రాజ్ తో పెళ్లిని అఫీషియల్ గా ప్రకటించిన సమంత.. బ్యూటిఫుల్ వెడ్డింగ్ ఫోటోస్ వైరల్, ఇద్దరూ ఎలా ఉన్నారో చూశారా

Published : Dec 01, 2025, 02:30 PM IST

కొంతకాలంగా రిలేషన్ లో ఉన్న సమంత, రాజ్ సోమవారం రోజు కోయంబత్తూర్ లో వివాహం చేసుకున్నారు. సమంత తాజాగా తమ పెళ్లిని అధికారికంగా ప్రకటిస్తూ ఫోటోలు షేర్ చేసింది. 

PREV
15
సమంత, రాజ్ నిడిమోరు పెళ్లి 

సమంత, రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూర్ లోని ఇషా యోగ సెంటర్ లో వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ సమంత తన సోషల్ మీడియా ఖాతాలో వెడ్డింగ్ ఫొటోస్ షేర్ చేసింది. 

25
ఫ్యామిలీ మ్యాన్ 2 తో ఇద్దరి మధ్య పరిచయం 

 సమంత, రాజ్ వివాహం చేసుకున్నట్లు ఈ ఉదయం నుంచి వార్తలు మొదలయ్యాయి. ఇప్పుడు ఆ వార్తలే నిజమయ్యాయి. కొంత కాలంగా రాజ్, సమంత రిలేషన్ లో ఉన్నారు. ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ లో సమంత నటించింది. ఆ సిరీస్ కి రాజ్ కూడా దర్శకుడు. దీనితో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. నాగ చైతన్య నుంచి విడిపోయిన తర్వాత.. సమంత, రాజ్ మధ్య ప్రేమ మొదలైంది. 

35
కొంతకాలంగా ప్రేమలో సమంత, రాజ్ 

ఇటీవల వీరిద్దరూ తమ ప్రేమని అధికారికంగా ప్రకటించకపోయినపప్టికీ చెట్టాపట్టాలేసుకుని జంటగా పలు సందర్భాల్లో కనిపించారు. సమంత కూడా సోషల్ మీడియాలో రాజ్ తో ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ హింట్స్ ఇస్తూ వచ్చింది. 

45
లింగ భైరవి ఆలయంలో వివాహం 

మొత్తానికి సమంత.. రాజ్ తో తన బంధాన్ని అఫీషియల్ చేసుకుంది. ఇషా యోగా సెంటర్ లోని లింగ భైరవి ఆలయంలో వీరిద్దరి వివాహం ప్రైవేట్ వేడుకగా జరిగింది. సమంత పెళ్లి ఫోటోలని షేర్ చేయగానే అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. 

55
పెళ్లి ఫోటోలు షేర్ చేసిన సమంత 

పెళ్లి ఫోటోలలో సమంత రెడ్ శారీలో మెరిసిపోతోంది. రాజ్ నిడిమోరు కుర్తా పైజామా ధరించి పైన సూట్ ధరించారు. వధూవరులు ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ మెరిసిపోతున్నాడు. పెళ్ళిలో హోమం, హారతి లాంటి దృశ్యాలని కూడా సమంత పంచుకుంది. వేద మంత్రాల సాక్షిగా ఇద్దరి వివాహం జరిగింది. పెళ్లి ఫోటోలు షేర్ చేస్తూ సమంత డిసెంబర్ 1, 2025 తేదీని మార్క్ చేసింది. లవ్ ఎమోజిలు పోస్ట్ చేసింది. 

Read more Photos on
click me!

Recommended Stories