రాజమౌళి అవసరం లేకుండా ఇండస్ట్రీ హిట్ కొట్టిన హీరోయిన్..సమంత కెరీర్ టాప్ 8 మూవీస్ ఇవే

Published : Dec 01, 2025, 03:35 PM IST

సమంత టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్లలో ఒకరు. అగ్ర హీరోలతో ఆమెకి ఎక్కువ హిట్లు ఉన్నాయి. సోలో హీరోయిన్ గా కూడా సక్సెస్ అయింది. సమంత కెరీర్ లో టాప్ 8 బెస్ట్ మూవీస్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
19
సమంత కెరీర్ టాప్ 8 మూవీస్

తెలుగు సినిమాలో సమంత ఒక సంచలనం అనే చెప్పాలి. ఏ మాయ చేసావే చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన సమంత టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారింది. మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా అగ్ర హీరోలతో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత నాగ చైతన్యని సమంత ప్రేమ పెళ్లి చేసుకుంది. మూడేళ్లకే ఇద్దరూ విడిపోయారు. ఇలా ప్రతి సందర్భంలో సమంత వార్తల్లో ఉంటూనే ఉంది. తాజాగా సోమవారం రోజు సమంత.. రాజ్ నిడిమోరుని రెండో వివాహం చేసుకుంది. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత, రాజ్ నిడిమోరుతో ప్రేమలో పడింది. ఎట్టకేలకు వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. దీనితో సమంత కెరీర్ విశేషాలు, ఆమె బెస్ట్ మూవీస్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సమంత కెరీర్ లో టాప్ 7 మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

29
ఏ మాయ చేశావే

సమంతకి ఇది డెబ్యూ మూవీ. తొలి చిత్రంలోనే నాగ చైతన్యతో సమంత రొమాన్స్ పండించింది. ఈ మూవీలో ఇద్దరి మధ్య కిస్సింగ్ సీన్స్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఇలా తొలి చిత్రంతోనే సమంత ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది.

39
దూకుడు

మహేష్ బాబు సరసన సమంత నటించిన ఈ చిత్రం ఆమె కెరీర్ లో తొలి కమర్షియల్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. దీనితో మరింతగా సమంత పేరు టాలీవుడ్ లో మారు మోగింది. శ్రీనువైట్ల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.

49
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేష్, మహేష్ బాబు నటించిన మల్టీ స్టారర్ చిత్రం ఇది. ఈ మూవీలో మరోసారి సమంత మహేష్ కి హీరోయిన్ గా నటించింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించడమే కాదు.. సమంతని ఫ్యామిలీ ఆడియన్స్ కి చేరువ చేసింది.

59
అత్తారింటికి దారేది

పవన్ కళ్యాణ్ సరసన ఈ చిత్రంలో సమంత నటించింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచి సంచలనం సృష్టించింది. ఇటీవల కాలంలో రాజమౌళి సినిమాలతో కాకుండా ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఘనత సమంతకి దక్కుతుంది.

69
మనం

అక్కినేని ఫ్యామిలీ చిత్రంలో సమంత, నాగ చైతన్య మరోసారి జంటగా నటించారు. ఈ చిత్రంలో నటించే సమయానికే సామ్, చైతు ప్రేమలో ఉన్నారు. ఈ చిత్రం ఆల్ టైం క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచింది.

79
అ..ఆ

త్రివిక్రమ్ దర్శకత్వంలో మరోసారి సమంత నటించిన ఈ చిత్రం యువతని, ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో సమంత పెర్ఫార్మెన్స్ గుర్తుండిపోయే విధంగా ఉంటుంది.

89
రంగస్థలం

సుకుమార్ దర్శకత్వంలో రాంచరణ్, సమంత జంటగా నటించిన ఈ చిత్రం సంచలన విజయం అందుకుంది. అప్పటికి ఇది బాహుబలి తర్వాత టాలీవుడ్ లో అతి పెద్ద హిట్ గా నిలిచింది. రాంచరణ్ తో పాటు ఈ మూవీ సమంత కూడా అదిరిపోయే పెర్ఫార్మెన్స్ అందించింది.

99
ఓ బేబీ

నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ఇది. ఈ మూవీలో సమంత నటన అద్భుతం అనే చెప్పాలి. ఈ మూవీలో సమంత సరదాగా నటిస్తూనే ఎమోషనల్ సీన్స్ లో కంటతడి పెట్టించింది.

Read more Photos on
click me!

Recommended Stories