డిసెంబర్‌ లో సినిమాల పండగ, 10 సినిమాల రిలీజ్, ఐదుగురు స్టార్ హీరోల మధ్య భారీ బాక్సాఫీస్ వార్

Published : Dec 02, 2025, 12:47 PM IST

December Release Movies : డిసెంబర్ 2025లో  సినిమాల పండగ జరగబోతోంది.  సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి 10కి పైగా సినిమాలు రిలీజ్ అవుతుండగా.. అందులో 5 సినిమాల మధ్య ఉత్కంఠకర పోరు జరగబోతోంది. బాలకృష్ణ అఖండ 2 తో పాటు డిసెంబర్ లో రిలీజ్ కాబోతున్న సినిమాలెంటి?  

PREV
17
అఖండ 2

నందమూరి బాలకృష్ణ అఖండ సీక్వెల్ అఖండ 2తో తిరిగి వస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ యాక్షన్ సీక్వెన్స్ లతో అభిమానులను అలరించబోతోంది.  ఈ సినిమా  డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయబోతోంది. 

27
లాక్‌డౌన్

ఏఆర్ జీవా దర్శకత్వం వహించిన లాక్‌డౌన్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో చార్లీ, నిరోషా, ప్రియా వెంకట్, లివింగ్‌స్టన్, ఇందుమతి, రాజ్‌కుమార్, శ్యామ్‌జీ, లోలు సభా మారన్, వినాయక్ రాజ్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. 

37
వా వాతియార్

కోలీవుడ్ నుంచి  కార్తి నటించిన  'వా వాతియార్' కూడా రిలీజ్ కు రెడీగా ఉంది డిసెంబర్ 5న ఈ సినిమా విడుదల కానుంది. నలన్ కుమారసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతి శెట్టి, సత్యరాజ్, రాజకిరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

47
మమ్ముట్టి కలమకవల్

సౌత్ సూపర్‌స్టార్ మమ్ముట్టి 'కలమకవల్' ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమా. దీనికి జితిన్ కె జోస్ దర్శకత్వం వహించారు. ఈసినిమా  డిసెంబర్ 5న విడుదల కానుంది. మలయాళంలో ఈసినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. 

57
అంగమ్మాళ్ తో పాటు ది డెవిల్

విపిన్ రాధాకృష్ణన్ దర్శకత్వం వహించిన 'అంగమ్మాళ్' చిత్రంలో గీతా కైలాసం ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆమెతో పాటు శరన్ శక్తి, తెండ్రాల్ రఘునాథన్, భరణి కూడా ఉన్నారు. ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయబోతోంది. ఈసినిమాతో పాటు  దర్శన్ 'ది డెవిల్'  అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమా కూడా రిలీజ్ కు రెడీగా ఉంది. దీనికి ప్రకాష్ రచన, దర్శకత్వం వహించారు. ఈ సినిమా డిసెంబర్ 11న థియేటర్లలో విడుదల కానుంది.

67
ప్రదీప్ రంగనాథన్ తో అరుణ్ విజయ్ పోటీ

విఘ్నేష్ శివన్ సినిమా 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' డిసెంబర్ 18న విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్, ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కృతి శెట్టి  ఈసినిమాలో  హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈసినిమాతో పాటు అరుణ్ విజయ్ హీరోగా నటించిన  'రెట్టా తలా' కూడా డిసెంబర్ 18న విడుదల కానుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి క్రిస్ తిరుకుమారన్ దర్శకుడు. ఇందులో సిద్ధి ఇద్నాని, తాన్య రవిచంద్రన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

77
సర్వమయమ్

సూపర్‌స్టార్ దిలీప్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్-కామెడీ చిత్రం 'భాభాబా' డిసెంబర్ 18న థియేటర్లలో విడుదల కానుంది. ధనంజయ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్‌లాల్ కూడా ఒక చిన్న పాత్ర పోషించారు. ఇక డిసెంబర్ 25 న రిలీజ్ కాబోతోంది మరో మలయాళ సినిమా  'సర్వమయమ్'. నివిన్ పౌలీ నటించిన ఈ మలయాళ ఫాంటసీ కామెడీ-హారర్ చిత్రం డిసెంబర్ 25న విడుదల కానుంది. ఈ చిత్రానికి అఖిల్ సత్యన్ దర్శకత్వం వహించారు. ఇందులో అజు వర్గీస్ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories