వివాహ వేడుక...
ఈ వేడుక కోయంబత్తూర్ లోని ఇషా యోగా సెంటర్ లో జరిగింది. ఇషా యోగా సెంటర్ లో ఉన్న భైరవి ఆలయంలో సమంత, రాజ్ ఒక్కటయ్యారు. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. సమయం దొరికినప్పుడల్లా ఇషా ఫౌండేషన్ కి వెళ్తూ ఉంటారు. దాని వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ నిర్వహించే కార్యక్రమంలో కూడా సమంత పాల్గొంటూ ఉంటారు. ఆయన సమక్షంలోనే ఈ పెళ్లి జరిగినట్లు సమాచారం.