Prabhu Deva
Prabhu Deva: ప్రభుదేవా రెండు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన మొదట రామలతని 1995లో మ్యారేజ్ చేసుకున్నారు వీరిద్దరు దాదాపు 16ఏళ్లు కలిసి ఉన్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. వారిలో పెద్ద కొడుకు 13ఏళ్ల వయసులో మరణించారు.
అయితే ఆ తర్వాత ప్రభుదేవా హీరోయిన్ నయనతారతో లవ్‌లో పడ్డారు. వీరిద్దరు సహజీవనం చేశారట. ఈ ఆరోపణలతో మొదటి భార్య రామలత ప్రభుదేవాకి విడాకులు ఇచ్చింది. 2011లో వీరిద్దరు విడిపోయారు. అనంతరం నయనతారని మ్యారేజ్ చేసుకోవడానికి రెడీ అయ్యాడు ప్రభుదేవా.
prabhu deva
ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు. పెళ్లి వరకు వెళ్లారు. కానీ అనూహ్యంగా ప్రభుదేవా, నయనతార ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఇది అందరికి షాకిచ్చింది. కొంత కాలం ఒంటరిగానే ఉన్న ప్రభుదేవా ముంబయికి చెందిన డాక్టర్‌తో ప్రేమలో పడ్డాడు.
హిమానీ అనే ఫిజియోథెరఫిస్ట్ ని ప్రభుదేవా 2020లో వివాహం చేసుకున్నారు. రెండేళ్ల క్రితం వీరికి కూతురు జన్మించింది. ఇటీవల తన భార్య, కూతురితో ప్రభుదేవా తిరుమలని దర్శించుకున్న విషయం తెలిసిందే.
prabhu deva, nayanthara
అంతేకాదు ఆ మధ్య కొడుకుతో కలిసి కనిపించాడు ప్రభుదేవా. ఆయన్ని కూడా సినిమాల్లోకి తీసుకొస్తున్నట్టు హింట్ ఇచ్చాడు. అంతేకాదు దీనిపై తన మొదటి భార్య రామలత స్పందించింది. ప్రభుదేవాపై ఆమె ఊహించని వ్యాఖ్యలు చేసింది. కొడుకు సినిమాల్లోకి రావడం గురించి ఆమె స్పందిస్తూ,
మా కొడుకు విషయంలో గర్వంగా ఉందని, ఇంతకాలం కొడుకు డాన్స్ పట్ల అంతగా ఆసక్తి చూపించలేదని, కానీ గత రెండేళ్లలో పూర్తిగా మారిపోయింది. అతను డాన్స్ కోసం ఎంతో కష్టపడుతున్నాడు. తన తండ్రి రక్తం తనలో ప్రవహించడం వల్లే ఈ మ్యాజిక్ జరిగింది. విడాకుల తర్వాత ప్రభుదేవా నాకు ఎంతో మద్దతుగా ఉంటాడని తెలిపింది.