గతాన్ని తలుచుకుని కన్నీళ్లు పెట్టిన సౌమ్యరావు
తాజాగా ఓ టీవీ ఛానల్ ప్రోగ్రామ్ లో సౌమ్య తన బాల్యం, కుటుంబ పరిస్థితుల గురించి భావోద్వేగంగా వెల్లడించింది. తను జీవితంలో పడిన ఇబ్బందులు తలుచుకుంటూ విలపించింది. అమ్మ ఫోటోను పట్టుకుని బోరుమన్నారు సౌమ్యరావు. ఇదే విషయాన్ని ఆమె పలు ఇంటర్వ్యూల ద్వారా కూడా వెల్లడించారు. సౌమ్య పలు సందర్భాల్లో మాట్లాడుతూ.. "మా నాన్న ఊరంతా అప్పులు చేశారు. మమ్మల్ని పట్టించుకోలేదు. ఆయన గురించి మాట్లాడకపోవడమే మంచిది, నేను ఆయన్ను పట్టించుకోలేదు. కాని ఆయన చేసిన అప్పుల వల్ల, అప్పులు ఇచ్చిన వారు మా ఇంటికి వచ్చి మా అమ్మని మానసికంగా వేధించేవారు. ఆ సమయంలో నేను స్కూల్ వయసులో ఉండేను. నన్ను చూసి ఎంతో మంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారు. మా అమ్మ ఇవన్నీ భరించలేక, నన్ను, నా అన్నను తీసుకొని కొన్ని బట్టలు, రూ.120తో తిరుపతికి వెళ్లింది.