మన శంకరవరప్రసాద్ గారు` మూవీ కోసం చిరంజీవి, వెంకటేష్, నయనతార, దర్శకుడు అనిల్ రావిపూడి ఎంత పారితోషికం తీసుకుంటున్నారనేది ఆసక్తికరంగా మారింది. హీరో కంటే దర్శకుడికే ఎక్కువ అని తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం `మన శంకరవరప్రసాద్ గారు` మూవీలో నటించారు. సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. లేడీ సూపర్ స్టార్ నయనతార ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. హీరో వెంకటేష్ కీలక పాత్రలో కాసేపు మెరవబోతున్నారు. చిరు కూతురు సుస్మిత, సాహు గారపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
25
ఫ్యామిలీని టార్గెట్ చేసిన అనిల్
సంక్రాంతి పండుగని టార్గెట్‌గా చేసుకుని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా దీన్ని రూపొందించారు అనిల్. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. వైఫ్ విషయంలో హీరో ఇబ్బందులు పడటం, పైకి పులిలా ఉన్నా, ఇంట్లో పిల్లిలా ఉండటం ఇందులో చూడొచ్చు. ఈ విషయాల్లో అనిల్ తన మార్క్ ని గట్టిగా చూపించబోతున్నట్టు తెలుస్తోంది. సంక్రాంతి పండగంటే ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా వినోదం కావాలి. కామెడీ, ఫ్యామిలీ ఎలిమెంట్లు, సెంటిమెంట్లు, భార్యాభర్తల గొడవలు, యాక్షన్, రొమాన్స్, మంచి పాటలు ఉంటే సినిమా కచ్చితంగా హిట్టే. దీన్నే దృష్టిలో పెట్టుకుని దర్శకుడు ఈ మూవీని తీర్చిదిద్దినట్టు సమాచారం.
35
చిరంజీవికి అత్యధిక పారితోషికం
ఈ మూవీ కోసం ఆర్టిస్ట్ లు ఎంత పారితోషికం తీసుకున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో మెయిన్ కాస్టింగ్‌కి సంబంధించిన సమాచారం నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ మూవీ కోసం మెగాస్టార్ చిరంజీవికి భారీగా పారితోషికం ఇస్తున్నారట. ఏకంగా రూ.70కోట్లు చెల్లిస్తున్నట్టు సమాచారం. గతంతో పోల్చితే చిరు ఈ మూవీకే తన కెరీర్‌లోనే హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని సమాచారం.
దర్శకుడు అనిల్ రావిపూడికి ఏకంగా రూ.25కోట్లు ఇస్తున్నారట. సాధారణంగా ఆయన కలెక్షన్లలో షేర్ అడుగుతుంటారు. మరి ఈ విషయంలోనూ అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారా? అనేది చూడాలి. ఇక విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో ఎక్స్ టెండెడ్ కోమియో రోల్ చేస్తున్నారు. ఆయన పాత్ర ఓ అరగంట సేపు ఉంటుందట. ఆ సమయంలో మూవీ వేరే లెవల్‌లో ఉంటుందట. దీంతో ఇందులో నటించినందుకుగానూ వెంకటేష్ కి రూ.9కోట్లు ఇస్తున్నట్టు టాక్. అంటే ఇందులో వెంకీ కంటే దర్శకుడు అనిల్‌కే ఎక్కువ పారితోషికం ఇస్తున్నట్టు సమాచారం.
55
నయనతార పారితోషికం వివరాలు
హీరోయిన్‌గా నటిస్తున్న నయనతారకి కూడా గట్టిగానే రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. ఆమెకి ఏకంగా రూ.5కోట్లు ఇస్తున్నట్టు సమాచారం. ఇక భీమ్స్ కి సుమారు రెండు కోట్ల వరకు పారితోషికంగా అందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా పారితోషికాలే భారీగానే ఉన్నాయి. ఈ మూవీకి రెండు వందల కోట్ల బడ్జెట్ అయినట్టు సమాచారం. ఈ మూవీకి రూ.210కోట్ల బిజినెస్ అయ్యిందని సమాచారం. సెన్సార్ తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న `మన శంకరవరప్రసాద్ గారు` మూవీ ఈ నెల 12న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది.