Anvesh
ప్రపంచ యాత్రికుడిగా నా అన్వేషణ అన్వేష్ టాప్ యూట్యూబర్ గా పాపులర్ అయ్యాడు. ఒకవైపు ప్రపంచ యాత్రలు చేస్తూనే మరోవైపు సమాజంలో జరుగుతున్న అంశాలపై తనదైన శైలిలో సెటైర్లు వేస్తుంటాడు అన్వేష్. టాలీవుడ్ లో బెట్టింగ్ యాప్స్ వ్యవహారం ఇంత హాట్ టాపిక్ గా మారడం వెనుక అన్వేష్ ప్రమేయం కూడా ఉంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే సెలబ్రిటీలని టార్గెట్ చేస్తూ అన్వేష్ విరుచుకుపడుతున్నాడు.
తాజాగా అన్వేష్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ ల పై సెటైర్లు వేస్తూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపేలా ఉన్నాయి. మంచు లక్ష్మిని విమర్శించే క్రమంలో అన్వేష్ మోహన్ బాబుపై తీవ్ర స్థాయిలో సెటైర్లు వేసారు.
ముందుగా అన్వేష్ ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడుతూ.. ముందుగా ప్రకాష్ రాజ్ విషయానికి వద్దాం. ఆయన విలక్షణ నటుడు 'నేను మోనార్క్ ని నన్నెవరూ మోసం చేయలేరు'. ఆయనకి ఎంత దేశ భక్తి ఉందో తెలుసా.. ఒక భగత్ సింగ్, ఒక సుభాష్ చంద్రబోస్ లాంటి వారంతా ప్రకాష్ రాజ్ లోనే ఉన్నారు. ప్రకాష్ రాజ్ అంటే దేశం దేశం.. దేశం అంటే ప్రకాష్ రాజ్ అన్నట్లుగా ఆయన ఉంటారు. అంత దేశభక్తి ఉన్న ప్రకాష్ రాజ్ గారు ప్రజల కోసం బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేశారు. బెట్టింగ్ యాప్ ద్వారా కోట్లకి కోట్లు తీసుకున్న ప్రకాష్ రాజ్ ఇప్పుడు వాటి వల్ల నష్టపోయిన వారికి ఏమైనా చేస్తారా అని అన్వేష్ ప్రశ్నించారు.
Prakash Raj
ఇప్పుడు క్రమశిక్షణకు మారుపేరు అయిన మంచు మోహన్ బాబు గారి సుపుత్రికా రత్నం మంచు లక్ష్మి గురించి తెలుసుకుందాం అంటూ అన్వేష్ సెటైర్లు మొదలు పెట్టారు. కానీ అన్వేష్ అమ్మాయిల జోలికి పోడు. కాబట్టి పిల్లలు తప్పులు చేస్తే ఎవరిని ప్రశ్నించాలి.. తల్లిదండ్రులని. మంచు లక్ష్మి తండ్రి ఎవరు మోహన్ బాబు గారు.. మోహన్ బాబు గారు అంటే ఏంటి.. క్రమశిక్షణకు మారుపేరు. అటువంటి క్రమశిక్షణ కలిగిన మోహన్ బాబు గారి సుపుత్రిక రత్నం బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసింది. అన్న ఎన్టీఆర్ తర్వాత ఎలాంటి పాత్ర అయినా అలవోకగా చేసే నటుడు మోహన్ బాబు. మహాభారతంలో పది పాత్రలని మోహన్ బాబు గారు ఒక్కరే చేసేస్తారు. ఇంకెవరివల్లా సాధ్యం కాదు.
Vijay Devarakonda
క్రమశిక్షణ తప్పిన టాలీవుడ్ కి క్రమశిక్షణ నేర్పిన వ్యక్తి మోహన్ బాబు గారు. చిరంజీవి గారిని క్రమశిక్షణలో పెట్టింది ఎవరు మోహన్ బాబు గారు. వజ్రోత్సవాల్లో చూశాం కదా. పవన్ కళ్యాణ్ ని క్రమశిక్షణలో పెట్టింది కూడా మోహన్ బాబే. బాలయ్య బాబు అంటే అందరికీ భయం అలాంటి బాలయ్యని కూడా క్రమశిక్షణలో పెట్టింది మోహన్ బాబే. అలాంటి మోహన్ బాబు గారి ఇంట్లో క్రమశిక్షణ లోపించింది అంటూ అన్వేష్ తీవ్రమైన సెటైర్లు వేశారు.
ఇక రానా గురించి మాట్లాడుతూ.. రేవులో తాటిచెట్టు ఎదిగినట్లు ఎదిగాడు కానీ ఇంకిత జ్ఞానం లేదు. రానా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం వల్ల అతడికి హవాలా డబ్బు వచ్చింది అని, విదేశాల్లో కంపెనీలు కొన్నట్లు కూడా రూమర్స్ ఉన్నాయని అన్వేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలాంటి చిన్న సెలెబ్రిటికి కూడా ఒక యాడ్ చేస్తే 5 కోట్లు ఇస్తారు. అలాంటిది బాహుబలిలో నటించిన రానాకి ఇంకెత ఇస్తారో ఊహించుకోండి అంటూ అన్వేష్ హాట్ కామెంట్స్ చేశాడు.
anvesh
లాస్ట్ బట్ నాట్ లీస్ట్ విజయ్ దేవరకొండ.. ఆయన ఒక శిఖరం. చిరంజీవి గారి తర్వాత కష్టపడి ఎదిగిన వ్యక్తి విజయ్ దేవరకొండ. యూత్ లో , అమ్మాయిల్లో మామూలు ఫాలోయింగ్ లేదు. కింది స్థాయి నుంచి కష్టాలు తెలిసిన విజయ్ దేవరకొండ చివరికి బెట్టింగ్ యాప్స్ ని ప్రోత్సాహిస్తున్నాడు అంటూ అన్వేష్ సెటైర్ల వర్షం కురిపించాడు. అన్వేష్ చేస్తున్న విమర్శలు,సెటైర్లు ఎంత దూరం వెళతాయో చూడాలి.
అన్వేష్ కామెంట్స్ ఇక్కడ చూడండి