samantha
Samantha: సమంత అనారోగ్యంతో కొంత కాలం సినిమాలకు బ్రేక్ తీసుకున్న విషయం తెలిసిందే. రీఎంట్రీ ఇవ్వాలనుకునే సమయంలోనే తండ్రి మరణించారు. దీంతో దెబ్బ మీద దెబ్బ పడినట్టయ్యింది. ఇప్పుడు దాన్నుంచి కూడా బయటపడుతుంది.
మళ్లీ తన ప్రయాణం స్టార్ట్ చేస్తుంది. ఒప్పుకున్న సినిమాలు చేస్తుంది. కొత్తగా పలు భారీ ప్రాజెక్ట్ ల్లో భాగమవుతుందట. అల్లు అర్జున్, రామ్ చరణ్ సినిమాల్లో నటించబోతుందనే రూమర్స్ వస్తున్నాయి.
samantha
ఇదిలా ఉంటే తాజాగా సమంత చేసిన కామెంట్స్ పెద్ద రచ్చ అవుతున్నాయి. ఆమె తెలుగు స్టార్ హీరోలు, డైరెక్టర్లకి పెద్ద షాక్ ఇచ్చింది. తన లక్కీ ఛార్మ్ ఎవరో చెప్పింది. తనకు ఫేవరేట్ డైరెక్టర్లు ఎవరో చెప్పింది. ఈ క్రమంలో తెలుగు వారికి పెద్ద హ్యాండిచ్చింది.
మరి ఆ కథేంటో చూస్తే, సమంత లేటెస్ట్ గా చెన్నైలోని ఓ ఈవెంట్‌లో పాల్గొంది. ఇందులో ఓ ఛానెల్ రిపోర్టర్ మూడు ఛాక్లెట్లు ఇచ్చి ఇవి ఇండస్ట్రీలో ముగ్గురు స్వీట్ పర్సన్స్ కి ఇవ్వాల్సి వస్తే ఎవరికి ఇస్తారు? అని ప్రశ్నించారు.
దీనికి సమంత రియాక్ట్ అవుతూ ఒకటి దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కి ఇస్తానని తెలిపింది. ఎందుకంటే అతను తనకు మొదటి ఛాన్స్ ఇచ్చాడు, తనకు సినిమా లైఫ్ ఇచ్చాడు, `ఏం మాయ చేసావె` లాంటి గొప్ప సినిమా ఇచ్చాడు,
ఆయనకు ఫస్ట్ ఛాక్లెట్ ఇస్తానని తెలిపింది. ఆ తర్వాత రెండో ఛాక్లెట్ హీరో విజయ్‌కి ఇస్తానని చెప్పింది. ఆయన తన కెరీర్‌కి లక్కీ ఛార్మ్, అది అందరికి తెలుసు అని, కాబట్టి ఆయనకు ఇస్తానని వెల్లడించింది.
ఇక మూడో ఛాక్లెట్ దర్శకుడు అట్లీకి ఇస్తానని పేర్కొంది. ఆయనతో చాలా సినిమాలు చేశానని, తన ఫేవరేట్ డైరెక్టర్ అని చెప్పింది. ఇలా ముగ్గురు తమిళ స్టార్స్ కే ప్రయారిటీ ఇచ్చింది సమంత. కానీ తెలుగు వారికి హ్యాండిచ్చింది. తెలుగు హీరోలతో, డైరెక్టర్లతో కూడా వర్క్ చేసింది.
ఇంకా చెప్పాలంటే సమంతకి తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక్కడే పాపులారిటీని సొంతం చేసుకుంది. కానీ ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి తమిళ స్టార్స్ కే పెద్ద పీఠ వేయడం ఆశ్చర్యపరుస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
సమంత టాలీవుడ్‌ని పక్కన పెట్టడానికి కారణం తన జీవితంలో జరిగిన సంఘటనలేనా? అనే డౌట్ వ్యక్తం చేస్తున్నారు. అయితే అక్కడ కన్వర్జేషన్ తమిళ ఇండస్ట్రీకి సంబంధించి మాత్రమే జరిగిందని, అందుకే వాళ్ల పేర్లు చెప్పిందని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.