తాను ఆశించిందే జరగడంతో సంతోషంలో ఉబ్బితబ్బిబ్బవుతున్న సమంత.. వెంకీ కూతురు, కంగనా కామెంట్లు

Published : Oct 23, 2021, 02:25 PM IST

సమంత ఇప్పుడు ఆధ్యాత్మిక బాట పట్టింది. వరుసగా గుళ్లు గోపురాలను దర్శిస్తూ తీర్థయాత్రల్లో మునిగి తేలుతుంది. ప్రస్తుతం ఆమె చార్‌ ధామ్‌, కేదార్‌నాథ్‌ వంటి ప్రాంతాలను వీక్షించింది. అయితే ఈసందర్భంగా ఆమె పెట్టిన పోస్ట్ హాట్‌ టాపిక్‌ అవుతుంది.

PREV
18
తాను ఆశించిందే జరగడంతో సంతోషంలో ఉబ్బితబ్బిబ్బవుతున్న సమంత.. వెంకీ కూతురు, కంగనా కామెంట్లు

సమంత(Samantha)... నాగచైతన్య(Naga Chaitanya)తో విడాకుల తర్వాత రెట్టింపు ఉత్సాహాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తుంది. అందుకోసం విహారా యాత్రలను వేదికగా చేసుకుంది. విడాకుల ప్రకటనకు ముందు స్నేహితురాలు శిల్పారెడ్డితో కలిసి వెకేషన్‌ ఎంజాయ్‌ చేసింది. ఇప్పుడు ఆధ్యాత్మిక బాట పట్టింది. వరుసగా గుళ్లు గోపురాలను దర్శిస్తూ తీర్థయాత్రల్లో మునిగి తేలుతుంది Samantha. ప్రస్తుతం ఆమె చార్‌ ధామ్‌, కేదార్‌నాథ్‌ వంటి ప్రాంతాలను వీక్షించింది. 
 

28

ఈ సందర్భంగా సమంత పంచుకున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇందులో భాగంగా సమంత స్నేహితురాలు శిల్పారెడ్డితో కలిసి వెళ్లిన చార్‌ధామ్‌ యాత్రని పూర్తి చేసుకుంది. యము నోత్రి నుంచి మొదలైన యాత్ర గంగోత్రి మీదుగా, కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ వరకు సాగిందట. 1968నాటి మహేష్‌ యోగి ఆశ్రమానికి సమంత వెల్లారు. అక్కడ దిగిన ఫోటోలను కూడా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.

38

ఈ యాత్ర గురించి సమంత పేర్కొంది. ఇందులో ఆమె చెబుతూ, మహాభారతాన్ని చదివినప్పటి నుంచి ఈ భూమ్మీద స్వర్గదామమైన హిమాలయాలను సందర్శించాలని అనుకుందట. ఇప్పటి ఆ కల నెరవేరిందని, తన కల నిజమైందని చెప్పింది సమంత. తాను ఆశించినదే జరిగిందట. తన హృదయంలో హిమాలయాలకు ఎప్పుడూ ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పింది సమంత. ఇందులో సమంత పూర్తిగా ఆథ్యాత్మిక చింతనతో కనిపిస్తుంది. 

48

ఈ పోస్ట్ కి హీరో వెంకటేష్‌ కూతురు ఆశ్రిత స్పందించడం విశేషం. ఆమెతోపాటు కంగనా రనౌత్‌ కూడా వాహ్‌ అంటూ కామెంట్‌ పెట్టింది. రుహానీ శర్మ లవ్‌ సింబల్‌ని పంచుకుంది. ఇలా చాలా మంది సెలబ్రిటీలు సమంత యాత్రపై అభినందనలు తెలియజేస్తున్నారు. రెట్టింపు ఎనర్జీతో తిరిగి రావాలని కోరుకుంటున్నారు. 

58
samantha

ప్రస్తుతం సమంత ఈ యాత్రకి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. సమంత పూర్తి ట్రెడిషనల్‌ లుక్‌లో ఆకట్టుకుంటుంది. నాగచైతన్యతో విడాకుల అనంతరం ఇలా యాత్రలు చేస్తూ ఆ మానసిక వేదననుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుంది సమంత.

68

సమంత విజయదశమి సందర్భంగా కొత్తగా రెండు సినిమాలను ప్రకటించి అభిమానులను సర్‌ప్రైజ్‌ చేసింది. ఇందులో భాగంగా డ్రీమ్‌ వారియర్స్ పిక్చర్స్ లో తెలుగు, తమిళం బైలింగ్వల్‌ సినిమా చేస్తుంది. మరోవైపు శ్రీదేవి మూవీస్‌లో మరో బైలింగ్వల్‌ చిత్రాన్ని ప్రకటించి తాను రెట్టింపు ఉత్సాహంతో, బిగ్‌ కమ్‌బ్యాక్‌ రాబోతున్నట్టు వెల్లడించింది. 

 

78

వీటితోపాటు తెలుగులో పౌరాణిక చిత్రం `శాకుంతలం`లో నటిస్తుంది. శకుంతలగా ఆమె మెస్మరైజ్‌ చేయబోతుంది. ఇందులో అల్లు అర్జున్‌ కూతురు అల్లు అర్హ కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. మరోవైపు తమిళంలో కాథు వాకుల రెండు కాదల్‌` చిత్రంలో నయనతార, విజయ్‌ సేతుపతులతో కలిసి నటిస్తుంది సమంత. ఓ వైపు యాత్రలు, మరోవైపు వరుస సినిమాలతో మళ్లీ బిజీ అయ్యేందుకు సమంత ప్లాన్‌ చేస్తుంది.

88

సమంత..నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్టు ఈ నెల 2న ప్రకటించిన విషయం తెలిసిందే. చైతూ, సామ్‌ ప్రేమించుకుని 2017 అక్టోబర్ 6న వివాహం చేసుకున్నారు. సరిగ్గా నాలుగేండ్లకి నాలుగు రోజుల ముందు తమ డైవర్స్ ప్రకటన చేశారు. వారి అభిమానులకు పెద్ద షాకిచ్చారు. 

also read: ఛార్ ధామ్ యాత్రలో సమంత.. ప్రత్యేక హెలికాప్టర్ లో యమునోత్రికి ప్రయాణం
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories