమగీతాలే బాగా పాపులర్.
కోలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసిన పాటలు కావడం విశేషం. దీంతో ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నట్టుగా ప్రచారం జరిగింది. అయితే అప్పటికే ఎంజీఆర్‌కి పెళ్లి అయ్యింది.
కానీ సరోజాదేవితో సాన్నిహిత్యంగా ఉండేవారని టాక్. అయితే 1967 వరకు ఎంజీఆర్‌తో పనిచేసిన సరోజా ఆ తర్వాత ఆయనకు దూరమయ్యింది. హీరోయిన్‌గా సినిమాలు చేసినా, ఆయనకు జోడీగా మాత్రం చేయలేదు.
అదే ఏడాది సరోజా దేవి మ్యారేజ్ జరిగింది. ఆమె ఇంజనీర్ శ్రీహర్షని పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అయ్యింది. అయినా సినిమాలు చేసింది. కానీ ఎంజీఆర్‌తో నటించలేదు.
పెళ్లి కారణంగానే ఆయనకు దూరంగా ఉందని టాక్. అయితే ఎంజీఆర్ పై సరోజాదేవికి అభిమానం తగ్గలేదని, కొడుక్కి ఆయన పేరు వచ్చేలా గౌతమ్ రామచంద్రన్ అని పేరు పెట్టుకున్నట్టు సినీ విశ్లేషకులు కిరణ్ ప్రభ తన బ్లాగ్ లో వెల్లడించారు.
సరోజా దేవికి ఇందు, గౌతమ్ సంతానం. భువనేశ్వరిని దత్తత తీసుకున్నారు.
అది ఆయనపై ప్రేమకి గుర్తుగా నిలుస్తుందని సమాచారం. మొత్తంగా వీరి అనుబంధం అప్పట్లో పెద్ద చర్చనీయాంశం అయ్యింది. అయితే సరోజా దేవి.. ఎంజీఆర్‌కి దూరమయిన తర్వాత ఆయన జీవితంలోకి వచ్చిన నటినే జయలలిత.
అలా సరోజా దేవి లోటుని జయలలిత పూర్తి చేసిందని టాక్. ఆయన వారసురాలిగా కంటిన్యూ అయిన జయలలిత సీఎం అయి తమిళ రాజకీయాలను శాసించడం విశేషం.
ఎంజీఆర్, సరోజా దేవి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాల చూస్తే, `ఎంగ వీట్టు పిల్లై`, `నానోడి మన్నన్`, `అన్బే వా`, `పడగొట్టి`, `నాన్ ఆనైయిట్టల్`, `పాసమ్`, `కావల్కారన్`, `కాలంగారై`, `పనతోట్టమ్`,
`పెరియ ఇదత్తు పెన్న్`, `ధర్మం థలై కాక్కుమ్`, `అసారా కట్టలై`, `పనక్కరా కుడుంబమ్`, `తాయ్ సోల్లై తాట్టద్దే`, `ఆసై ముగమ్`, `తిరుదత్తే`, `ఎన్ కాదమై`, `పెట్రిల్తన్ పిల్లైయా`, `తాయై కథ తనయన్`, `దైవ తై`, `పరక్కుమ్ పావై`,
`కుటుంబా తలైవన్`, `తాయిన్ మడియిల్`, `పొన్నియిన్ సెల్వన్`, `నీదిక్కుపిన్ పాసమ్`, `మదప్పుర`, `తాలి భాగ్యం`, `నానోడి`, `పాదుమై పితన్` వంటి చిత్రాలు వచ్చాయి. ఆడియెన్స్ ని ఉర్రూతలూగించాయి.