Samantha: సమంత షాకింగ్ డెసిషన్... ఆందోళనలో ఫ్యాన్స్.. అదే జరిగితే అందరి మైండ్ బ్లాక్!

First Published | Nov 5, 2021, 11:01 AM IST


స్టార్ లేడీ సమంతపై ఓ క్రేజీ రూమర్ చక్కర్లు కొడుతుంది. ఆ న్యూస్ ఫ్యాన్స్ కి షాకిచ్చేలా ఉంది. దీనితో అలా జరగకూడదని అందరూ కోరుకుంటున్నారు. 
 


దాదాపు మూడు నెలలుగా మీడియాలో సమంత పేరు ఎవర్ గ్రీన్ టాపిక్. సమంత-నాగ చైతన్య విడాకుల ఊహాగానాలు మొదలైన నాటి నుండి, Samanthaను ఉద్దేశిస్తూ అనేక కథనాలు వెలువడ్డాయి. అందరూ ఊహించిన విధంగా, అక్టోబర్ 2న సమంత-Naga chaitanya పరస్పర అవగాహనతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. 

విడాకులు ప్రకటన తరువాత సమంత పై లెక్కకు మించిన కథనాలు వెలువడ్డాయి. విడాకులకు కారణాలు ఇవేనంటూ... నిరాధార వార్తలు, కథనాలు పుట్టుకొచ్చాయి. సమంత ఒకటి రెండు సార్లు, ఆ పుకార్లకు సమాధానం చెప్పారు. నిజం తెలియకుండా, అర్థం లేని కథనాలతో ఇబ్బంది పెట్టవద్దని విజ్ఞప్తి చేశారు.


అయినప్పటికీ సమంతను కార్నర్ చేయడం, ఆమె వ్యక్తిగత జీవితంపై ఆరోపణలు చేయడం తగ్గలేదు. విసిగిపోయిన సమంత కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పై పరువు నష్టం దావా కేసు వేశారు. తన కీర్తికి భంగం కలిగేలా కథనాలు ప్రసారం చేశారంటూ, తన లాయర్ల ద్వారా కోర్టులో పిటీషన్ వేశారు. ఈ వ్యవహారంలో సమంతకు మిక్స్డ్ రిజల్ట్ రావడం జరిగింది.

సమంతకు సంబంధించిన కంటెంట్ యూట్యూబ్ ఛానల్స్ నుండి తొలగించాలని ఆదేశించిన కోర్ట్, ఆమెను కూడా మందలించింది. వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియాలో పంచుకోవడం తగ్గించాలని గట్టిగా చెప్పడం జరిగింది. దీనితో సమంత ఓ నిర్ణయానికి వచ్చారట. సమంత పూర్తిగా సోషల్ మీడియాకు దూరం కావాలనుకుంటున్నారట. 


ఏకంగా తన Instagram, ట్విట్టర్, పేస్ బుక్ వంటి అకౌంట్స్ డిలీట్ చేయాలని భావిస్తున్నారట. వ్యక్తిగత జీవితం గురించి ఎటువంటి వివరాలు పంచుకోకూడని బావిస్తున్నారట. మరి ఇదే కనుక జరిగితే, డై హార్డ్ ఫ్యాన్స్ చచ్చిపోతారు. 

Samantha


స్టార్ హీరోల రేంజ్ పాపులారిటీ ఉన్న సమంత Social media అకౌంట్స్ ని రోజుకు లక్షల మంది ఫాలో అవుతూ ఉంటారు. అలాంటి వారందరికీ సమంత నిర్ణయం గొడ్డలిపెట్టు లాంటిది. అయితే అధికారికంగా సమంత ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు, మీడియాలో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. 

samantha

ఇక శాకుంతలం మూవీ షూటింగ్ పూర్తి అయిన తరువాత సమంత, సినిమాలకు బ్రేక్  ప్రకటించారు. ఈ ఖాళీ సమయాన్ని ఆమె విహారాలకు కేటాయించారు. అయితే దసరా పండుగ నాడు ఆమె కొత్త ప్రాజెక్ట్స్ ప్రకటించారు. అలాగే మరికొన్ని కొత్త సినిమాలకు ఆమె సైన్ చేయాల్సి ఉంది. సమంత తన రెమ్యూనరేషన్ కూడా పెంచేశారంటూ వార్తలు వస్తున్నాయి.

ఇక గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కినShakunthalam పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. ఈ మైథలాజికల్ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో గుణశేఖర్ సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కించారు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అలాగే షారుక్ ఖాన్-అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లయన్ మూవీ నుండి నయనతార తప్పుకున్నట్లు, ఆమె స్థానంలో సమంత నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

Also read బ్రేకప్ తర్వాత రెమ్యునరేషన్ పెంచేసిన సమంత.. చాలా దూరంలో పూజ, రష్మిక ? 

Also read దివాళీ వేళ రెచ్చిపోయిన చూపించిన రాశి ఖన్నా... రెడ్ చోళీ లెహంగాలో నడుము, నాభీ చూపిస్తూ రచ్చ!

Latest Videos

click me!