Intinti Gruhalakshmi: పునః ప్రారంభమవుతున్న మ్యూజిక్ స్కూల్ ప్రాజెక్ట్.. తులసి, సామ్రాట్ కు ప్రెస్ మీట్ లో అవమా

First Published Sep 24, 2022, 10:44 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు సెప్టెంబర్ 24వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం...
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... నందు లాస్య తో ఉద్యోగం మానేస్తాను అని అంటాడు.కానీ లాస్య మాత్రం, మనకి ఇక్కడ కాకపోతే గడ్డి పీకే ఉద్యోగం కూడా ఎవడు ఇవ్వడు కనుక మనం ఏం చేయలేము చచ్చినట్టు ఇక్కడ ఉండాల్సిందే అని అంటుంది. అప్పుడు నందు, నేను పాతికేళ్లు తులసి మొగుడుగా ఉన్నాను ఇప్పుడు అది నా మొగుడుగా తయారవుతుంది నావల్ల కాదు అని అంటాడు.దానికి లాస్య, ఇది కూడా మనం మంచికే అయింది నందు ఇప్పుడు చదువురాని తులసి మనకి బాస్ అవుతుంది. మనం దాన్ని పక్కనే ఉండి అది చేసే చిన్న చిన్న తప్పులు కూడా సామ్రాట్ గారి ముందు పెద్దగా చూపిద్దాము. తులసి చేయలేని పనులు నువ్వు చేసావ్ అనుకో అప్పుడు సామ్రాట్ గారి దగ్గర నీకు మంచి పేరు దొరికి నువ్వే మేనేజర్ అవుతావు అని అంటుంది. 

నేను ఏం చెప్పినా సరే నువ్వు నా మాటకి అడ్డు చెప్పి,నువ్వు చేయాలనుకుందే చేస్తావు లాస్య అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నందు. అప్పుడు లాస్య, విడి గోల తట్టుకోపోతున్నాను అని అనుకుంటుంది. ఆ తర్వాత సీన్లో శృతి, అంకిత,ప్రేమ్ ముగ్గురు కలిసి ఒక చోటున ఉంటారు. అప్పుడు అభి అక్కడికి  వస్తాడు. నన్ను ఎందుకు రమ్మన్నారు అని అభి అడగగా, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ముందు మేము చెప్పేది ప్రశాంతంగా విను. అమ్మకి ఇష్టం లేకపోయినా మన ఒత్తిడికి ఉద్యోగం ఒప్పుకున్నాది, కనుక అమ్మ పనిని మనం అడ్డు చెప్పకూడదు అని ప్రేమ్ అంటాడు.అప్పుడు అభి, నేను మరీ అంత చెడ్డవాడిలా కనిపిస్తున్నానా! అప్పుడు ఆస్తిలో నాకు వాటా ఇవ్వకపోయినా సరే నాకు ఏమి కోపం లేదు కానీ నా బాధ అంతా ఒకటే. మీరు అమ్మ గురించి ఇంత ఆలోచిస్తున్నప్పుడు డాడ్ గురించి కూడా అంతే ఆలోచించాలి కదా! వాళ్ళిద్దరి మధ్య గొడవలు వాల్ల వ్యక్తిగతం.

మనకి దాంతో సంబంధం లేదు అని అంటాడు అభి. దానికి ప్రేమ్ ఈ విషయంలో నా నిర్ణయం నేను తీసుకున్నాను, నా అభిప్రాయాన్ని మార్చడానికి చూడొద్దు అని శృతిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంకిత కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీన్లో ఇంట్లో వాళ్ళందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. అప్పుడు తులసి హనీకి భోజనం తినిపిస్తుంది.అందరూ తులసి దగ్గరికి వచ్చి నాకు కూడా తినిపించు అని అంటారు.అప్పుడు తులసి  ప్రతి ఒక్కరికి గోరుముద్దలు పెడుతూ ఉంటుంది.మరోవైపు నుంచి నందు లాస్యలు చూస్తూ కుల్లుకుంటూ ఉంటారు. ఇంతలో సామ్రాట్,వాళ్ళ బాబాయ్ తో పాటు అక్కడికి వచ్చి, చూసావా బాబాయ్ ఎక్కడలేని సంబరం అంతా నాకు ఇక్కడే కనిపిస్తుంది. 

