Guppedantha Manasu: రిషి మాటలకు బాధలో మహేంద్ర... వసుధారకి జగతి సలహా!

First Published Sep 24, 2022, 10:00 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు సెప్టెంబర్ 23వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం...
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... రిషి కోపంగా దేవయాని దగ్గరికి వచ్చి,పెద్దమ్మ నాకు తన ప్రవర్తన ఏమి నచ్చడం లేదు పెద్దమ్మ,చదువుకున్న మనిషే కదా ఎంత కోపం వస్తుందో తెలుసా అని అంటాడు. అప్పుడు దేవయాని మనసులో, వసుధార గురించి అనుకుంటా ఇంక వాసుధార తో రిషి  విడిపోయే రోజు వచ్చేసింది అని సంబరపడిపోతుంది. అప్పుడు రిషి, అయినా తను అంత పని చేస్తది అని నేను అనుకోలేదు పెద్దమ్మ, తన మొఖం చూస్తేనే నాకు చిరాకు వచ్చేస్తుంది పెద్దమ్మ. ఆ సాక్షిని ఎప్పటికి క్షమించకూడదు అని అంటాడు.దానికి దేవయాని ఆశ్చర్యపోయి ఇప్పటివరకు నువ్వు చెప్తుంది సాక్షి గురించి అని అనగా, అవును పెద్దమ్మ ఆ సాక్షి వసుధారని పరీక్ష రోజు ల్యాబ్ లో పడేసింది నా దగ్గర వీడియో క్లిప్పులు కూడా ఉన్నాయి.

నేను చాలా కోపంగా ఉన్నాను పెద్దమ్మ మీరే తనతో వెళ్లి మాట్లాడి ఇంకెప్పుడు ఈ టౌన్ లో కూడా నాకు కనిపించదు అని చెప్పండి అని అంటాడు.సరే అని అంటుంది దేవయాని.మనసులో, ఈ విషయం నాకు వచ్చి చెప్పాడు కాబట్టి సరిపోయింది అదే సాక్షి దగ్గరికి వెళ్లి గట్టిగా నిలదీసి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్తే, అది కచ్చితంగా నా పేరు బయట పెట్టేసి ఉండేది.అయినా ఇంత చేసింది అదేదో స్టోర్ రూమ్ లో పడేయకుండా ల్యాబ్ లో ఎవడైనా పడేస్తాడో అని సాక్షిని తిట్టుకుంటుంది దేవయాని. ఆ తర్వాత సీన్లో జగతి,వసు కిచెన్ లో ఉంటారు. అప్పుడు జగతి వసదారతో,రిషి ఏమైనా కోపంగా ఉన్నాడా నీ మీద?ఇంకా మనస్భత్తులు ఉన్నాయా అని జరిగినవి గతమంతా గుర్తుతెచ్చుకొని, నా వల్ల మీరు విడిపోకూడదు. ఒకవేళ నా విషయం మీద మీ ఇద్దరి మధ్య ఏ గొడవ వచ్చినా సరే రిషికి నువ్వు ఎదురు చెప్పకు, ఇలా చెప్తున్నాను అని నువ్వు ఏమీ అనుకోవద్దు నా వల్ల మీరు బాధపడడం చూసి నేను తట్టుకోలేను అని అంటుంది  జగతి.

అప్పుడు వసు,మేడం మాకు గొడవలు ఏవి లేవు,ఒకవేళ ఉన్న అవి గొడవలు ఏమీ కాదు చిన్న చిన్న చిలిపి గొడవలు అంతే. మీరేమీ బాధపడొద్దు,రిషి సర్ గురించి నాకు తెలుసు కదా అని చెప్పి ధరణిని చూడడానికి అని వెళ్ళిపోతుంది వసు.రిషి మనసు నీకు తెలుసు వసు అని అనుకుంటుంది జగతి. ఆ తర్వాత  రిషి కిచెన్ లోకి వస్తాడు.అప్పుడు జగతి,రిషి నీ చూడదు,వచ్చింది వసు అనుకుని,నాకు తెలుసు నువ్వు నన్ను ఒక్కదానివే వదిలి వెళ్ళావు అని తిరిగి చూసేసరికి,అక్కడ రిషి ఉంటాడు.సారీ రిషి కాఫీ పెట్టాలా అని అంటుంది జగతి.అప్పుడు రిషి, వద్దు మేడం నేనే పెట్టుకుంటాను అని కాఫీ పెడుతుంటూ, మీ శిష్యురాలికి చెప్పండి తను కొరకూడని కొన్ని విషయాలు కోరుకుంటుంది, కొన్ని విషయాలలో నా నిర్ణయాలు మార్చాలని ప్రయత్నిస్తుంది అది జరగదు అని చెప్పండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత సీన్లో గౌతమ్ రిషి దగ్గరికి వెళ్లి ఏంట్రా విశేషాలు అని అడుగుతాడు. అప్పుడు రిషి బయట పేపర్ ఉన్నది వెళ్లి చదువుకొ అని వెటకారిస్తాడు.అప్పుడు గౌతమ్, నువ్వు ఈ మధ్య నన్ను ఏం లెక్క చేయడం లేదు రా నేను అడుగుతుంది లోకంలో విశేషాలు కాదు నీ మనసులో విశేషాలు అని అనగా, మనిషికి ప్రైవసీ ఉండాలిరా కొంచెం అని రిషి అంటాడు.అప్పుడు గౌతమ్, నాకు తెలుసు రా నువ్వు నాతో ఎందుకు చెప్తావు అయినా నేను నీ మీద ఎక్కువ ఆశలు పెట్టుకున్నాను అవి వోమ్ము చేయకుండా ఉంటే చాలు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు మహేంద్ర రిషి దగ్గరికి వస్తాడు.మహేంద్ర సైలెంట్ గా కూర్చుని ఉండగా, రిషి మహేంద్ర చేయి పట్టుకుని, డాడ్ నావల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ నేను మీ కోరిక తీర్చలేను. ఇప్పుడు మనిద్దరం ఒక రెస్టారెంట్ కి వెళ్లి అక్కడ మీరు ఒక పదార్థం నేను ఒక పదార్థం చెప్తాము, అయినా మీరు చెప్పిన పదార్థాన్ని నేను తింటాను. అలాగే షాపింగ్ కి వెళ్ళినప్పుడు నాకు నచ్చకపోయినా మీరు నాకు ఏమైనా డ్రెస్ సెలక్ట్ చేస్తే మీ సంతోషం కోసం నేను అది వేసుకుంటాను.
 

 కానీ ఇది జీవితం నేను కొన్ని విషయాల్లో సీరియస్ గా ఉంటాను అని అంటాడు. మహేంద్ర ఇంకేం అనలేక ఓకే అని చెప్పి వెళ్ళిపోతున్నప్పుడు రిషి  ఆపి,ఏమీ మాట్లాడలేదు ఎందుకు డాడ్,ఎందుకు వచ్చారు అని అడుగుతాడు. అప్పుడు మహీంద్రా, ఏం లేదు రిషి ,నిన్ను చూడడానికి వచ్చాను అని చెప్పి దిగులుగా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సీన్ లో వసు,జగతి కిచెన్ లో ఉంటారు.అప్పుడు వసు, ధరణి మేడమ్ కి ఇంక తగ్గిపోయినట్టే కదా అని అడగగా,అవును వసు ధరణి అలాగా మంచం మీద ఉంటే ఇల్లు బోసిపోయినట్టున్నది, ఎప్పుడు కళకళలాడేది అని జగతి అంటుంది. అప్పుడు రిషి కిచెన్ వద్దకు వస్తాడు.


జగతిని అక్కడ చూసి వెళ్ళిపోదాము అనుకునే సమయంలో, జగతి రిషి ని చూసి వసు తో, నేను టాబ్లెట్లు ఇవ్వడం కోసం ధరణి దగ్గరకు వెళ్తాను అని చెప్పి కిచెన్ నుంచి వెళ్ళిపోతుంది.

అప్పుడు వసు, త్వరగా రండి మేడం పనులు ఉన్నాయి అని అంటుంది. జగతి వెళ్ళడం చూసి రిషి కిచెన్ లోకి వస్తాడు. వసు ముందుకు తిరిగి వంట చేసుకుంటూ ఉంటుంది.వెనకాతల ఉన్న రిషిని చూడద. రిషిని జగతి అనుకొని మేడం వచ్చారా, నాకు తెలుసు మీరు నన్ను వదిలి వెళ్ళరని. కొంచం కూరగాయలు కోసి పెట్టరా అని అనగా రిషి కూరగాయలు కోస్తాడు.అప్పుడు వసు, మేడం మీకో విషయం తెలుసా మీలాగే రిషి సార్ కూడా ఆల్రౌండర్ అన్ని పనులు చేస్తారు కానీ కొంచెం కోపం ఎక్కువ అని అంటుంది దానికి రిషి వసుధార రేపు అదోలా చూస్తాడు. అప్పుడు వసు, మీకు ఇంకో విషయం తెలుసా మేడం రిషి సార్ గురించి మీకో విషయం చెప్తాను అని అంటుంది, వద్దులెండి అని మళ్ళీ ఆపేస్తుంది. అప్పుడు వసుధార మేడం మర్చిపోయాను ధరణి మేడమ్ కి జ్యూస్ ఇచ్చే టైం అయింది అని అనగా రిషి మనసులో, ఇప్పుడు నాచేత జ్యూస్ కలపమంటుందా అని అనుకుంటాడు. 
 

అప్పుడు వసు, సారీ మేడం నేను వంట చేస్తున్నాను కదా,ఇది మాడిపోతుంది మళ్ళీ.కొంచెం నాకోసం జ్యూస్ కలపరా అని అంటుంది. అప్పుడు రిషి జ్యూస్ కలుపుతాడు.అప్పుడు వసు మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి మేడం మీరు తిరిగి మాట్లాడారు అని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ రిషి ఉంటాడు. వెంటనే చేతిలో ఉన్న గరిట కింద పడేస్తుంది వసు.సార్ మీరా! సారీ సార్ మీరు అని తెలియక ఇదేదో వగేసా అని అంటుంది. అప్పుడు రిషి, ఇదిగో నీకు కావలసిన కూరగాయలు, నీ జ్యూస్ తీసుకో అని అనగా సారీ సార్ అని అంటుంది. తీసుకొండి మేడం అని రిషి అనగా జ్యూస్ ని తీసుకోదు వసు.
 

 తీసుకొ అని గట్టిగా రిషి అంటాడు.వణుకు తో ఆ గ్లాస్ ని తీసుకునే సరికి  అది రిషి షర్ట్ మీద పడిపోతుంది.అప్పుడు వసూ దాన్ని తుడుస్తూ ఉండగా దేవయాని అటువైపు వచ్చి ఈ ఇంట్లో అసలు ఏం జరుగుతుంది అని అనుకోని అక్కడికి వెళ్తుంది. ఏమైంది రిషి అని అనగా, షర్టు మీద జ్యూస్ వొలిగింది పెద్దమ్మ అని అంటాడు రిషి. ఖచ్చితంగా వాసుదార పనే అయి ఉంటుంది అని దేవయాని అనుకుంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!