200 కోట్లు వదిలేసుకున్న సమంత.. నాగచైతన్య చేసిన పనికి సంచలన నిర్ణయం

Samantha: సమంత, నాగచైతన్య విడాకుల వార్తలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశం అయ్యింది. అయితే సామ్‌ ఏకంగా రెండు వందల కోట్లని వదులుకోవడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

Samantha Ruth Prabhu Reportedly Rejected 200 Crore Alimony in telugu arj
Samantha

Samantha: సౌత్ ఇండియన్ నటి సమంత రూత్ ప్రభు విడాకులు తీసుకుని 4 ఏళ్లు దాటిపోయింది. 2021 అక్టోబర్‌ 2న నాగచైతన్య, సమంత విడాకులు ప్రకటించిన విషయం తెలిసిందే. 

ధనశ్రీ వర్మ, క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు తీసుకున్నారు. చాహల్ 4.5 కోట్ల భరణం ఇచ్చాడని టాక్. అంత భారీ మొత్తం భరణంగా ఇవ్వడం ఇటీవల చర్చనీయాంశంగా మారింది.  


Samantha, naga chaitanya

దీంతో సమంత రూత్ ప్రభు విడాకుల విషయం చర్చకు వచ్చింది. భర్త నాగ చైతన్య నుండి భరణం ఎందుకు తీసుకోలేదనేది చర్చనీయాంశం అవుతుంది. 

Samantha, naga chaitanya

సమంత రూత్ ప్రభు, నాగ చైతన్య 2017లో పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం తర్వాత ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. దాదాపు నాలుగేళ్లు కలిసి ఉన్నారు. అనంతరం విడిపోతున్నట్టు ప్రకటించి షాకిచ్చారు. 

Samantha, naga chaitanya

విడాకుల సమయంలో నాగ చైతన్య సమంత రూత్ ప్రభుకు 200 కోట్ల రూపాయలు భరణంగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడట. కానీ సమంత రిజెక్ట్ చేసిందని సమాచారం. 

Samantha,

తనకు ఎలాంటి ఆర్థిక సహాయం అవసరం లేదు. తాను సంపాదించుకోగలను అని రిజెక్ట్ చేసిందట. తాను కూడా స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న నేపథ్యంలో తాను సినిమాలపై ఫోకస్‌ పెడితే సంపాదించడం పెద్ద లెక్క కాదని భావించిందట.  మొత్తంగా రెండు వందల కోట్ల భరణాన్ని తృణ ప్రాయంగా వదులుకుని రియల్‌ లైఫ్‌లో హీరోగా అనిపించుకుంది సమంత. 

Samantha, naga chaitanya

సమంతతో విడిపోయిన తర్వాత నాగచైతన్య మరో జీవితాన్ని ప్రారంభించారు. ఆయన గతేడాది డిసెంబర్‌లో హీరోయిన్‌ శోభితాని వివాహం చేసుకున్నారు. వీరిద్దరు కూడా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం మ్యారేజ్‌ లైఫ్‌ని హ్యాపీగా లీడ్‌ చేస్తున్నారు. కానీ సమంత మాత్రం ఇంకా ఒంటరిగానే ఉంది. 

Samantha

విడాకుల తర్వాత సమంత లైఫ్‌ తలక్రిందులైంది. ఆమెని మయోసైటిస్‌ వ్యాధి వెంటాడింది. దానితో ఏడాదికిపైగానే పోరాడింది. దాన్నుంచి బయటపడి మళ్లీ సినిమాలు చేయాలనుకునే సమయంలోనే ఇటీవల తండ్రి చనిపోయారు. ఇలా వరుసగా దెబ్బ మీద దెబ్బ పడుతుంది. 

ఆమె మరింతగా డౌన్‌ అయ్యింది. కానీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, డౌన్‌ కాకుండా తన పోరాట స్ఫూర్తిని చాటుకుంటుంది. మళ్లీ సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ఆమె `మా ఇంటి బంగారం` సినిమాలో నటించబోతుంది.  చివరగా ఆమె `ఖుషి` చిత్రంలో నటించిన విసయం తెలిసిందే. 

read  more: కమల్‌ హాసన్‌, నాగార్జున కాదు.. సౌత్‌ కింగ్‌ ఆఫ్‌ రొమాన్స్ ఇతనే.. మూడు పెళ్లిళ్లు, లెక్కలేని ఎఫైర్లు

also read: ఇంకా పిల్లలు కావాలంటే వేరే అమ్మాయిని చూసుకో అన్నది.. కుటుంబ నియంత్రణపై మంచు విష్ణు బోల్డ్ స్టేట్‌మెంట్‌

Latest Videos

vuukle one pixel image
click me!