సమంత కంటే రాజ్ నిడిమోరు ఎంత పెద్దవాడో తెలుసా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?

Published : Dec 01, 2025, 04:30 PM IST

Samantha Raj Age Gap : స్టార్ హీరోయిన్  సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరును రెండో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని సమంత స్వయంగా వెల్లడించింది. ఈక్రమంలో ఈ ఇద్దరు స్టార్స్ మధ్య  వయసు తేడా ఎంతో తెలుసా? సమంత కంటే రాజ్ ఎంత పెద్దవాడు? 

PREV
15
సమంత, రాజ్ నిడిమోరు పెళ్ళి ఫోటోలు వైరల్

ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో  చక్కర్లు కొడుతున్న అతిపెద్ద బ్రేకింగ్ న్యూస్.. సమంత  రెండో పెళ్లి. 'ది ఫ్యామిలీ మ్యాన్' ఫేమ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు, సమంత పెళ్ళి చేసుకున్నారు. చాలా కాలగా  ప్రేమలో ఉన్న ఈ జంట.. తమ ప్రేమను పెళ్లి బంధంగా మార్చుకున్నారు. కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్ ఆశ్రమంలో ఈ జంట ఒక్కటయ్యారు. ఈ ఇద్దరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

25
పెళ్లిని అఫీషియల్ గా ప్రకటించిన సమంత

ఈ రోజు, అంటే డిసెంబర్ 01, 2025న ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.. ఆడంబరాలకు పోకుండా, కొద్దిమంది బంధువుల సమక్షంలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్నారు. ఆధ్యాత్మికతపై ఎక్కువ ఆసక్తి ఉన్న సమంత, కోయంబత్తూరులోని ప్రసిద్ధ 'ఈశా యోగా కేంద్రంలో' పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని  సమంత తన ఇన్ స్టా గ్రామ్ పేజ్ లో ఫోటోలతో సహా ప్రకటించింది. 

35
సమంత, రాజ్ మధ్య వయసు తేడా

హీరోయిన్  సమంత, రాజ్ నిడిమోరు పెళ్లి చేసుకున్నారనే వార్త ఒకవైపు వ్యాపిస్తుండగా, మరోవైపు వాళ్ల గురించి చాలామందికి తెలియని కొన్ని విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. అందులో ఒకటి వాళ్లిద్దరి మధ్య వయసు తేడా. దాని ప్రకారం, సమంత కంటే రాజ్ నిడిమోరు పెద్దవాడు. నటి సమంతకు ప్రస్తుతం 38 ఏళ్లు. కానీ రాజ్ నిడిమోరుకు ఇప్పుడు 50 ఏళ్లు.

45
సమంత కంటే రాజ్ 12 ఏళ్లు పెద్ద

ఇంటర్నెట్ సమాచారం ప్రకారం హీరోయిన్ సమంత 1987 ఏప్రిల్ 28న జన్మించింది. దీంతో ప్రస్తుతం ఆమె వయసు 38 ఏళ్లు. అదే విధంగా డైరెక్టర్ రాజ్ నిడమోరు 1975 ఆగస్టు 4న ఆంధ్రప్రదేశ్‌లో జన్మించాడు. 2025 నాటికి ఇతనికి 51 ఏళ్లు. దీంతో వీరిద్దరి మధ్య వయసు వ్యత్యాసం 12 ఏళ్లు. ఈ విషయంపై ప్రస్తుతం  అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

55
సినిమాల్లోనూ బిజీగా ఉన్న జంట

వ్యక్తిగత జీవితమే కాకుండా, సమంత, రాజ్ వృత్తిపరంగా కూడా కలిసి పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన సమంత బ్రాండ్ లాంచ్ ఈవెంట్‌లో రాజ్, సమంత ఒకరినొకరు కౌగిలించుకున్న ఫోటో వైరల్ అయింది. ఇది చూసిన అభిమానులు, ఇద్దరూ తమ బంధాన్ని "ఇన్‌స్టా అఫీషియల్" చేశారని మాట్లాడుకున్నారు. అంతేకాదు, నందిని రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న తెలుగు యాక్షన్ డ్రామా 'మా ఇంటి బంగారం' సినిమాను ఇద్దరూ కలిసి నిర్మిస్తున్నారు. ఇక పెళ్ళి బంధంతో ఒక్క టైన ఈ జంట.. ముందు ముందు వరుస సినిమాలతో సందడి చేయబోతున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories