సమంత లో ఎంత మార్పు, అప్పటికి ఇప్పటికి గుర్తుపట్టలేనంతగా మారిపోయిన బ్యూటీ.

First Published | Nov 21, 2024, 8:14 PM IST

టాలీవుడ్ స్టార్ సమంతా రూత్ ప్రభు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. సమంతా రూపాన్ని చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

టాలీవుడ్ స్టార్ సమంతా రూత్ ప్రభు ఒక్కసారిగా సినిమాల్లోకి రాలేదు. మోడల్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి..ఆడ్ ఫిల్మ్స్ లో నటించి.. ఆతరువాత  టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్  అయ్యింది. కానీ ఆమె జీవితం అంతా సుఖమయం కాదు.

వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు, అనారోగ్యంతో బాధపడుతున్న సమంత పాత వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. అభిమానులకు షాక్ ఇస్తోంది. సమంత రూత్ ప్రభు కెరీర్ ప్రారంభంలో వీడియో ఇది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read:  రాధిక కొడుకుని చూశారా..? హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడా..?

ఇప్పుడు వైరల్ అవుతున్నది సమంతా నటించిన పాత ప్రకటన వీడియో. ఆ వీడియోలో కనిపించే సమంతాకి, ఇప్పటి సమంతాకి అసలు పోలిక లేదు.  అసలు గుర్తు పట్టలేరు. వీడియో చూసిన అభిమానులు ఆమె కెరీర్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఎంత మారిపోయిందో అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆ వీడియో చూసి ఆశ్చర్యపోతున్నారు. 

Also Read: జపాన్ -చైనాలో ప్రభాస్ కంటే ఎక్కువ క్రేజ్ ఉన్న తెలుగు హీరో ఎవరో తెలుసా..?


ఒక అభిమాని, ఆ వీడియోలో ఉన్న సమంతాకి, ఈ సమంతాకి ఏమి సంబంధం లేదు. ఎంత మార్పో అని కామెంట్ చేశారు. ఇంకొకరు అది ఆమె కాదేమో అన్నారు. ఇలా సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు పెడుతున్నారు. 

ఇలాంటి కామెంట్ల మధ్య చాలామంది సమంత అందాన్ని మెచ్చుకున్నారు. ఒక అభిమాని 'అప్పుడు చాలా అందంగా ఉండేది, ఇప్పుడు కూడా' అని కామెంట్ చేశారు.

Also Read: ధనుష్ - ఐశ్వర్య విడాకుల కేసు: కోర్టు తీర్పు ఏంటి? జడ్జి ఏమన్నారంటే..?

సమంత 2010లో 'ఏమాయ చేశావే' సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఇది తమిళ సినిమా 'వినైతాండి వరువాయ' రీమేక్. ఈ సినిమా తర్వాత తమిళ, తెలుగు సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది సమంత. అంతే కాదు రెండు ఇండస్ట్రీలలో ఆమె స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. సౌత్ లోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది సమంత. 

Also Read: ఎ.ఆర్. రెహమాన్ పేరు మార్చుకోవడం వెనుక సీక్రేట్ ఏంటో తెలుసా..?

సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా స్టార్ గా పెరుతెచ్చుకుంటుంది సమంత. ఈమధ్య బాలీవడ్ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది.  సినిమాలే కాదు, వెబ్ సిరీస్‌లలో కూడా చేస్తోంది.  'ది ఫ్యామిలీ మ్యాన్: సీజన్ 2'లో అద్భుతంగా నటించింది సామ్. ఇటీవల 'సిటాడెల్: హనీ బన్నీ'లో అతిథి పాత్రలో కనిపించారు.

సమంత తన నటనతో, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది. చిన్న ప్రకటనల నుండి స్టార్ నటిగా ఎదిగిన ఆమె ప్రయాణం స్ఫూర్తిదాయకం. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తిరుగులేని నటిగా పేరు తెచ్చుకున్న ఆమె.. ప్రస్తుతం నటించిన 'సిటాడెల్: హనీ బన్నీ' ప్రైమ్ వీడియోలో ఉంది. త్వరలో నెట్‌ఫ్లిక్స్ 'రక్త బ్రహ్మాండం'లో నటిస్తున్నారు.

Latest Videos

click me!