చైతూతో జ‌రిగిన‌ట్లు మ‌ళ్లీ జ‌ర‌గ‌కూడ‌ద‌నేనా.. స‌మంత భూత శుద్ధి వివాహం ప్ర‌త్యేక‌త ఏంటో తెలుసా?

Published : Dec 02, 2025, 01:23 PM IST

Samantha: నాగ చైత‌న్య‌తో విడాకుల త‌ర్వాత చాలా రోజులు ఒంట‌రిగా ఉన్న స‌మంత ఎట్టకేల‌కు రెండో వివాహం చేసుకున్నారు. ద‌ర్శ‌కుడు రాజ్ నిడిమోరుతో కలిసి భూత శుద్ధి విధానంలో వివాహం చేసుకుంది. దీంతో అసలేంటీ భూత శుద్ధి వివాహం అనే చర్చ తెరపైకి వచ్చింది. 

PREV
15
కోయంబత్తూరులో సామ్, రాజ్ వివాహం

ప్రముఖ నటీమణి సమంత కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో లింగ భైరవి దేవాలయంలో సమంత–రాజ్ నిడిమోరు దాంపత్య బంధంలోకి అడుగు పెట్టారు. చాలా కాలంగా వీరిద్దరి గురించి వస్తున్న వార్తలకు ఈ వివాహంతో ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఈశా ఫౌండేషన్ తెలిపిన సమాచారం ప్రకారం వీరిద్దరి వివాహం భూత శుద్ధి అనే ప్రత్యేక పద్ధతిలో జరిగింది.

25
అసలేంటీ భూత శుద్ధి వివాహం?

భూత శుద్ధి అనేది పురాతన యోగ సంప్రదాయంలో ఉన్న పవిత్ర వివాహ ప్రక్రియ. ఈ ఆచారంలో దాంపత్య బంధం కేవలం భావోద్వేగాలకే పరిమితం కాకుండా, మనసు, శరీరం, జీవశక్తి స్థాయిలను సమన్వయించేందుకు రూపొందించిన ప్రత్యేక విధానం. లింగ భైరవి ఆలయంలో పంచభూతాల శుద్ధీకరణ చేయడం ఈ వివాహానికి కేంద్ర‌బిందువు. ఈ ప్రక్రియ ద్వారా భార్యాభర్తల మధ్య లోతైన అనుబంధం ఏర్పడుతుందని నమ్మకం.

35
ఈశా పద్ధతిలో జరిగే వివాహ క్రతువులు

ఈశా ఫౌండేషన్ నిర్వహించే ఈ వివాహంలో సంప్రదాయ మంత్రోచ్చారణతో పాటు యోగ ఆచారాలు కూడా ఉంటాయి. వధూవరుల జీవశక్తి ప్రవాహం సమతౌల్యంగా ఉండేలా ప్రత్యేక విధానాలు చేస్తారు. ఈ క్రతువు తర్వాత దాంపత్య జీవనంలో శాంతి, శ్రేయస్సు, ఆధ్యాత్మికత పెరుగుతాయని భావిస్తారు. ఈ కార్యక్రమాన్ని ఈశా కేంద్రంలోని ప్రత్యేక ప్రదేశాల్లో మాత్రమే నిర్వహిస్తారు.

45
వివాహంపై నెట్టింట చర్చ

సమంత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పెళ్లి వివరాలను వెల్లడించగా నెటిజన్లు భూత శుద్ధి వివాహం గురించి తెలుసుకోవడానికి తెగ సెర్చ్ చేస్తున్నారు. క్రిస్టియన్ నేపథ్యంతో పెరిగిన సమంత ఈ యోగ సంప్రదాయాన్ని ఎంచుకోవడంపై అనేక చర్చలు జరుగుతున్నాయి.

55
ఇప్పటికే పలువురు

ఈశా ఫౌండేషన్‌లో ఈ విధానంలో జరిగే వివాహాలు కేవలం సెలబ్రిటీలకే కాకుండా సాధారణ జంటలు కూడా చేసుకుంటున్నారు. కొంతకాలం క్రితం హిందీ టీవీ నటులు జియా మనేక్, వరుణ్ జైన్ ఈ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు వారి జాబితాలో సమంత–రాజ్ పేర్లు చేరాయి. ఈశా సంస్థ ప్రకారం ఈ వివాహం దంపతులకు ఆధ్యాత్మిక రక్షణతో పాటు దాంపత్య అనుబంధం మరింత బలపడేలా సహకరిస్తుందని నమ్ముతారు.

Read more Photos on
click me!

Recommended Stories