Intinti Gruhalakshmi: సామ్రాట్ కార్ కి యాక్సిడెంట్.. హాస్పటల్లో తులసి, సామ్రాట్!

First Published Sep 19, 2022, 11:19 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు సెప్టెంబర్ 19వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం...
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... లాస్య తులసిగాని కలలోకి వచ్చిందా? అని  నందుని అడుగుతుంది. తులసి కలలోకి ఎందుకు వస్తుంది? అని నందు అడగగా, కలలో విడాకులు,భేదాలు ఉండవు కదా గుర్తు తెచ్చుకుంటే వస్తుంది అని అంటుంది లాస్య. అలాంటిదేమీ లేదు అని అంటాడు నందు. లాస్య వెళ్ళిపోయిన తర్వాత, తులసికి నిజంగానే యాక్సిడెంట్ అవుతదా? ఒక సారి సామ్రాట్ కి ఫోన్ చేద్దామా? వద్దు పోనీ అభికి చేద్దామని ఫోన్ చేస్తాడు నందు. ఫోన్ చేసి తులసి ఎక్కడున్నది అని అడగగా గేటు ఎదురుగా సామ్రాట్ గారి కోసం ఎదురుచూస్తోంది అని చెప్తాడు అభి. అప్పుడు నందు మనసులో హమ్మయ్య! ఇంకా తులసి దగ్గరికి రాలేదు కదా అని అనుకుంటాడు. అంతలో తులసి పాటలు పాడుకుంటూ బయట సామ్రాట్ గారి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.

ఇంతలో సామ్రాట్ కి ఫోన్ చేసి ఎక్కడున్నారు అని అడగగా, బయలుదేరుతున్నాను ఇప్పుడే ఒక్క క్లైంట్ తో మాట్లాడుకుంటూ ఉండిపోయాను అని అంటాడు సామ్రాట్.జాగ్రత్తగా రండి,కంగారు ఏమీ లేదు, నేను వెయిట్ చేస్తాను. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా యాక్సిడెంట్లు అవ్వచ్చు అని అనగా సామ్రాట్, నా జీవితంలో ఎప్పుడూ ఆక్సిడెంట్ అయిన రోజు అంటూ లేదు.కార్ స్టీరింగ్ నా చేతిలోకి వచ్చిన తర్వాత ఆక్సిడెంట్ అయ్యే ఛాన్స్ లేదు అని అంటాడు. అప్పుడు తులసి, ఏది మన చేతిలో ఉండదు మనం ఎన్నో అనుకుంటాము కానీ జీవితం మనకు ఇంకేదో చేస్తుంది. కనుక ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో మనం పసిగట్టలేము జాగ్రత్తగా ఉండాలి అని తులసి అంటుంది.ఇంతలో హాని అక్కడికి వచ్చి, ఎప్పుడు తాతయ్యే నేను స్కూల్ కి తీసుకెళ్తున్నారు, ఈరోజు నువ్వు తీసుకువెళ్ళు డాడీ అని అనగా, నేను బిజీగా ఉన్నాను అమ్మ అని అంటాడు సామ్రాట్. నువ్వు బిజీగా ఉంటే ఇలా ఫోన్లో గంటలు గంటలు మాట్లాడవు కదా.

నన్ను తీసుకెళ్ళు డాడీ అని అడగగా తులసి, శివాజ్ఞ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము అని చెప్పాను కదా, హానిని వెళ్లి దింపి రండి నేను ఎదురు చూస్తాను అని తులసి అంటుంది. హనీ సామ్రాట్ లు కారులో ఉంటుండగ ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు హనీ, ఎక్కువగా నవ్వద్దు నాన్న ఏదో చెడు జరుగుతాదట అని అనగా ఎవరు చెప్పారు నీకు ఇదేనంటే మా తెలుగు మేడం చెప్పింది ఎక్కువ నవ్వితే ఏదో ఒక చెడు జరుగుతుందట.త్వరగా వెళ్ళు డాడీ ఆ సైకిల్ వాడు కూడా మనల్ని దాటుకొని వెళ్ళిపోతున్నాడు అని అనగా సామ్రాట్ స్పీడ్ పెంచుతాడు. అప్పుడే కార్ అదుపులో లేదని గమనిస్తాడు. ఆక్సిడెంట్ అవుతుందేమో అని కంగారు పడుతూ ఉంటాడు. ఇంతలో సామ్రాట్ కార్ వెళ్లి చెట్టుకి గుద్దుకుంటుంది. హానీ, సామ్రాట్లిద్దరూ స్పృహ తప్పి పోతారు.

