Allu Arjun Pushpa 2 : ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రన్ టైమ్ ఎక్కువగా ఉన్న సినిమాలు చాాలా ఉన్నాయి. అందులో పుష్ప2 కూడా చోటు సంపాదించుకుంది. ఎక్కువ రన్ టైమ్ కలిగి ఉన్న టాప్ 10 సినిమాలు ఏవో తెలుసా?
ఎక్కువ డ్యూరేషన్ ఉన్న సినిమాల్లో పుష్ప2 కూడా ఉంది. పాన్ ఇండియా హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈసినిమా 2024లో రిలీజ్ అయ్యి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక పుష్ప 2 రన్‌టైమ్ 3.21 గంటలు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్. గా నటించింది.
210
ధురంధర్
రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ధురంధర్ సినిమా 3.32 గంటల నిడివి ఉంది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. ఇందులో రణ్‌వీర్ సింగ్ తో పాటు సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించారు.
310
గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్
మనోజ్ బాజ్‌పేయి నటించిన 2012 నాటి 'గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్' రన్‌టైమ్ 5.19 గంటలు. రన్‌టైమ్ ఎక్కువగా ఉండటంతో దీన్ని 2 భాగాలుగా విడుదల చేశారు. దీనికి అనురాగ్ కశ్యప్ దర్శకుడు.
దర్శకుడు అశుతోష్ గోవారికర్ 2008లో తీసిన 'జోధా అక్బర్' సినిమా రన్‌టైమ్ 3.50 గంటలు. ఈ సినిమాలో హృతిక్ రోషన్, ఐశ్వర్య రాయ్ హీరో హీరోయిన్ గా నటించారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
510
సల్మాన్ ఖాన్ సలామ్-ఎ-ఇష్క్
దర్శకుడు నిఖిల్ అద్వానీ 2007లో తీసిన 'సలామ్-ఎ-ఇష్క్' సినిమా రన్‌టైమ్ 3.36 గంటలు. ఈ మల్టీస్టారర్ సినిమాలో సల్మాన్ ఖాన్, ప్రియాంక చోప్రా జంటగా నటించారు.
610
ఎల్‌ఓసీ కార్గిల్
అజయ్ దేవగణ్ 2003లో హీరోగా నటించిన 'ఎల్‌ఓసీ కార్గిల్' రన్‌టైమ్ 4.15 గంటలు. జేపీ దత్తా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, సైఫ్ అలీ ఖాన్, రాణి ముఖర్జీ లాంటి చాలా మంది స్టార్లు నటించారు.
710
లగాన్' రన్‌టైమ్
ఆమిర్ ఖాన్ సూపర్ హిట్ సినిమాల్లో 'లగాన్' కూడా ఒకటి. ఈసినిమా రన్‌టైమ్ 3.44 గంటలు. 2001లో రిలీజ్ అయిన ఈసినిమాను ి అశుతోష్ గోవారికర్ డైరెక్ట్ చేశారు. . సినిమాలో గ్రేసీ సింగ్, రాచెల్ షెల్లీ, దయాశంకర్ పాండే ప్రధాన పాత్రల్లో నటించారు.
810
మొహబ్బతేన్
షారుఖ్ ఖాన్ 2000లో నటించిన 'మొహబ్బతేన్' సినిమా రన్‌టైమ్ 3.36 గంటలు. ఆదిత్య చోప్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షారుఖ్‌తో పాటు అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ ఉన్నారు.
910
హమ్ ఆప్కే హై కౌన్
మాధురి దీక్షిత్, సల్మాన్ ఖాన్ నటించిన 'హమ్ ఆప్కే హై కౌన్' రన్‌టైమ్ 3.26 గంటలు. 1994లో వచ్చిన ఈ సినిమాకి సూరజ్ బర్జాత్యా దర్శకుడు. ఇందులో అనుపమ్ ఖేర్, అలోక్ నాథ్, రీమా లాగూ, మోహ్నీష్ బహల్ ప్రధాన పాత్రల్లో నటించారు.
1010
మేరా నామ్ జోకర్
1970లో దర్శకుడు-నటుడు రాజ్ కపూర్ తీసిన మల్టీస్టారర్ సినిమా ‘మేరా నామ్ జోకర్’. ఈ సినిమా రన్‌టైమ్ 3.44 గంటలు. ఇందులో ధర్మేంద్ర, సిమి గరేవాల్, రిషి కపూర్ తదితరులు నటించి మెప్పించారు.