Samantha:చిక్కులన్నీ వీడినట్లే సూపర్ హ్యాపీగా కనిపిస్తున్న సమంత, క్లోజ్ ఫ్రెండ్ ప్రీతమ్ డిజైన్ చేసిన డ్రెస్ లో

First Published | Nov 16, 2021, 1:38 PM IST

సమంత అక్కినేని కాస్త...  సమంత రూత్ ప్రభుగా మారిపోయింది. నాగ చైతన్యకు విడాకులు ఇచ్చి అక్కినేని కుటుంబం తో తెగదెంపులు చేసుకుంది. విడాకుల వ్యవహారంలో సోషల్ మీడియాలో హైడ్రామా నడిచింది. 
 

ఇద్దరు సెలెబ్రిటీలు విడాకులు తీసుకున్నారంటే... సాధారణంగా కారణాలు వెతికే పనిలో ఉంటారు జనాలు. సమంత-చైతు విషయంలో కూడా అదే జరిగింది. అయితే మెజారిటీ వర్గాలు సమంతను టార్గెట్ చేయడం జరిగింది. సమంత ప్రవర్తనే విడాకులకు దారితీసిందని అనేక కథనాలు తెరపైకి వచ్చాయి. 

పెళ్లి తర్వాత కూడా నాగ చైతన్య(Naga chaitanya) ఆమెకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు. సౌత్ లో పెళ్లి తర్వాత హీరోయిన్స్ సినిమాలు చేయడాన్ని భర్తలు అంగీకరించరు. అలాంటిది సమంత బోల్డ్ రోల్స్ కూడా చేశారు. ఇక ఆమె డ్రెస్సింగ్ సెన్స్, పరాయి పురుషులతో సన్నిహితంగా దిగిన ఫోటోల ఆధారంగా, ఆమెనే తప్పు చేశారంటూ నిరాధారమైన రాతలు రాశారు.


తనపై వస్తున్న ఆరోపణలకు సమంత (Samantha) సోషల్ మీడియా వేదికగా బదులిచ్చారు. శృతిమించిన కథనాలు ప్రసారం చేసిన వారిపై న్యాయ పోరాటం చేయడం జరిగింది. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ పై సమంత పరువు నష్టం దావా కేసు వేయడం జరిగింది. కోర్ట్ సమంతకు సంబంధించిన ఆ కంటెంట్ తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. 
 

విడాకుల వలన మానసికంగా కుంగిపోయినట్లు సమంత పరోక్షంగా తెలిపారు. ఆ బాధ నుండి బయటపడేందుకు ఆమె క్లోజ్ ఫ్రెండ్స్ తో వరుస టూర్స్ వేయడం జరిగింది. కాగా సమంత పూర్తిగా ఈ బాధ నుండి బయటపడినట్లు తెలుస్తుంది. కెరీర్ లో బిజీ అయిన సమంత, భవిష్యత్ వైపు చూస్తూ... గతాన్ని మర్చిపోయారని అనిపిస్తుంది. 
 


తాజా ఫోటో షూట్ చూస్తే ఈ విషయం మనకు అర్థం అవుతుంది. సమంత బెస్ట్ ఫ్రెండ్, డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ (Preetham jukalker)రూపొందించిన డిజైనర్ వేర్ లో సమంత ఫోటో షూట్ చేశారు. నవ్వులతో వెలిగిపోతున్న సమంత ముఖంలో కొత్త కళ, ఉత్సాహం కనిపిస్తుంది. 
 

ఇక అనేక క్రేజీ ప్రాజెక్ట్స్ ఓకె చేసిన సమంత.. .అనూహ్యంగా పుష్ప మూవీలో ఐటమ్ సాంగ్ చేయడానికి సిద్ధం అయ్యారు. కెరీర్ లో సమంత ఓ స్పెషల్ సాంగ్ లో నటించనున్నారు. దీనిపై నిన్న అధికారిక ప్రకటన కూడా రావడం జరిగింది. స్పషల్ సాంగ్ లో సమంత అందాల విందు ఓ రేంజ్ లో ఉంటుందన్న మాట వినిపిస్తుంది. 
 

ఇక తమిళ చిత్రం కాదువాకుల రెండు కాదల్ చిత్రంలో సమంత నటిస్తున్నారు. విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న ఈ మూవీలో నయనతార మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. దర్శకుడు విగ్నేష్ శివన్ తెరకెక్కిస్తుండగా సమంత లుక్ విడుదల చేశారు. 
 


ఇక దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న భారీ పౌరాణిక చిత్రం శాకుంతలం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. శాకుంతలం పాన్ ఇండియా చిత్రంగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. 

Also read Samantha: ఫస్ట్ టైమ్‌లో సమంత ఐటెమ్‌ సాంగ్‌.. `పుష్ప` టీమ్‌ అఫీషియల్‌ అనౌన్స్ మెంట్‌

Also read Pushpa: 'ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా' అంటూ వచ్చేస్తున్న బన్నీ.. మరో ఊర మాస్ గెటప్ లో ఐకాన్ స్టార్
 

Latest Videos

click me!