దివాళీ వేళ రెచ్చిపోయిన చూపించిన రాశి ఖన్నా... రెడ్ చోళీ లెహంగాలో నడుము, నాభీ చూపిస్తూ రచ్చ!

First Published | Nov 5, 2021, 9:00 AM IST

కరోనా వైరస్ ప్రభావంతో గత ఏడాది దీపావళి సెలబ్రేషన్స్ అంతగా జరుపుకోలేదు. ప్రస్తుతం పరిస్థితులు చెక్కబడిన నేపథ్యంలో Diwali 2021 గ్రాండ్ గా జరుపుకున్నారు. ముఖ్యంగా సెలెబ్రిటీలు సాంప్రదాయ బట్టలలో పండగ వేళ కనువిందు చేశారు. 


అయితే రాశి ఖన్నా మాత్రం ట్రెడిషన్ వేర్ లో కూడా తన మార్కు గ్లామర్ షోకి తెరలేపింది. నెలవంకలాంటి నడుము, రేచుక్క లాంటి నాభి...  చూపిస్తూ ఫ్యాన్స్ కి దివాళీ ట్రీట్ ఇచ్చింది. రాశి ఖన్నా గ్లామర్ చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఫిదా కావడంతో పాటు, కామెంట్స్ రూపంలో అభిమానం చాటుకుంటున్నారు. 
 

చేతినిండా సినిమాలతో కెరీర్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుండగా, ఆ ఆనందం రాశి ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. దివాళీ దీపాల కాంతులతో ఆమె ముఖం మరింతగా మెరిసిపోయింది. దేవకన్యలా ఉన్న రాశి లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ కావడం జరిగింది. 
 


2013లో విడుదలైన హిందీ చిత్రం మద్రాస్ కేఫ్ హీరోయిన్ గా రాశి ఖన్నాకు మొదటి చిత్రం. బాలీవుడ్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చినా.. ఆమెకు అవకాశాలు మాత్రం టాలీవుడ్ లోనే దక్కాయి. మనం చిత్రంలో ఓ గెస్ట్ రోల్ తో Raashi khanna తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టారు. 
 


ఊహలు గుసగుసలాడే మూవీతో రాశి ఖన్నా పూర్తి స్థాయి హీరోయిన్ గా మారారు. దర్శకుడు అవసరాల శ్రీనివాస్ తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఊహలు గుసగుసలాడే.. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. నాగ శౌర్య హీరోగా నటించగా రాశి ఖన్నా పాత్ర బాగా ఆకట్టుకుంది. 
 


ఆ తరువాత జోరు, జిల్, శివమ్, బెంగాల్ టైగర్ ఇలా వరుస ఆఫర్స్ దక్కాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా రాశి ఖన్నాకు దర్శక నిర్మాతలు అవకాశాలు ఇవ్వడం జరిగింది. పెద్దగా హిట్ పర్సెంటేజ్ లేకున్నా, జై లవకుశ చిత్రంలో ఎన్టీఆర్ కి జంటగా నటించే ఛాన్స్ పట్టేసింది రాశి ఖన్నా. రాశి ఖన్నా కెరీర్ లో నటించిన అతిపెద్ద స్టార్ Ntr కావడం విశేషం. 
 

ఇక వెండితెరపై రాశి మితిమీరిన గ్లామర్ పంచిన సందర్భాలు లేవు. హద్దులు లేని స్కిన్ షోకి ఆమె దూరంగా ఉన్నారు. ఓ మోస్తరుగా పొట్టిబట్టలు ధరిస్తూ ఫ్యాన్స్ ని ఫిదా చేశారు. అయితే అనూహ్యంగా వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో రాశి ఖన్నా బోల్డ్ రోల్డ్ చేశారు. విజయ్ దేవరకొండతో కలిసి ఆమె చేసిన రొమాన్స్, టాలీవుడ్ ఆడియన్స్ ని షాక్ కి గురిచేసింది. 
 


అంత పెద్ద రిస్క్ చేసిన రాశికి సినిమా పరాజయంతో ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఆమె కెరీర్ పై నెగిటివ్ ఇంపాక్ట్ పడింది. రాశి అలాంటి పాత్రలో కనిపించడం ఫ్యాన్స్ కి కూడా నచ్చలేదు. వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ చేసి ఉండాల్సింది కాదని రాశి సన్నిహితులతో వాపోయారన్న వార్తలు కూడా రావడం జరిగింది. 
 

లాక్ డౌన్ తరువాత రాశి కెరీర్ మరలా ఊపందుకుంది. చేతినిండా సినిమాలతో ఊపిరి కూడా పీల్చుకోలేనంత బిజీగా మారారు. ప్రస్తుతం తెలుగు చిత్రాలు పక్కా కమర్షియల్, థాంక్యూ  లతో పాటు నాలుగు తమిళ చిత్రాలు చేస్తున్నారు. అలాగే రెండు వెబ్ సిరీస్ లలో రాశి ఖన్నా నటిస్తున్నారు. 

Also read Anna leznheva: పవన్ భార్యపై ఈ రూమర్ నిజమేనా..?

Also read వామ్మో శ్రీముఖిని చూశారా.. చిరుత పిల్లలా అందాలతో దాడి, థైస్ హాట్ నెస్ కి కుర్రాళ్లు ఉక్కిరిబిక్కిరి

Latest Videos

click me!