చికెన్ గున్యా తో బాధపడుతున్న సమంత, నోప్పులు తగ్గడానికి హీరోయిన్ ఎం చేసిందంటే..?

First Published | Jan 11, 2025, 1:50 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అనారోగ్యంపాలు అయ్యారు. ఆమె చికున్ గున్యాతో బాధపడుతున్నారు. ప్రస్తుతం సమంత పరిస్థితి ఎలా ఉందంటే..? 
 

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది సమంత. కమర్షియల్ హీరోయిన్ గా సినిమాలు తగ్గించి.. డిఫరెంట్ క్యారెక్టర్స్ ను ట్రై చేస్తోంది. ఇక ఇప్పటికే మయోసైటిస్ వ్యాధితో బాధపడుతూ.. ట్రీట్మెంట్ తీసుకుంటుంది సమంత. ఇక తాజాగా ఆమె చికెన్ గ్యున్యాతో బాధపడుతోంది. ఈ విషయాన్ని సమంత స్వయంగా వెల్లడించింది. అంతే కాదు జ్వరం తగ్గిపోయినా.. ఆతరువాత వచ్చిన నొప్పులను భరించలేకపోతోంది సమంత. 

Also Read: భన్సాలీతో బన్నీ భేటీ... టాలీవుడ్ పై భారీ ప్లాన్ చేసిన అల్లు అర్జున్..

వాటి నుంచి రిలీఫ్ పొందడం కోసం ఆమె ప్రత్యేకపద్దతిని పాటించింది. ఈ విషయాలు వెల్లడిస్తూ.. సమంత ప్రత్యేకంగా పోస్ట్ పెట్టారు. తాను  చికెన్ గున్యా నుంచి కోలుకుంటున్నట్లు ఒక పోస్ట్ చేసింది సమంత. జ్వరం వల్ల వచ్చిన కీళ్ల నొప్పుల నుంచి కోలుకోవడం చాలా ఫన్ గా ఉందని ఆమె అన్నారు. అంతే కాదు ఈ నొప్పుల నుంచి ఉపశమనం కోసం ఆమె జిమ్ ను ఆప్షన్ గా తీసుకున్నారు. 

Also Read: ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే అత్యంత కాస్ట్లీ సాంగ్ ఏదో తెలుసా..?


వర్కౌట్ చేస్తున్న వీడియోని సమంత పోస్ట్ చేశారు.  నొప్పులు నుంచి కోలుకోవడం కోసం ఆమె వర్కౌట్లను ఆప్షన్ గా తీసుకున్నారు. ఇక తమ ఫేవరెట్ హీరోయిన్ త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. సమంత నాగచైతన్యతో విడాకులు తరువాత తన సినిమాలేవో తాను చేసుకుంటూ గడిపేస్తోంది. ఈక్రమంలోనే.. ఆమె మయోసైటిస్’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టు తెలిసింది. 

Also Read: దంగల్ రికార్డ్స్ పై కన్నేసిన పుష్ప2, అల్లుఅర్జున్ ప్లాన్ మామూలుగా లేదుగా.

ఇక రీసెంట్ గా సమంత ఈ వ్యాధి నుంచి కూడా కోలుకున్న విషయం తెలిసిందే. అయితే మరొకవైపు కంటికి సంబంధించిన సమస్యలతో కూడా ఈమె బాధపడుతోంది. ఎక్కువ లైటింగ్ చూస్తే కళ్ళల్లో నీళ్లు వస్తాయని కూడా తెలిపింది ఈ ముద్దుగుమ్మ. ఒక సమస్య తర్వాత మరొకటి చుట్టుముట్టడంతో ఈమె అభిమానులు సమంతా ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: 

సమంతకు స్టార్ హీరోకు ఉన్నంత ఫాలోయింగ్ ఉంది. కాని అది పెద్దగా బయటపడదుఅంతే. సమంతకు ఓ అభిమాని గుడి కూడా కట్టి పూజిస్తున్నాడు. ఇక ఆమె దాదాపు ఏడాదిన్నరకు పైగా సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. తాజాగా మళ్ళీ సినిమాల్లో యాక్టీవ్ అవుతోంది. ప్రస్తుతం బాలీవుడ్ పై ఎక్కువగా దృష్టి పెట్టింది సమంత. 
 

Samantha Ruth Prabhu

బాలీవుడ్ లో సీటడెల్ హనీ బనీ వెబ్ సిరీస్ లో నటించింది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరిస్ స్క్రీమింగ్ అవుతోంది. ఈ సిరిస్ లో  వరుణ్ ధావణ్ తో కలిసి నటించింది సమంత. పలు బాలీవుడ్ సినిమాల్లో కూడా ఆమె నటిస్తున్నట్టు తెలుస్తోంది. 

Latest Videos

click me!