 అందరూ ఒక వైపు ఉన్నారు ఆ పక్కన నందు,లాస్యలు ఇంకోవైపు ఉన్నారు. ఇద్దరి మధ్య ఎంత తేడా ఉన్నది అని అనుకుంటారు. ఆ తర్వాత సీన్లో డాక్టర్ వచ్చి హనీకి కట్టు తీస్తుంది. అప్పుడు హనీ, నాకు తగ్గిపోయింది అని అంటుంది.నిజంగానే తగ్గిపోయిందా అని సామ్రాట్ అడగగా, హ్యాండ్ రైసింగ్ ఆడదామా అని నవ్వుతుంది హనీ.అప్పుడు తులసి, ఇప్పుడు నుంచి నువ్వు చక్కగా అందరితో ఆడుకోవచ్చు అని అనగా,నేను ఎవరితో ఆడుకుంటాను తులసి అంటీ నాకు తగ్గిపోయింది అని మీరు అందరూ ఇంటికి వెళ్ళిపోతారు కదా! డాక్టర్ ఆంటీ నాకు ఇంకొక కట్టు కట్టేయండి అని అంటుంది. అప్పుడు తులసి, పాప సరదాగా అంటుంది మీరు వెళ్ళండి అని డాక్టర్ని పంపించేస్తుంది. అప్పుడు లక్కీ, హానీ ఇద్దరు ఆడుకోవడానికి వెళ్తారు. అప్పుడు సామ్రాట్ తులసితో,మనం, ఆగిపోయిన  పనిని మళ్లీ పూర్తి చేద్దాము.
 

మ్యూజిక్ స్కూల్ ప్రాజెక్ట్ ని తిరిగి మొదలుపెడదాము,అలాగే ప్రెస్ మీట్ పెట్టి అందరికీ చెబుదాము. ఎక్కడైతే మనకు సమస్య వచ్చిందో అక్కడే దాన్ని తీర్చుకోవాలి అని అంటాడు సామ్రాట్.అప్పుడు తులసి, ఇప్పుడు ప్రెస్ మీట్ లాంటివి ఎందుకు సామ్రాట్ గారు మనం పని చేస్తున్నప్పుడు వారికే తెలుస్తుంది కదా అని అంటుంది. నందు కూడా తులసి చెప్పింది కరెక్టే కదా అని అంటాడు. అప్పుడు లాస్య, నువ్వు కూడా తులసి లాగే ఆలోచిస్తున్నావ్ ఏంటి నందు? నువ్వు చదువుకున్నావు, తులసి అంటే కుట్టు మిషన్ దగ్గరే ఉండిపోయింది.అయినా నువ్వు పంపిన ఒక్క మెసేజ్ వల్ల సామ్రాట్ గారికి మచ్చపడింది.కంపెనీలో షేర్స్ కూడా తగ్గాయి అని అనగా, సామ్రాట్ వాళ్ళ బాబాయ్ అప్పుడు వచ్చి, ఈ విషయమే కాదు,తులసి వ్యాపార భాగస్వామ్యం తప్పుకున్నది అన్న విషయం మీడియా వాళ్లకి చెప్పిన వాళ్ల గురించి కూడా మనం ఎంక్వైరీ చేయాలి అని అంటాడు. 

అప్పుడు సామ్రాట్, అవును దీన్ని మనం తేలికగా వదిలేస్తే మనం చేతకాని వాళ్ళము అవుతాము అని అంటాడు. అప్పుడు లాస్య భయపడి, నా గోతిని నేనే చదువుకున్నానే అని అనుకుంటుంది. అప్పుడు సామ్రాట్ తులసి దగ్గరికి వెళ్లి,మీ అభిప్రాయం చెప్పండి అని అనగా తులసి, ఇప్పుడు అలా చేసిన వాళ్ళని పట్టుకున్నందు వల్ల మనకు ఏం లాభము అని అంటుంది. అప్పుడు సామ్రాట్ ,మనం వాళ్ళని జైల్లో పెడదాము ఇంకెప్పటికీ బయటికి రాకూడదు.ఊచలు లెక్కబెట్టుకుంటూ నాలుగు గోడల మధ్య ఉంటారు అని అంటాడు. లాస్య చాలా భయపడిపోతుంది. అప్పుడు తులసి, అంతేగాని దానివల్ల మనకేం లాభం లేదు కదా! మనం నడుస్తున్నప్పుడు ముళ్ళు గుచ్చుకున్నది అని ముళ్ళు మీద పగ పట్టలేము కదా అని అంటుంది.

అప్పుడు సామ్రాట్ తులసి మాటలకు అభినందిస్తాడు. నందు, లాస్యలకు వెళ్లి ప్రెస్ మీట్ గురించి ఏర్పాట్లు చేయమని చెప్తాడు. ఆ తర్వాత నందు, లాస్య ఇద్దరు మాట్లాడుకుంటునప్పుడు, అయినా ఆయనకి ఏమైనా పిచ్చా మనల్ని ఎందుకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేయమంటున్నారు అని అంటాడు. అప్పుడు లాస్య, సామ్రాట్ ఈ పని మనకు చెప్పి ఆయన గొయ్యిని ఆయనే తవ్వుకున్నారు ఇప్పుడు చూడండి ఏం చేస్తానో అని మీడియా వాళ్లకి ఫోన్ చేసి మాట్లాడుతుంది.అసలు ఏం చేస్తున్నావు లాస్య అని అనగా రేపు వాళ్ళిద్దరికీ వచ్చే ప్రశ్నలను ఊహించుకో అని అంటుంది. ఆ తర్వాత రోజు ఉదయం, శృతి చీర ఇస్త్రీ చేసుకొని తయారవుతుంది. ప్రేమ్ అక్కడికి వచ్చి,నీ చీరతో పాటు పక్కనున్న నా షట్ ని కూడా ఇస్త్రీ చేయమని చెప్పాను కానీ చేయలేదు అని అంటాడు. దానికి శృతి, ఈరోజు ఇస్త్రీ చేయమంటావు,రేపు కాళ్ళు నొప్పిగా ఉన్నాయి పట్టమంటావు, దాని తర్వాత రోజు ఇంకో పని చెప్తావు ఇంకా నీకు సేవలు చేసుకుంటూ నేను ఉండలేను అని అంటుంది.

అప్పుడు ప్రేమ్ అయినా నువ్వు ఇది కావాలనే చేశావు, నేను అక్కడ మాసిపోయిన బట్టలతో అందరి ముందు ఉంటే నువ్వు హాయిగా నవ్వుకుంటావు కదా అని అనగా శృతి, బీరువాలో నుంచి ఒక షర్ట్ తీసి, నువ్వు ఇందాక ఇచ్చిన షర్ట్ నీకు సూట్ అవ్వదు. అందుకే ఈ షర్టు ఇస్త్రీ చేశాను అని ఇస్తుంది. ప్రేమ్ ఆనందపడతాడు, అప్పుడు శృతి, నీ మీద ప్రేమతో ఏమీ చేయలేదు తులసి ఆంటీ కొడుకు అని చేశాను అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీన్లో లాస్య ప్రెస్ వాళ్ళతో మాట్లాడుతూ,మీకు చెప్పినది గుర్తున్నది కదా ప్లాన్ అమలుపరచండి అని మర్యాదలు చేస్తూ ఉంటుంది.అప్పుడు నందు, ఎప్పుడూ లేనిది ప్రెస్ వాళ్ళతో ఇంత బాగా మాట్లాడుతుందేంటి లాస్య అని అనుకుంటాడు. అప్పుడు లాస్య అక్కడికి వచ్చి, నువ్వు కూడా నాలాగే నేర్చుకోవచ్చు కదా నందు ఇప్పుడు చూడు జరిగే ఆట అని అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురుచూడాల్సిందే!

click me!