సమరసింహారెడ్డి సినిమాను మిస్ అయిన స్టార్ హీరో ఎవరు? ఆ కథ బాలకృష్ణ కోసం రాసింది కాదా?

Published : Aug 19, 2025, 02:34 PM IST

టాలీవుడ్‌లో కొన్ని సినిమాలు కథలు మొదట వేరే హీరోల వద్దకు వెళ్లి, చివరకు మరో హీరో చేత హిట్ అవ్వడం సాధారణమే. అలాంటి సంఘటనే బాలకృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా సమరసింహా రెడ్డి విషయంలో జరిగింది. ఈసినిమాను ఓ స్టార్ హీరో మిస్ అయ్యాడని మీకు తెలుసా?

PREV
15

బాలయ్య కెరీర్ ను మార్చేసిన సినిమా

సమరసింహారెడ్డి.. బాలకృష్ణ కెరీర్ లో అద్భుతం చేసిన సినిమా, 1999లో సంక్రాంతి కానుకగా విడుదలైన ‘సమరసింహా రెడ్డి’ సినిమా నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో కీలకంగా నిలిచింది. ప్రముఖ బీ. గోపాల్ దర్శకత్వంలో, చెంగల వెంకట్ రావు నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రం అద్భుత విజయాన్ని సాధించింది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో నిర్మించిన ఈ చిత్రం ఆ కాలంలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

DID YOU KNOW ?
సమరసింహా రెడ్డి రికార్డు
బాలకృష్ణ సూపర్ హిట్ మూవీ సమరసింహారెడ్డి సరికొత్త రికార్డులెన్నో సృష్టించింది. మూడు థియేటర్లలో 227 రోజులు , 29 కేంద్రాల్లో 175 రోజులు ,50 రోజులు 122 కేంద్రాల్లో ఆడి.. బాలయ్య కెరీర్ లో ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది.
25

కలెక్షన్ల వర్షం కురిపించిన సినిమా

బాలకృష్ణ రెండు రకాల పాత్రల్లో నటించిన ఈ సినిమాలో అంజలా జవేరి , సిమ్రాన్ హీరోయిన్లుగా కనిపించారు. మణిశర్మ అందించిన సంగీతం, మాస్ పాటలు, డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు సినిమాకు స్పెషల్ హైలైట్స్ అయ్యాయి. ఇక 6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సమర సింహా రెడ్డి సినిమా, విడుదలైన తర్వాత 15 కోట్ల షేర్‌ను రాబట్టి, అప్పట్లో సంచలనంగా మారింది. 227 రోజులు మూడు థియేటర్లలో, 175 రోజులు 29 కేంద్రాల్లో,50 రోజులు 122 కేంద్రాల్లో ఆడి.. బాలయ్య కెరీర్ లో ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది. ఇక ఒక థియేటర్‌లో అయితే ఏడాదిపాటు ఆడి సరికొత్త రికార్డులను నెలకొల్పింది సమరసింహారెడ్డి సినిమా.

35

సమరసింహారెడ్డి సినిమాను మిస్ అయిన హీరో

అయితే ఈ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ కథ బాలకృష్ణ కోసం రాసింది కాదని. ముందుగా ఈసినిమా కోసం మరో హీరోను అనుకున్నట్టు సమాచారం. విజయవంతమైన ఈ కథ మొదట విక్టరీ వెంకటేష్ దగ్గరకు వెళ్లినట్టు సమాచారం. దర్శకుడు బీ గోపాల్ ఈ కథను వెంకటేష్‌కు వినిపించగా, ఆయనకు కథ నచ్చిందట. కానీ ఇది ఒక ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్ ఉన్న సినిమా కావడంతో, తనకు అలాంటి జానర్ తగదని అభిప్రాయపడ్డ వెంకటేష్, ఈ కథ బాలకృష్ణకు బాగా సరిపోతుందని వెంకటేష్ స్వయంగా సూచించినట్టు సమాచారం.

45

రికార్డులు బ్రేక్ చేసిన బాలకృష్ణ

దాంతో ఈ కథ బాలకృష్ణ వద్దకు వెళ్లి, ఆయన ఆఫర్‌కి ఒప్పుకుని నటించడంతో ‘సమరసింహా రెడ్డి’ టాలీవుడ్‌లో సంచలన విజయం సాధించింది. ఈ కథకు బాలయ్య తప్పించి మరెవరు న్యాయం చేయలేరు అన్నట్టుగా సమరసింహారెడ్డి హిట్ అయ్యింది. ఈసినిమాతో బాలకృష్ణ ఇమేజ్‌ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. అంతే కాదు ఈసినిమాతో ఫ్యాక్షన్ సినిమాల జోరు కూడా పెరిగిపోయింది.

55

పూనకాలతో ఊగిపోయిన ఫ్యాన్స్

ఈసినిమాతో బాలకృష్ణ మాస్ హీరోగా మరింత పాపులర్ అయ్యాడు. నందమూరి ఫ్యాన్స్ అయితే సమరసింహారెడ్డి సినిమా చూసి పూనకాలతో ఊగిపోయారు. బాలయ్యకు ఈసినిమా తరువాత వరుసగా ఫ్యాక్షన్ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. నరసింహనాయుడు, చెన్నకేశవరెడ్డి, సీమ సింహం లాంటి సినిమాల్లో నటిస్తూ తనదైన మాస్ ఇమేజ్‌ తో దూసుకుపోయాడు. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీనుతో అఖండ 2 లో నటిస్తున్నారు. వరుసగా హ్యాట్రిక్ సక్సెస్ ను అందుకున్న బాలయ్య.. డబుల్ హ్యాట్రిక్ దిశగా దూసుకుపోతున్నాడు. అటు ఎమ్మెల్యేగా కూడా హిందూపూర్ నుంచి హ్యాట్రిక్ విన్నర్ గా నిలిచిన బాలకృష్ణ, అటు పాలిటిక్స్ ను, ఇటు సినిమాలను కరెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories