padmanabham
Padmanabham: పద్మనాభం.. నాటకాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. అందులో కూడా విభిన్నమైన పాత్రలు పోషించినప్పటికీ కామెడీ పాత్రలతో పాపులర్ అయ్యారు. ముఖ్యంగా నారద పాత్రలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. సినిమాల్లోకి వచ్చాక కూడా అనేక పౌరాణిక చిత్రాల్లో నారద పాత్రలు పోషించారు.
ఇంకా చెప్పాలంటే ఆయన నారద పాత్రలకు బెస్ట్ ఆప్షన్‌గా నిలిచారు. బాలనటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన అటు సినిమాలు, ఇటు నాటకాలు వేస్తూ రాణించారు. తన ఆరు దశాబ్దాల కెరీర్‌లో నాలుగు వందలకుపైగా చిత్రాలు చేశారు.
padmanabham
మొన్నటి వరకు బ్రహ్మానందం లేకుండా సినిమాలు లేనట్టుగానే, అప్పట్లో పద్మనాభం లేకుండా సినిమాలుండేవి కావు. అంతగా అలరించిన ఆయన ఆర్థికంగానూ బాగానే సంపాదించాడు. నటుడిగా ఏడాదికి పదుల సంఖ్యల్లో సినిమాలు చేసేవారు.
ఆడియెన్స్ ని అలరించేవారు. దీంతో ఆయన ఆస్తులు కూడా బాగానే సంపాదించాడట. ఇప్పటి విలువతో పోల్చితే అప్పట్లో ఆయన వందల కోట్లు సంపాదించాడట. కానీ చివరి రోజుల్లో మాత్రం అన్నీ కోల్పోయాడు.
padmanabham
అందుకు కారణం.. పద్మనాభం నటుడే కాదు, దర్శకుడు, నిర్మాత కూడా. రేఖ అండ్ మురళీ కంబైన్స్ పతాకంపై ఐదారు సినిమాలను నిర్మించారు. నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించారు. అంతేకాదు చాలా సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఎక్కువా ఆయన డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు.
తనకు ఇదే బాగా నష్టాలను తీసుకొచ్చిందట. చివరి రోజుల్లో ఆయన ఆస్తులన్నీ పోయి రోడ్డున పడ్డ పరిస్థితికి రావడానికి ఇదే కారణమట. ఇక్కడే వందల కోట్లు సంపాదించారు. అన్నీ ఇక్కడే పోగొ్ట్టుకున్నారు. తాను సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. కానీ డిస్ట్రిబ్యూషన్ చూసుకోవడం కుదరలేదు, ఎవరినో నమ్మి చేస్తే వాళ్లు మోసం చేశారు.