Betting Apps: నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు.. అన్వేష్ సంచలన వ్యాఖ్యలు.

Published : Mar 22, 2025, 06:09 PM ISTUpdated : Mar 22, 2025, 06:16 PM IST

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్‌ యాప్స్ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. బెట్టింగ్‌ యాప్స్‌కు ప్రమోట్‌ చేసిన ప్రముఖులపై కేసులు నమోదు కాగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. బెట్టింగ్‌ యాప్స్ విషయంలో యూట్యూబర్‌ నా అన్వేష్‌ చుట్టూ కథ తిరుగుతోంది. బెట్టింగ్‌ యాప్స్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా అన్వేష్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశాడు..   

PREV
13
Betting Apps:  నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు.. అన్వేష్ సంచలన వ్యాఖ్యలు.
anvesh

బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తున్న వారికి వ్యతిరేకంగా కొన్ని రోజులుగా అన్వేష్‌ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా బెట్టింగ్‌ యాప్‌ ప్రమోటర్లను టార్గెట్ చేశాడు అన్వేష్‌. మొన్నటికి మొన్న తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌తో, అన్వేష్‌ నిర్వహించిన ఇంటర్వ్యూ ద్వారా చర్యలు మొదలైన విషయం తెలిసిందే. దీంతో సోషల్‌ మీడియా వేదికగా 'నా అన్వేషణ అన్వేష్‌'కు పెద్ద ఎత్తున మద్ధతు లభించింది. 

23

అయితే ఇదే సమయంలో అన్వేష్‌పై పలువురు సోషలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్‌పై పోరు చేస్తున్న క్రమంలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడనే ఆరోపణలు వచ్చాయి. ట్రావెల్ వ్లోగర్ భయ్యా సన్నీ యాదవ్ తల్లిని ఉద్దేశిస్తూ అన్వేష్‌ అభ్యంతరక వ్యాఖ్యలు చేశాడని అన్వేష్‌ ఇండియాకు రాగానే అతనిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. 

33
Naa Anveshana avinash betting apps

ఈ క్రమంలోనే తాజాగా అన్వేష్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ చేశాడు. 'గెట్‌ రడీ టాలీవుడ్‌ 5 PM' అంటూ ముందు ఒక పోస్ట్ చేశాడు. దీంతో అన్వేష్‌ ఏం చెప్పనున్నాడని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. బెట్టింగ్ యాప్‌కు సంబంధించి మరో టాలీవుడ్ సెలబ్రిటీ పేరు బయటపెట్టనున్నాడని అంతా అనుకున్నారు. అయితే బెట్టింగ్ యాప్‌పై పోరాటం ఆపకపోతే తనను చంపేస్తామని కొందరు బెదిరిస్తున్నారని అన్వేష్‌ వాపోయారు.

అయితే తను మాత్రం వెనక్కి తగ్గేది లేదన్నట్లు చెప్పుకొచ్చారు. తాను ప్రస్తుతం ఉన్న హోటల్‌ పేరును ప్రస్తావిస్తూ.. దమ్ముంటే రావాలంటూ సవాల్‌ విసిరాడు అన్వేష్‌. అయితే ఈ విషయాన్ని కూడా అన్వేష్‌ తనదైన శైలిలో కామెడీగా చెప్పడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. 

Read more Photos on
click me!

Recommended Stories