ఈరోజు ఎపిసోడ్ లో తులసి మీడియాతో మాట్లాడుతూ ఎమోషనల్ అవ్వగా వెంటనే విలేకర్ ఆ మగాడు ఎవరో తెలుసుకోవచ్చా మేడం అనడంతో నందు టెన్షన్ పడుతూ ఉంటాడు. తులసి కూడా చెప్పడానికి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు చెప్తాను ఇప్పుడు కాదు సమయం వచ్చినప్పుడు చెబుతాను అనడంతో నందు లాస్య ఊపిరి పీల్చుకుంటారు. అప్పుడు తులసి,సామ్రాట్ గొప్పతనం గురించి సామ్రాట్ తనకు చేసిన సహాయం గురించి మాట్లాడుతుంది.