సింగర్ రాహుల్ సిప్లిగంజ్ నిశ్చితార్థం
టాలీవుడ్‌కి స్టార్ సింగర్, బిగ్ బాస్ విజేత, ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ‘నాటు నాటు’ పాట గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. చాలా కాలంగా ప్రేమిస్తూ వస్తోన్న తన ప్రేయసి హరిణ్యా రెడ్డితో రీసెంట్ గా నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. ఈ నిశ్చితార్థ వేడుక ఆగస్టు 17, ఆదివారం నాడు హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రులు మాత్రమే హాజరయ్యారు. వేడుక సింపుల్‌గా, కుటుంబ సమాజం మధ్య జరిగినా, రాహుల్ సిప్లిగంజ్ ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి.