దగ్గుబాటి రానా టాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన నటుడు. విక్టరీ వెంకటేష్ తర్వాత ఆ ఫ్యామిలీ వారసుడిగా రానా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కమర్షియల్ చిత్రాలకు భిన్నమైన పంథాలో రానా ప్రయాణం కొనసాగుతోంది.
దగ్గుబాటి రానా టాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన నటుడు. విక్టరీ వెంకటేష్ తర్వాత ఆ ఫ్యామిలీ వారసుడిగా రానా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కమర్షియల్ చిత్రాలకు భిన్నమైన పంథాలో రానా ప్రయాణం కొనసాగుతోంది. బాహుబలిలో భల్లాల దేవుడిగా రానా నటన అద్భుతం. ఇక ఘాజి, నేనే రాజు నేనే మంత్రి లాంటి వైవిధ్యమైన చిత్రాలతో రానా సక్సెస్ అందుకున్నాడు.
26
2020లో తన ప్రేయసి మిహీక బజాజ్ ని వివాహం చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. మిహీక తరచుగా సోషల్ మీడియాలో తన భర్తతో ఉన్న పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ క్రేజీ కపుల్స్ ఓ వెడ్డింగ్ లో సందడి చేశారు. రానా, మిహీక జంటగా ఈ వివాహానికి హాజరయ్యారు.
36
డిజైనర్ కునాల్, అర్పిత మెహతా వివాహం వైభవంగా జరిగింది. మిహీక బజాజ్, కునాల్ రావల్ మధ్య బంధుత్వం ఉంది. మిహీకా సోదరుడు సామ్రాట్ బజాజ్.. కునాల్ రావల్ సోదరి షాషా రావల్ ని వివాహం చేసుకున్నాడు. దీనితో రానా, మిహీక వీరి వివాహానికి హాజరయ్యారు.
46
రానా, మిహీకా ఇద్దరూ గోధుమ వర్ణంలోని డ్రెస్సుల్లో మెరిసిపోతున్నారు. మిహీక లెహంగా ధరించి గ్లామర్ తో మెస్మరైజ్ చేస్తోంది. కునాల్, అర్పిత వివాహ వేడుకలో రానా, మిహీక జంట అందరిని ఆకర్షించారు.
56
కుటుంబ సభ్యులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఉన్న పిక్స్ ని కూడా మిహీక సోషల్ మీడియాలో షేర్ చేసింది. రానా, తలపాగ కట్టి, గాగుల్స్ ధరించి దర్జాగా కనిపిస్తున్నాడు. మిహీక అందానికే అందం అన్నట్లుగా గ్లామర్ లుక్ లో రచ్చ చేసింది.
66
సినిమాల విషయానికి వస్తే రానా చివరగా 'విరాట పర్వం' చిత్రంలో నటించాడు. లవ్ అండ్ నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బిగ్ డిజాస్టర్ గా నిలిచింది. రానా అభిమానులు ప్రస్తుతం ఓ సాలిడ్ మూవీని ఆశిస్తున్నారు.