ఇంతలో తులసికి సామ్రాట్ కి యాక్సిడెంట్ అయినట్టు, హాస్పిటల్ లో చేర్చినట్టు వార్త వస్తుంది.తులసి వెంటనే ఇంట్లో వాళ్లకు చెప్పి బయలుదేరుతుంది. మరోవైపు నందు లాస్యలు కూడా విషయం తెలుస్తుంది. అప్పుడు నందు,కారులో హనీ కూడా ఉన్నదా అని అనుకుంటాడు. అందరూ పరిగెట్టి హాస్పిటల్ లోకి వెళ్ళగా సామ్రాట్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు.ఏమైంది అని డాక్టర్ని తులసి వాళ్ళు అడగగాఏమీ లేదు పెద్ద ఆక్సిడెంట్ అయినా, చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. ఇప్పుడు మత్తులో ఉన్నారు ఇంజక్షన్ వేసాక వెళ్లి మాట్లాడొచ్చు అని అంటాడు డాక్టర్. ఆ తర్వాత సీన్లో ఇంట్లో వాళ్ళందరూ కంగారుపడుతూ ఉంటారు. అప్పుడు ప్రేమ్, అయిన డ్రైవర్ ఉండగా సామ్రాట్ గారు బండి ఎందుకు నడిపారు అని అంటాడు. అంతలో అభి అమ్మతో వెళ్తున్నారు కదా అనే డ్రైవ్ చేయాలి అనుకుంటున్నారేమో అని అనగా, ఈ సమయంలో కూడా నీకు ఈ విషయం అవసరమా అని అంటాడు ప్రేమ్.

 అప్పుడు అభి,అయినా ఒంటరిగా హానితో వచ్చారు కాబట్టి సరిపోయింది. ఒకవేళ అమ్మని కూడా తీసుకువెళ్లి ఉంటే అప్పుడు అమ్మకి ఎంత ప్రమాదం ఉండేది అని అంటాడు.ఇంతలో దివ్య  నువ్వు కూడా అమ్మతో సహాయంగా వెళ్లొచ్చు కదా ప్రేమ్ అన్నయ్య అని అనగా, నేను వస్తానని చెప్పాను కానీ అమ్మ వినకుండా వెళ్ళిపోయింది అని అంటాడు.మరోవైపు సామ్రాట్ మత్తులో నుంచి తేలుకుంటాడు. వెంటనే విషయం గుర్తొచ్చి హనీకి ఎలాగున్నది బానే ఉన్నదా అని అరుస్తాడు. బానే ఉన్నది పక్కన ట్రీట్మెంట్ తీసుకుంటుంది అని అనగా,నేను వెంటనే వెళ్లి హనీ ని చూడాలి అని వైర్లని పీకేసి పరుగు పరుగున వెళ్తాడు సామ్రాట్.
 

అప్పటికే హానీ నీ icu లో ఉంచుతారు. అప్పుడు సామ్రాట్ బాధపడుతూ, నా వల్లే ఇదంతా జరిగింది నేనే జాగ్రత్తగా బండి నడపల్సింది. అయినా అప్పటికి చెప్తూనే ఉన్నాను నాతో రావద్దు అని వినకుండా నాతో వచ్చింది పాపం చిన్నపిల్ల అంటూ ఏడుస్తూ ఉంటాడు సామ్రాట్. అప్పుడు నందు మనసులో, తెలియకుండా తాగిన మత్తులో ఇలా చేశాను ఇప్పుడు ఇంత దారుణానికి దారితీస్తుంది అని నేను అనుకోలేదు దేవుడా,ఎలాగైనా నన్ను క్షమించి హనీ నీ కాపాడు అని కోరుకుంటాడు నందు. ఇంతలో సామ్రాట్ ఏడుచుకుంటూ ఉంటాడు. అప్పుడు లాస్య బ్రేకులు పోవడం మీ తప్పు కాదు కదా సార్ అని ఓదారుస్తుంది.
 

తులసి  కూడా ఏం జరగదు లెండి ప్రాణానికి ప్రమాదమేమీ లేదు అని సంతోషపడండి.అది కూడా అదృష్టమే కదా అని ఓదారుస్తుంది. ఇంతలో డాక్టర్ వచ్చి మీరేమీ భయపడొద్దు సామ్రాట్ గారు మీరు కూడా పేషెంట్ నెమ్మదిగా ఉండండి. హనీకేం కాలేదు బానే ఉన్నది రెండు రోజులు డిశ్చార్జ్ కూడా చేసేస్తాము. ఇప్పుడు మీరు వెళ్లి చూడొచ్చు అని అంటారు. అప్పుడు సామ్రాట్ హనీ తో,నిన్ను ఇలా చూడాల్సి వస్తుందే!త్వరగా నా దగ్గరికి వచ్చే అమ్మ నేను నిన్ను బాగా మిస్ అవుతున్నాను అని ఏడుస్తూ ఉంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!