తమిళ స్టార్ నటుడు ఎమ్మార్ రాధా కూతురు రాధిక. స్టార్ హీరోయిన్ గా ఉన్న టైమ్ లోనే నటుడు ప్రతాప్ పోతన్ ను పెళ్లాడింది రాధిక. రెండేళ్లకే విడాకులు తీసుకుని రిచర్డ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇతనితో కూడా రెండేళ్లు మాత్రమే కాపురం చేసిన రాధిక.. లాంగ్ గ్యాప్ తీసుకుని కెరీర్ పై దృష్టి పెట్టింది.
దాదాపు పదేళ్ళ తరువాత మళ్ళీ 2001 లో.. అప్పటికే భార్యతో విడాకులు తీసుకున్న స్టార్ హీరో శరత్ కుమార్ ను పెళ్లాడింది. శరత్ కుమార్ కు అప్పటికే వరలక్ష్మి పుట్టింది. వరలక్ష్మి ప్రస్తుతం తమిళ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మెస్ట్ వాంటెడ్ లేడీ విలన్ గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటు రాధిక, శరత్ కుమార్ దంపతులకు జన్మించిన సంతానం గురించి మాత్రం ఆడియన్స్ కి అంత అవగాహన లేదు.