పెళ్లి చేసుకున్న సమంత, రాజ్ నిడిమోరు.. ఇకపై దంపతులుగా కొత్త జీవితం

Published : Dec 01, 2025, 12:53 PM IST

కొంతకాలంగా ప్రేమలో ఉన్న సమంత, రాజ్ నిడిమోరు ఎట్టకేలకు వివాహం చేసుకున్నారు. కోయంబత్తూర్ లో వీరి పెళ్లి ప్రైవేట్ వేడుకగా జరిగింది. దీనితో అభిమానులు సమంతకి శుభాకాంక్షలు చెబుతున్నారు. 

PREV
15
సమంత, రాజ్ రిలేషన్

సమంత, రాజ్ నిడిమోరు కొంత కాలంగా రిలేషన్ లో ఉన్నారు. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత రాజ్ తో ప్రేమలో పడింది. అయితే తమ రిలేషన్ గురించి సమంత ఎప్పుడూ ఎక్కడా మాట్లాడలేదు. కానీ రాజ్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలని షేర్ చేస్తూ వచ్చింది. 

25
రాజ్ ని వివాహం చేసుకున్న సమంత 

 దీనితో సమంత, రాజ్ ప్రేమలో ఉన్నారని అంతా భావించారు. సమంత మరోసారి ఎప్పుడు వివాహ బంధంలోకి అడుగుపెడుతుంది అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆ తరుణం వచ్చేసింది. సోమవారం రోజు ఉదయం సమంత, రాజ్ నిడిమోరు ప్రైవేట్ గా జరిగిన వేడుకలో వివాహం చేసుకున్నారు. అధికారికంగా దంపతులు అయ్యారు. 

35
కోయంబత్తూర్ లో వేడుక 

ఈ వేడుక కోయంబత్తూర్ లోని ఇషా యోగ సెంటర్ లో జరిగింది. ఇషా యోగా సెంటర్ లో ఉన్న భైరవి ఆలయంలో సమంత, రాజ్ ఒక్కటయ్యారు. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. 

45
త్వరలోనే ప్రకటన 

సమంత, రాజ్ త్వరలోనే తమ వివాహాన్ని అభిమానులకు ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. సమంత తొలిసారి రాజ్ నిడిమోరు దర్శకత్వంలో ఫ్యామిలీ మ్యాన్ 2లో నటించింది. అక్కడే వీరిద్దరూ తొలిసారి కలుసుకున్నారు. 

55
ఇద్దరికీ రెండో వివాహమే

సమంతతో పాటు రాజ్ కి కూడా ఇది రెండవ వివాహమే. ప్రస్తుతం సమంత వయసు 38 ఏళ్ళు కాగా రాజ్ నిడిమోరు వయసు 46 ఏళ్ళు. సమంత 2017లో నాగ చైతన్యని ప్రేమ వివాహం చేసుకుంది. మూడేళ్ళ తర్వాత వీరిద్దరూ విడిపోయారు. ఇప్పుడు మరోసారి ఆమె వివాహ బంధంలోకి అడుగు పెట్టడంతో అభిమానులు ఆమెకి శుభాకాంక్షలు చెబుతున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories