Samantha: `మా ఇంటి బంగారం’ టీజర్‌ రివ్యూ, వామ్మో సమంత 2.0.. అజిత్‌ సినిమాకి కాపీనా, ట్రోల్స్

Published : Jan 09, 2026, 11:01 PM IST

నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత నటిస్తోన్న 'మా ఇంటి బంగారం' సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. ఈ టీజర్ చూసిన నెటిజన్లు ఇది అజిత్ సినిమాకు కాపీ అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. 

PREV
14
సమంత కమ్‌ బ్యాక్‌ మూవీ `మా ఇంటి బంగారం`

సమంత రూత్ ప్రభు ఒకప్పుడు సౌత్ ఇండియాలో సూపర్ స్టార్ హీరోయిన్. కానీ ఈ మధ్య అనారోగ్య సమస్యల వల్ల అవకాశాలు తగ్గాయి. అందుకే బాలీవుడ్ వెబ్ సిరీస్‌లపై దృష్టి పెట్టింది. అయితే, ఏడాది క్రితమే సమంత   'మా ఇంటి బంగారం` అనే మూవీని ప్రకటించింది. ఓ రకంగా ఇది సమంత కమ్‌ బ్యాక్‌ మూవీ అని చెప్పొచ్చు.  అనేక కారణాల వల్ల షూటింగ్ ఆలస్యమైంది. ఇప్పుడు 'మా ఇంటి బంగారం' టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్‌లో సమంత రెండు షేడ్స్‌లో కనిపించింది.

24
మా ఇంటి బంగారం టీజర్‌ ఎలా ఉందంటే?

సమంత 'మా ఇంటి బంగారం' టీజర్ రిలీజైంది. ఇందులో ఆమె భర్తగా కన్నడ నటుడు దిగంత్ నటించాడు. ప్రేమించి, ఇంట్లో తెలియకుండా పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్తుంది సమంత. ఉమ్మడి కుటుంబంలో ఆమె ప్రతి అడుగు పరీక్షకు గురవుతుంది. కానీ సమంత నవ్వుతూ అందరి మనసులు గెలుచుకుంటుంది.

34
సమంత విశ్వరూపం

ఇంట్లో పద్ధతిగా గల ఇల్లాలుగా కనిపించిన సమంత, ఇళ్లు దాటితో మరో అవతారం చూపించింది. రాత్రిళ్లు విశ్వరూపం చూపించింది. ఇందులో సమంత పాత్రలో మరో షేడ్‌ ఉంది.  టీజర్‌లో చూపించినట్టు, సమంత ఏ హీరోకి తక్కువ కాదన్నట్టు ఫైట్ చేస్తుంది, విలన్లను చితక్కొడుతుంది. చీర కట్టులో ఉన్నా, కాళిలా విలన్లపై దాడి చేస్తుంది.  ఈ సాహసాలన్నీ అత్తారింట్లోనే జరుగుతాయి. ఇంట్లో వాళ్ల కంట పడకుండా సమంత ఈ పనులు చేస్తుంది.

44
సమంత అదిరిపోయే కమ్‌ బ్యాక్‌

సమంత ఆవేశానికి కారణం, ఆ రౌడీలు ఎవరనేది తెలియాలంటే సినిమా చూడాలి. టీజర్ మాత్రం అదిరిపోయింది.  ఇది ట్రెండ్‌ అవుతుంది. సమంతలోని కొత్త కోణం ఇప్పుడు ఆడియెన్స్ చూడబోతున్నారని చెప్పొచ్చు. గతంలో `ది ఫ్యామిలీ మేన్‌ 2`లో ఇలా యాక్షన్‌ చేసింది సమంత, ఇప్పుడు మరోసారి `మా ఇంటి బంగారం` మూవీ కోసం చేస్తుంది. ఇందులో సమంత 2.0 కనిపించిందని చెప్పాలి. ఇక ఈ టీజర్‌ని చూసిన అభిమానులు ఇది అజిత్ 'వీరం' సినిమా కాపీ అని పోలుస్తున్నారు. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను తన భర్త రాజ్‌ నిడిమోరుతో కలిసి సమంత నిర్మిస్తుండటం విశేషం. అయితే ఇందులో సమంత తెలంగాణ యాసలో మాట్లాడింది. కానీ అది సెట్‌ కాలేదు. ఇంకా వర్క్‌ చేయాల్సింది. మొత్తంగా సమంత కమ్‌ బ్యాక్‌ అదిరిపోయేలా ఉండబోతుందని `మా ఇంటికి బంగారం` టీజర్‌ చూస్తుంటే అర్థమవుతుంది. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories