Bigg Boss Telugu 5: సిరి మనసు విరిచేసిన షణ్ముఖ్.. పదే పదే ఆ మాటలతో..

First Published | Nov 4, 2021, 11:32 PM IST

ఇక షణ్ముఖ్, సిరి మధ్య నెమ్మదిగా గొడవలు మొదలవుతాయి. టాస్క్ లో గొడవలు సహజం అని షణ్ముఖ్ అంటాడు. లేదు నా మాట వినకుండా కావాలనే గొడవ పెట్టుకుంటున్నావు అని సిరి షణ్ముఖ్ తో ఎమోషనల్ గా మాట్లాడుతుంది.

గురువారం సూపర్ హీరో టాస్క్ తో బిగ్ బాస్ 5 ఎపిసోడ్ ప్రారంభం అవుతుంది. రవి వివిధ రకాల టాస్క్ లతో పింకీని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. కానీ పింకీ అన్ని టాస్క్ లని ఓపిగ్గా పూర్తి చేస్తుంది. కోడి గుడ్డు వాసన తనకు పడకపోయినా ప్రియాంక దానిని తాగుతుంది. ఇతర సభ్యులంతా ప్రియాంకని ఎంకరేజ్ చేస్తూ కనిపిస్తారు. మొత్తంగా ప్రియాంక తన టాస్క్ ని విజయవంతంగా పూర్తి చేస్తుంది. 

ఇక షణ్ముఖ్, సిరి మధ్య నెమ్మదిగా గొడవలు మొదలవుతాయి. టాస్క్ లో గొడవలు సహజం అని షణ్ముఖ్ అంటాడు. లేదు నా మాట వినకుండా కావాలనే గొడవ పెట్టుకుంటున్నావు అని సిరి షణ్ముఖ్ తో ఎమోషనల్ గా మాట్లాడుతుంది. నువ్వు నన్ను పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నావు అంటూ వాపోతుంది. ఎవరో బయటి వ్యక్తి టార్గెట్ చేస్తే బాధపడను. నువ్వు నన్ను ఇండివిడ్యువల్ గా ఆడు అని పదే పదే అంటుంటే హర్టింగ్ గా ఉంది అని సిరి షణ్ముఖ్ ముందు ఆవేశంతో ఊగిపోతోంది. 


అలిగి వెళ్లి బయట పడుకుంటుంది. దీనితో షణ్ముఖ్ ఆమెని బుజ్జగించే ప్రయత్నం చేస్తాడు. సిరి బయట గార్డెన్ ఏరియాలో పడుకుని ఉంటే షణ్ముఖ్ కాళ్ళు పట్టుకుని లాగేస్తాడు. దీనితో సిరి నవ్వేస్తుంది. నన్ను ఏడిపించినందుకు గుంజిళ్ళూ తీయమని చెబుతుంది.సిరి కోసం షణ్ముఖ్ గుంజీళ్లు తీస్తాడు. బజర్ మోగిన ప్రతి సారి ఇంటి సభ్యులు తాళం కోసం పోటీ పడుతుంటారు. ఈ టాస్క్ లో హద్దులు డటె విధంగా ఫిజికల్ అవుతూ ఉంటుంది. ఒకరినొకరు నెట్టుకోవడం, తోసుకోవడం జరుగుతూ ఉంటుంది. 

చాలా మంది ఇంటి సభ్యులు పడిపోతారు కూడా. ఈ క్రమంలో మానస్, విశ్వ మధ్య పెద్ద గొడవే జరుగుతుంది. ఇక్కడ మరోసారి షణ్ముఖ్, సిరి మధ్య మాటల యుద్ధం మొదలవుతుంది. నేనిక్కడ ఎవ్వడి కోసం రాలేదు.. నా కోసం నేను వచ్చా.. గేమ్ ఆడుతున్నా  అంటూ సిరి షణ్ముఖ్ ని ఉద్దేశిస్తూ అరిచేస్తుంది. ఏడుస్తూ వెళ్ళిపోతుంది. సిరి ఇండివిడ్యువల్ గేమ్ ఆడాలని షణ్ముఖ్ పదే పదే అంటున్నాడని సిరి మనోవేదనకు గురవుతుంది. ఆమె మనసు విరిగిపోతుంది. ఇంతలో అనీ మాస్టర్ ని ఆమె ప్రత్యర్థి టీం సభ్యులు ఎంచుకుంటారు. సిరి 

దీనితో అనీ మాస్టర్ గార్డెన్ ఏరియాలో ఇంటి సభ్యులు ఇచ్చిన జ్యూస్ లు తాగాల్సి వస్తుంది. ఐస్ వాటర్ తలపై పోసుకుంటుంది. బజర్ మోగేవరకు క్విట్ కాకుండా విజయవంతంగా టాస్క్ పూర్తి చేసింది. ఆ తర్వాత సిరి గురించి షణ్ముఖ్, కాజల్ మధ్య సీక్రెట్ గా చర్చ జరుగుతుంది. రవి ఏమీ చెప్పడు చేయిస్తాడు అంటూ షణ్ముఖ్ అతడి ట్రిక్స్ ని కాజల్ కి వివరిస్తాడు. సిరి అయితే స్ట్రాంగ్ కంటెస్టెంట్.. టాస్క్ లలో అయితే ఆమె రాడ్ అని షణ్ముఖ్ అంటాడు. 

మానస్, ప్రియాంక మధ్య కూడా చిన్నపాటి సరదా సంభాషణ జరిగింది. ప్రియాంక గురించి మానస్ కొంచెం ఘాటుగానే మాట్లాడతాడు. నీకు వ్యతిరేకంగా ఉండే వారి నాశనం చూడాలనుకునే మనస్తత్వం నీది అని మానస్ అంటాడు. బాధపెట్టే మాటలు అనవద్దు అంటూ పింకీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చివర్లో ఫుడ్ విషయంలో సిరి, పింకీ మధ్య వివాదం చెలరేగుతుంది. ఇంతటితో నేటి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Latest Videos

click me!